స్మార్ట్‌ఫోన్ కాకుండా ఓ మంచి ఫీచర్ ఫోన్ కొనాలనుకునేవారికి శుభవార్త. గతేడాది మార్కెట్లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచిన నోకియా 8110 4జీ(బనానా ఫోన్) ధర రూ.1,000 తగ్గింది. గతేడాది మొబైల్ వాల్డ్ కాంగ్రెస్‌లో నోకియా బనానా ఫోన్‌ను హెచ్ఎండీ గ్లోబల్ ఆవిష్కరించినప్పుడే ఈ ఫోన్ హాట్‌టాపిక్‌గా మారింది. ఆ తర్వాత ఇండియాలో బనానా ఫోన్‌ను రిలీజ్ చేసింది హెచ్ఎండీ గ్లోబల్. ఇండియాలో ఫీచర్ ఫోన్ మార్కెట్లో ఎన్నెన్నో సంచలనాలు సృష్టించిన నోకియా... బనానా ఫోన్‌తో ఆకట్టుకుంది. రిలీజ్ సమయంలో ఈ ఫోన్ ధర రూ.5,999. ఇప్పుడు ఈ ఫోన్ ధర రూ.1,000 తగ్గింది. కంపెనీ అధికారిక స్టోర్‌లో నోకియా 8110 ఫీచర్ ఫోన్‌ను రూ.4,999 ధరకే కొనొచ్చు.
నోకియా బనానా ఫోన్ గతంలో నోకియా తీసుకొచ్చిన స్లైడర్ ఫోన్ లాంటిదే. బనానా ఫోన్ 1996లో రిలీజైన నోకియా 8110 పాత మోడల్ని గుర్తుచేస్తుంది. ఫీచర్ ఫోన్, స్మార్ట్ఫోన్ల కలయికే బనానా ఫోన్(నోకియా 8110). కేఏఐఓఎస్తో పనిచేస్తుంది. చిన్న మోనోక్రోమ్ డిస్ప్లే, ఎక్స్టర్నల్ యాంటెన్నాతో పాటు స్లైడింగ్ కీబోర్డ్ కవర్ ఆకట్టుకుంటుంది. కీబోర్డ్ కవర్ స్లైట్ చేసి కాల్ లిఫ్ట్ చేయొచ్చు. కట్ చేయొచ్చు. ఈ ఫోన్ పసుపు రంగులో అందుబాటులో ఉండటంతో అరటిపండును తలపిస్తుంది. 4జీ సపోర్ట్ చేయడంతో పాటు వాట్సప్, గూగుల్ మ్యాప్స్, యూట్యూబ్, ఫేస్‌బుక్‌తో పాటు మరికొన్ని యాప్స్ ఉపయోగించుకోవచ్చు. జీమెయిల్, మైక్రోసాఫ్ట్ ఔట్లుక్ నుంచి కాంటాక్ట్స్ సింక్ చేసుకోవచ్చు. వెబ్ బ్రౌజర్, క్యాలిక్యూలేటర్, ఎఫ్ఎం రేడియో, మ్యూజిక్ ప్లేయర్, వాయిస్ రికార్డర్‌తో పాటు ఒరిజినల్ స్నేక్ గేమ్ కూడా ఉన్నాయి. 1500 ఎంఏహెచ్ బ్యాటరీ స్టాండ్‌బై టైమ్ 25 రోజులు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.