బనానా ఫోన్(నోకియా 8110) రిలీజ్ చేసిన నోకియా!

బనానా ఫోన్ 1996లో రిలీజైన నోకియా 8110 పాత మోడల్‌ని గుర్తుచేస్తుంది. మొత్తానికి బనానా ఫోన్ ఇండియాలో లాంఛైంది. ధర రూ. 5,999. అక్టోబర్ 24న సేల్ మొదలవుతుంది.

news18-telugu
Updated: October 11, 2018, 5:29 PM IST
బనానా ఫోన్(నోకియా 8110) రిలీజ్ చేసిన నోకియా!
బనానా ఫోన్(నోకియా 8110)
  • Share this:
ఫీచర్ ఫోన్ మార్కెట్‌లో ఒకప్పుడు నోకియా సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. ఆ కంపెనీ నుంచి వచ్చిన ఫోన్లన్నీ అలా హిట్టయ్యేవి. యూజర్లకు ఎప్పటికీ గుర్తుండిపోయేవి. ఇప్పుడు అలాంటి మరో ఫోన్ రిలీజ్ చేసింది నోకియా. అదే బనానా ఫోన్. అసలు పేరు నోకియా 8110.

ఓల్డ్ ట్రెండ్ అయిన 'స్లైడర్ ఫోన్'ను మళ్లీ బనానా ఫోన్ రూపంలో తీసుకొచ్చేసింది నోకియా. ఫీచర్ ఫోన్, స్మార్ట్‌ఫోన్‌ల కలయికే బనానా ఫోన్(నోకియా 8110). కేఏఐఓఎస్‌తో పనిచేస్తుంది. గతేడాది పాత మోడల్ 3310 ఫోన్‌కు కొత్త హంగులు అద్దిన నోకియా... ఈసారి మొబైల్ వాల్డ్ కాంగ్రెస్‌లో బనానా ఫోన్‌ని ఆవిష్కరించింది. బనానా ఫోన్ 1996లో రిలీజైన నోకియా 8110 పాత మోడల్‌ని గుర్తుచేస్తుంది. మొత్తానికి బనానా ఫోన్ ఇండియాలో లాంఛైంది. ధర రూ. 5,999. అక్టోబర్ 24న సేల్ మొదలవుతుంది.

బనానా ఫోన్(నోకియా 8110) రిలీజ్ చేసిన నోకియా!, Nokia 8110 4G Banana Phone With KaiOS Launched For Rs 5,999
image: Nokia


బనానా ఫోన్(నోకియా 8110) ప్రత్యేకతలు
చిన్న మోనోక్రోమ్ డిస్‌ప్లే, ఎక్స్‌టర్నల్ యాంటెన్నాతో పాటు స్లైడింగ్ కీబోర్డ్ కవర్ ఆకట్టుకుంటుంది. కీబోర్డ్ కవర్ స్లైట్ చేసి కాల్ లిఫ్ట్ చేయొచ్చు. కట్ చేయొచ్చు. ఈ ఫోన్ పసుపు రంగులో అందుబాటులో ఉండటంతో అరటిపండును తలపిస్తుంది. 4జీ సపోర్ట్ చేయడంతో పాటు వాట్సప్, గూగుల్ మ్యాప్స్, యూట్యూబ్, ఫేస్‌బుక్‌‌తో పాటు మరికొన్ని యాప్స్ ఉపయోగించుకోవచ్చు. జీమెయిల్, మైక్రోసాఫ్ట్ ఔట్‌లుక్‌ నుంచి కాంటాక్ట్స్ సింక్ చేసుకోవచ్చు. వెబ్ బ్రౌజర్, క్యాలిక్యూలేటర్, ఎఫ్ఎం రేడియో, మ్యూజిక్ ప్లేయర్, వాయిస్ రికార్డర్‌తో పాటు ఒరిజినల్ స్నేక్ గేమ్ కూడా ఉన్నాయి. 1500 ఎంఏహెచ్ బ్యాటరీ స్టాండ్‌బై టైమ్ 25 రోజులు. ఈ ఫోన్ కొన్నవాళ్లకు జియో నుంచి 500 జీబీ డేటా లభిస్తుంది.

నోకియా 8110(బనానా ఫోన్)స్పెసిఫికేషన్స్
డిస్‌‌ప్లే: 2.4 అంగుళాల డిస్‌ప్లేర్యామ్: 512 ఎంబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 4 జీబీ
ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 205
రియర్ కెమెరా: 2 మెగాపిక్సెల్, ఎల్‌ఈడీ ఫ్లాష్
ఫ్రంట్ కెమెరా: లేదు
బ్యాటరీ: 1500 ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: కేఏఐఓఎస్
సిమ్ సపోర్ట్: డ్యుయెల్ సిమ్
కలర్స్: యెల్లో, బ్లాక్
ధర: రూ.5,999

ఇవి కూడా చదవండి:

ఇండియాలో లాంఛైన నోకియా 3.1 ప్లస్

రూ.12,999 ధరకే రెడ్‌మీ నోట్ 5 ప్రో!

ఫేస్‌బుక్ క్లోన్ అయినట్టు మెసేజ్ వచ్చిందా?

ఏసుస్ జెన్‌ఫోన్ మ్యాక్స్‌ప్రో ఎం1పై భారీ డిస్కౌంట్లు!

అక్టోబర్ 30న వన్‌ప్లస్ 6టీ లాంఛింగ్ ఈవెంట్: టికెట్ ధర రూ.999

Photos: ఐదు కెమెరాలతో ఎల్‌జీ వీ40 థింక్యూ
Published by: Santhosh Kumar S
First published: October 11, 2018, 5:27 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading