ఫీచర్ ఫోన్ల విషయంలో ఒకప్పుడు నోకియాది తిరుగులేని ఆధిపత్యం ఉండేది. ఆ తర్వాత ఇతర కంపెనీలు గట్టి పోటీ ఇస్తున్నాయి. హెచ్ఎండీ గ్లోబల్‌కు నోకియా మరో రెండు కొత్త ఫీచర్ ఫోన్లను రిలీజ్ చేసింది. ఈ రెండు ఫోన్లు 4జీ నెట్వర్క్ సపోర్ట్ చేస్తాయి. నోకియా 8000 4జీ, నోకియా 6300 4జీ ఫీచర్ ఫోన్లను పరిచయం చేసింది. ఎంట్రీ లెవెల్ యూజర్ల కోసం ఈ ఫోన్లను పరిచయం చేసింది నోకియా. ఫిజికల్ టీ9 కీబోర్డ్, 4జీ సపోర్ట్ లాంటివి ఉంటాయి. ఈ రెండు ఫోన్లలో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 210 ప్రాసెసర్, 1500ఎంఏహెచ్ బ్యాటరీ, గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ లాంటి ప్రత్యేకతలున్నాయి. కేఏఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ ఫోన్లలో వాట్సప్, ఫేస్బుక్ లాంటి యాప్స్ వాడుకోవచ్చు. 2006లో నోకియా రిలీజ్ చేసిన నోకియా 6300 ఫోన్ లాగానే నోకియా 6300 4జీ ఉంటుంది. ఇక 8000 సిరీస్ మోడల్స్ లాగానే నోకియా 8000 4జీ ఉంటుంది. 2018 ఫిబ్రవరిలో నోకియా 8110 4జీ రిలీజైన సంగతి తెలిసిందే. ఇప్పుడు నోకియా 8000 4జీ మోడల్‌ను పరిచయం చేసింది. నోకియా 8000 4జీ ధర 72 యూరోలు. అంటే రూ.6,900. ఇక నోకియా 6300 4జీ ధర 49 యూరోలు. అంటే రూ.4,300. ఈ నోకియా ఫీచర్ ఫోన్లు ఇండియాలో ఎప్పుడు రిలీజ్ అవుతాయన్న వివరాలను వెల్లడించలేదు హెచ్ఎండీ గ్లోబల్.
నోకియా 8000 4జీ స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: 2.8 అంగుళాల QVGA స్క్రీన్
ర్యామ్: 4జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 512ఎంబీ
ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 210
రియర్ కెమెరా: 2మెగాపిక్సెల్ + ఎల్ఈడీ ఫ్లాష్
బ్యాటరీ: 1500ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: కేఏఐఓఎస్
సిమ్ సపోర్ట్: సింగిల్ సిమ్, డ్యూయెల్ సిమ్
కలర్స్: ఓనిక్స్ బ్లాక్, ఓపల్ వైట్, టోపాజ్ బ్లూ, సిట్రైన్ గోల్డ్
ధర: రూ.6,900
నోకియా 6300 4జీ స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: 2.4 అంగుళాల QVGA స్క్రీన్
ర్యామ్: 4జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 512ఎంబీ
ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 210
రియర్ కెమెరా: వీజీఏ కెమెరా
బ్యాటరీ: 1500ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: కేఏఐఓఎస్
సిమ్ సపోర్ట్: సింగిల్ సిమ్, డ్యూయెల్ సిమ్
కలర్స్: సియాన్ గ్రీన్, లైట్ చార్కోల్, పౌడర్ వైట్
ధర: రూ.4,300