Nokia 5310: నోకియా నుంచి మరో ఫీచర్ ఫోన్... ధర రూ.3,399 మాత్రమే

Nokia 5310 Xpress Music Feature phone | మీరు కొత్త ఫీచర్ ఫోన్ కొనాలనుకుంటున్నారా? నోకియా నుంచి కొత్త ఫోన్ వచ్చింది. స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

news18-telugu
Updated: June 16, 2020, 6:24 PM IST
Nokia 5310: నోకియా నుంచి మరో ఫీచర్ ఫోన్... ధర రూ.3,399 మాత్రమే
Nokia 5310: నోకియా నుంచి మరో ఫీచర్ ఫోన్... ధర రూ.3,399 మాత్రమే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
ఒకప్పుడు ఫీచర్ ఫోన్ మార్కెట్‌లో తిరుగులేని ఆధిపత్యం చూపించిన నోకియా... స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో అంతగా రాణించలేకపోయింది. తనకు బాగా పట్టు ఉన్న ఫీచర్ ఫోన్లను రీ బ్రాండ్ చేసి మళ్లీ రిలీజ్ చేస్తోంది నోకియా. ఇప్పటికే నోకియా 3310, నోకియా 8110 బనానా ఫోన్లు రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు ఇండియన్ ఫీచర్ ఫోన్ మార్కెట్లోకి నోకియా 5310 ఎక్స్‌ప్రెస్ మ్యూజిక్ ఫీచర్ ఫోన్‌ను రిలీజ్ చేసింది కంపెనీ. ఇవన్నీ ఒకప్పటి నోకియా ఫీచర్ ఫోన్లే. ఇప్పుడు వాటికి మరిన్ని మెరుగులు దిద్ది కొత్త ఫోన్లను రిలీజ్ చేస్తోంది కంపెనీ. నోకియా 5310 ఎక్స్‌ప్రెస్ మ్యూజిక్ ఫీచర్ ఫోన్‌ను మ్యూజిక్ లవర్స్‌ని ఆకట్టుకునేలా రూపొందించింది నోకియా. డెడికేటెడ్ మ్యూజిక్ బటన్స్ ఉంటాయి. ధర రూ.3,399 మాత్రమే. జూన్ 16న ప్రీ-బుకింగ్ ప్రారంభమైంది. నోకియా అధికారిక వెబ్‌సైట్, అమెజాన్ ప్లాట్‌ఫామ్‌లో ఈ ఫోన్ కొనొచ్చు. జూన్ 23 నుంచి మొదటి నాలుగు వారాలు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటుంది. జూలై 22 నుంచి అన్ని ఆఫ్‌లైన్ స్టోర్లలో ఈ ఫోన్ కొనొచ్చు.

నోకియా 5310 ఎక్స్‌ప్రెస్ మ్యూజిక్ స్పెసిఫికేషన్స్

డిస్‌ప్లే: 2.4 అంగుళాల డిస్‌ప్లే
ర్యామ్: 8ఎంబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 16 ఎంబీ
రియర్ కెమెరా: వీజీఏ విత్ ఫ్లాష్
బ్యాటరీ: 1,200 ఎంఏహెచ్ఆపరేటింగ్ సిస్టమ్: నోకియా సిరీస్ 30+
సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్
కలర్స్: బ్లాక్, వైట్
ధర: రూ.3,399

ఇవి కూడా చదవండి:

Motorola: అదిరిపోయే ఫీచర్స్‌తో 'మోటోరోలా వన్ ఫ్యూజన్+' రిలీజ్... ధర తెలిస్తే షాకే

Smartphone: జూన్‌లో రూ.20,000 లోపు బెస్ట్ 7 స్మార్ట్‌ఫోన్స్ ఇవే

Electric Scooter: 15 రూపాయలకే 100 కిలోమీటర్ల ప్రయాణం... ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అద్భుతం
Published by: Santhosh Kumar S
First published: June 16, 2020, 6:24 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading