Nokia Phones: నోకియా నుంచి బ‌డ్జెట్ స్మార్ట్ ఫోన్లు, ఫీచర్లు, ధరలు

యూర‌ప్‌లో జ‌రుగుతున్న‌ #OnlyGadgetYouNeed ఈవెంట్లో నోకియా-3.4, నోకియా-2.4 మోడ‌ళ్ల‌ను విడుదల చేసింది.

news18-telugu
Updated: September 23, 2020, 7:21 PM IST
Nokia Phones: నోకియా నుంచి బ‌డ్జెట్ స్మార్ట్ ఫోన్లు, ఫీచర్లు, ధరలు
Nokia Smartphones: నోకియా నుంచి రెండు స్మార్ట్‌ఫోన్స్ (image: Nokia India)
  • Share this:
నోకియా పేరెంట్ కంపెనీ హెచ్‌ఎండీ గ్లోబల్ కొత్త‌గా రెండు బ‌డ్జెట్ స్మార్ట్‌ఫోన్ల‌ను విడుద‌ల చేసింది. యూర‌ప్‌లో జ‌రుగుతున్న‌ #OnlyGadgetYouNeed ఈవెంట్లో నోకియా-3.4, నోకియా-2.4 మోడ‌ళ్ల‌ను విడుదల చేసింది. నోకియా-3 సిరీస్‌లో వ‌చ్చిన ఫోన్ల‌లో ట్రిపుల్ రియర్ కెమెరాతో రూపొందిన మొద‌టి స్మార్ట్ ఫోన్ నోకియా-3.4. హోల్-పంచ్ ఫాంట్ ప్యానెల్ దీనికి అద‌నపు ఆక‌ర్ష‌ణ‌. నోకియా-2.4 లో డ్యూయల్ రియ‌ర్ కెమెరా సెటప్ ఉంది. రెండు ఫోన్ల‌నూ HD + డిస్ప్లేలతోనే రూపొందించారు. ఈ బడ్జెట్ ఫోన్ల‌తో పాటు నోకియా- 8.3 5G మొబైల్‌ను త‌యారు చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది. కానీ ఈ మూడు కొత్త నోకియా ఫోన్ల‌ను మ‌న దేశంలో విడుద‌ల చేస్తారో లేదో ఇంకా చెప్ప‌లేదు.

నోకియా-3.4 మోడల్ ప్ర‌త్యేక‌త‌లు

నోకియా-3.4 ధ‌ర 159 యూరోల నుంచి ప్రారంభ‌మ‌వుతుంది. మ‌న క‌రెన్సీలో దీని విలువ‌ సుమారు రూ.13,670. నోకియా-2.4 ధర 119 యూరోలు. ఇది దాదాపు 10,230 రూపాయ‌ల‌కు స‌మానం. నోకియా-3.4లో మొత్తం మూడు వేరియంట్లు ఉన్నాయి. వీటిలో 3 GB ర్యామ్ + 32 GB స్టోరేజ్, 3 GB ర్యామ్ + 64 GB స్టోరేజ్, 4 GB ర్యామ్ + 64 GB స్టోరేజ్ మోడ‌ళ్లు ఉన్నాయి. నోకియా-2.4ను రెండు వేరియంట్లలో విడుద‌ల చేశారు. 2 GB ర్యామ్+32 GB స్టోరేజ్, 3 GB ర్యామ్+64 GB స్టోరేజ్ ఆప్ష‌న్ల‌తో ఇది ల‌భిస్తుంది. ఈ రెండు బ‌డ్జెట్ స్మార్ట్ ఫోన్లు ఈ నెలాఖరులోగా యూరప్‌లో అందుబాటులోకి రానున్నాయి.

ఫీచ‌ర్లు

నోకియా-3.4 మోడ‌ల్లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 460 SoC ర్యామ్, 6.39 అంగుళాల HD+ హోల్-పంచ్ డిస్ప్లే వంటి ఫీచ‌ర్లు ఉన్నాయి. దీంతో పాటు ట్రిపుల్ కెమెరా సెటప్‌లో 13 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2 మెగాపిక్సెల్, 5 మెగాపిక్సెల్ అదనపు కెమెరా యూనిట్లు ఉన్నాయి. 8-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, ఫోన్ ఛార్జింగ్ కోసం టైప్-సి యూఎస్‌బీ, 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ వంటి ప్ర‌త్యేక‌త‌ల‌తో ఈ వేరియంట్ను రూపొందించారు.

నోకియా-2.4 రెండు మోడళ్లలో ల‌భిస్తుంది. మీడియాటెక్ హెలియో పి-22 ప్రాసెసర్‌తో పాటు డ్యుయల్ కెమెరా సెటప్‌లో 13 మెగాపిక్సెల్, 2 మెగాపిక్సెల్ కెమెరా యూనిట్ల‌తో దీన్ని రూపొందించారు.

యాక్సెస‌రీస్‌ కూడారెండు బడ్జెట్ ఫోన్ల‌తో పాటు కొన్ని యాక్సెస‌రీల‌ను కూడా నోకియా విడుద‌ల చేసింది. ఈ జాబితాలో పవర్ ఇయర్ బ‌ర్డ్స్ లైట్‌‌, స్టాండ‌ర్డ్ ప‌వ‌ర్ ఇయ‌ర్బ‌ర్డ్స్‌,  పోర్టబుల్ వైర్‌లెస్ స్పీకర్ ఉన్నాయి. ఇయర్‌బడ్స్ను అక్టోబ‌రు నుంచి వినియోగ‌దారుల‌కు అందుబాటులోకి తీసుకురానున్నారు. లైట్‌ ప‌వ‌ర్ ఇయ‌ర్‌బ‌ర్డ్స్‌ ధ‌ర‌ 59.9యూరోలు (సుమారు రూ.5,100). స్టాండ‌ర్డ్ పవర్ ఇయర్‌బడ్స్‌ ధర 79యూరోలు (సుమారు రూ.6,800). పోర్టబుల్ స్పీకర్లను నవంబరు నుంచి అందుబాటులోకి తీసుకొస్తామ‌ని సంస్థ ప్ర‌క‌టించింది. వీటి ధ‌ర 34.9యూరోలు (సుమారు రూ.3,000).
Published by: Ashok Kumar Bonepalli
First published: September 23, 2020, 7:21 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading