Nokia 2780 Flip: స్మార్ట్ఫోన్లు మనకు అందుబాటులోకి రాకముందు, మార్కెట్లో నోకియా(Nokia) ఫీచర్ ఫోన్లదే హవా ఉండేది. నోకియా నుంచి వచ్చిన వివిధ ఫీచర్ ఫోన్లు ఎంతో పాపులర్ అయ్యాయి. ఇప్పుడు HMD గ్లోబల్ సంస్థ నోకియా ఫోన్లను తయారు చేస్తోంది. ఈ క్రమంలో కంపెనీ గురువారం సరికొత్త ఫ్లిప్ ఫోన్‌ను మార్కెట్లోకి లాంచ్ చేసింది. ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ మోడల్లా కాకుండా, బేసిక్ ఫీచర్ఫోన్గా దీన్ని కంపెనీ తయారు చేసింది. నోకియా 2780 ఫ్లిప్ పేరుతో లాంచ్ అయిన ఈ ఫోన్ ధర, ఫీచర్లు చెక్ చేద్దాం.
స్పెసిఫికేషన్లు
నోకియా 2780 ఫ్లిప్ ఫోన్.. పాతతరం క్లామ్‌షెల్ డిజైన్, T9 కీబోర్డ్, నాన్-టచ్ స్క్రీన్‌తో లభిస్తుంది. ఈ ఫోన్ KaiOS 3.1తో రన్ అవుతుంది. FM రేడియో, MP3 సపోర్ట్, Wi-Fi సపోర్ట్ వంటి ఫీచర్లను దీంట్లో అందించింది. ఈ ఫోన్ VoLTE, RTTకి కూడా సపోర్ట్ చేస్తుంది. దీంట్లో 4GB RAM, 512MB ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. నోకియా 2780 ఫ్లిప్ ఫోన్లో క్వాల్కామ్ 215 చిప్సెట్, 1.3GHz క్వాడ్-కోర్ CPU, 150Mbps పీక్ డౌన్‌లింక్ స్పీడ్ ఉండే X5 LTE మోడెమ్ ఉన్నాయి. ఈ డివైజ్ 1,450 mAH రిమూవబుల్ బ్యాటరీతో వస్తుంది.
Delhi University: ఢిల్లీ యూనివర్సిటీ ఇంటర్న్‌షిప్ స్కీమ్ రిజిస్ట్రేషన్స్ ప్రారంభం.. అర్హత, అప్లికేషన్ ప్రాసెస్ వివరాలు..
ధర ఎంత?
నోకియా 2780 ఫ్లిప్ ఫోన్ ప్రస్తుతానికి యూఎస్‌లో రెడ్, బ్లూ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. దీని ధరను కంపెనీ 90 డాలర్లుగా నిర్ణయించింది. ఈ ఫోన్ సేల్స్ నవంబర్ 15 నుంచి ప్రారంభమవుతాయి. అయితే నోకియా 2780 ఫ్లిప్ ఫోన్‌ను ఇండియాలో రిలీజ్ చేసే విషయంపై కంపెనీ ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే భారతదేశంలో దీని ధర రూ. 5,000 కంటే తక్కువగా ఉండవచ్చని అంచనా.
ఫ్లిప్ ఫోన్లపై ఫోకస్
హెచ్ఎండీ గ్లోబల్ కంపెనీ ఈ ఆగస్టులో నోకియా 2660 ఫ్లిప్ ఫోన్‌ను లాంచ్ చేసింది. ఇది పెద్ద డిస్ప్లే, పెద్ద బటన్స్, హియరింగ్ ఎయిడ్ కంపాటబిలిటీ, ఎమర్జెన్సీ బటన్ వంటి సిగ్నేచర్ ఫీచర్లతో రిలీజ్ అయింది. ఈ ఫ్లిప్ ఫోన్ యూనిసాక్ T107 ప్రాసెసర్, 48MB ర్యామ్‌తో పనిచేస్తుంది. దీంట్లో 128MB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. 32GB వరకు మైక్రో SD కార్డ్‌కు సపోర్ట్ చేసే ఎక్స్టర్నల్ స్టోరేజ్ స్లాట్‌ను కూడా కంపెనీ అందిస్తుంది. ప్రీలోడెడ్ S30+తో వచ్చే ఈ ఫోన్ వివిధ రకాల గేమ్స్‌కు సపోర్ట్ చేస్తుంది. కంపెనీ దీన్ని బ్లాక్, బ్లూ, రెడ్ కలర్ ఆప్షన్లలో రూపొందించింది. నోకియా 2660 ధర రూ. 4,699 వరకు ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Nokia, Smart phone