హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Nokia 110 4G: నోకియా నుంచి రూ.3,000 ధరకే 4జీ ఫోన్

Nokia 110 4G: నోకియా నుంచి రూ.3,000 ధరకే 4జీ ఫోన్

(image: Nokia)

(image: Nokia)

Nokia 110 4G | నోకియా 4జీ కనెక్టివిటీతో మరో రెండు ఫీచర్ ఫోన్లను రిలీజ్ చేసింది. నోకియా 110 4జీ, నోకియా 105 4జీ మోడల్స్ ప్రత్యేకతలు తెలుసుకోండి.

ఒకప్పుడు ఫీచర్ ఫోన్ మార్కెట్‌లో నోకియాదే హవా. స్మార్ట్‌ఫోన్లు వచ్చిన తర్వాత ఫీచర్ ఫోన్లకు డిమాండ్ తగ్గడంతో నోకియా వెనుకబడిపోయింది. స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఇతర కంపెనీల పోటీని నోకియా తట్టుకోలేకపోయింది. అయినా ఇప్పటికీ ఫీచర్ ఫోన్లను రిలీజ్ చేస్తూనే ఉంది. మరో రెండు ఫీచర్ ఫోన్లను ప్రపంచానికి పరిచయం చేసింది నోకియా. 4జీ కనెక్టివిటీతో ఈ ఫోన్లను రిలీజ్ చేసింది. నోకియా 110 4జీ, నోకియా 105 4జీ మోడల్స్‌ను రిలీజ్ చేసింది. సింగిల్ సిమ్, డ్యూయెల్ సిమ్ వేరియంట్లలో ఈ ఫోన్లు లభిస్తాయి. వాస్తవానికి నోకియా 110, నోకియా 105 ఫీచర్ ఫోన్లు 2019 లోనే రిలీజ్ అయ్యాయి. కానీ వీటికి 4జీ సపోర్ట్ లేదు. అందుకే ఇప్పుడు 4జీ కనెక్టివిటీతో ఈ ఫోన్లను రిలీజ్ చేసింది నోకియా.

OnePlus Nord CE 5G: రూ.22,999 ధరకే వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్... కాసేపట్లో సేల్

iQoo Z3 5G: రూ.19,990 విలువైన 5జీ స్మార్ట్‌ఫోన్‌ను రూ.5,490 ధరకే కొనండి ఇలా

నోకియా 110 4జీ, నోకియా 105 4జీ మోడల్స్ డిజైన్ విషయంలో ఒకేలా ఉంటాయి. పాత నోకియా 110, నోకియా 105 ఫీచర్ ఫోన్ల లాగానే ఉంటాయి. 4జీ కనెక్టివిటీ మాత్రం జోడించింది నోకియా. అయితే ఈ ఫోన్ల ధరల్ని మాత్రం ప్రకటించలేదు నోకియా. కానీ ఈ ఫోన్ల ధరలపై ప్రచారాలు ఉన్నాయి. నోకియా 110 4జీ ధర సుమారు రూ.3,600, నోకియా 105 4జీ ధర సుమారు రూ.3,000 ఉంటుందని అంచనా. నోకియా 110 4జీ ఫోన్ బ్లాక్, యెల్లో, ఆక్వా కలర్స్‌లో లభిస్తే, నోకియా 105 4జీ ఫోన్లు బ్లాక్, బ్లూ, రెడ్ కలర్స్‌లో లభిస్తాయి.

BSNL Plan: మూడు నెలలకు రూ.94 మాత్రమే... బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్

Jio 4G Data Plans: మొబైల్ డేటా ఎక్కువ కావాలా? జియో అందిస్తున్న12 డేటా ప్లాన్స్ ఇవే

నోకియా 110 4జీ స్పెసిఫికేషన్స్ చూస్తే 1.80 అంగుళాల డిస్‌ప్లే ఉంది. 128ఎంబీ ర్యామ్, 48ఎంబీ స్టోరేజ్ సపోర్ట్ ఉంది. బ్యాటరీ 1020ఎంఏహెచ్. ఇందులో రియర్ కెమెరా కూడా ఉంది. నోకియా 105 4జీ స్పెసిఫికేషన్స్ కూడా దాదాపు ఇలాగే ఉన్నాయి. కానీ ఇందులో కెమెరా లేదు. ఈ రెండు ఫోన్లు కేఏఐఓఎస్‌తో పనిచేస్తాయి. కేవలం కాల్స్ కోసం ఫోన్ కావాలనుకునేవారికి నోకియా రిలీజ్ చేసిన ఈ ఫీచర్ ఫోన్స్ మంచి ఆప్షన్.


ఇక ఇప్పటికే ఇండియాలో నోకియా 110, నోకియా 105 ఫీచర్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఇవి 4జీ ఫోన్లు కావు. నోకియా 110 ధర రూ.1,749 కాగా, నోకియా 105 ధర రూ.1,299. మరి నోకియా 110 4జీ, నోకియా 105 4జీ మోడల్స్ ఇండియాలో రిలీజ్ అవుతాయో లేదో ఇంకా స్పష్టత లేదు.

First published:

Tags: Mobile, Mobile News, Mobiles, Nokia, Smartphone, Smartphones