Home /News /technology /

Noise Sense: కేవలం 8 నిమిషాల ఛార్జింగ్​తో 8 గంటల బ్యాకప్​... స్టైలిష్​ డిజైన్​తో నాయిస్ సెన్స్ నెక్​బ్యాండ్ వచ్చేసింది

Noise Sense: కేవలం 8 నిమిషాల ఛార్జింగ్​తో 8 గంటల బ్యాకప్​... స్టైలిష్​ డిజైన్​తో నాయిస్ సెన్స్ నెక్​బ్యాండ్ వచ్చేసింది

Noise Sense: కేవలం 8 నిమిషాల ఛార్జింగ్​తో 8 గంటల బ్యాకప్​... స్టైలిష్​ డిజైన్​తో నాయిస్ సెన్స్ నెక్​బ్యాండ్ వచ్చేసింది
(image: Noise)

Noise Sense: కేవలం 8 నిమిషాల ఛార్జింగ్​తో 8 గంటల బ్యాకప్​... స్టైలిష్​ డిజైన్​తో నాయిస్ సెన్స్ నెక్​బ్యాండ్ వచ్చేసింది (image: Noise)

Noise Sense Neckband | మీరు నెక్ బ్యాండ్ కొనాలనుకుంటున్నారా? నాయిస్ నుంచి సెన్స్ నెక్​బ్యాండ్ (Sense Neckband) రిలీజ్ అయింది. ధర, ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి.

ప్రముఖ స్మార్ట్​ ప్రొడక్ట్స్ బ్రాండ్​ నాయిస్​ (Noise) ఇటీవలి కాలంలో వరుసగా ఎయిర్​ బడ్స్​, నెక్​ బ్యాండ్స్​, స్మార్ట్​ వాచ్​లు విడుదల చేస్తుంది. ఇదే దూకుడుతో ఇప్పుడు సరికొత్త నాయిస్ సెన్స్​ (Noise Sense) నెక్​​బ్యాండ్​ను భారత మార్కెట్​లోకి లాంచ్​ చేసింది. వీటిని స్టైలిష్ డిజైన్‌, ఇన్‌స్టాఛార్జ్ టెక్నాలజీతో రూపొందించింది. ఈ డివైజ్ కేవలం 8 నిమిషాల ఛార్జింగ్​తో 8 గంటల బ్యాటరీ బ్యాకప్​ను అందిస్తుందని నాయిస్​ సంస్థ పేర్కొంది. దీన్ని ఒక్కసారి ఫుల్​ ఛార్జ్​ చేస్తే 25 గంటల బ్యాకప్ ఇస్తుంది.

నాయిస్ సెన్స్ నెక్‌బ్యాండ్ ధర


నాయిస్ సెన్స్ నెక్​బ్యాండ్​ అసలు ధర రూ. 2,499 వద్ద ఉండగా.. ప్రారంభపు ప్రత్యేక ఆఫర్​ కింద దీన్ని కేవలం రూ .1099 ప్రారంభ ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. ఆఫర్ ముగిసిన తర్వాత, అసలు ధరకే అందుబాటులో ఉంటుందని సంస్థ పేర్కొంది. ఈ నెక్‌బ్యాండ్‌ను నాయిస్ అధికారిక వెబ్‌సైట్, అమెజాన్‌లో కొనుగోలు చేయవచ్చు. ఇది బ్లాక్, బ్లూ అనే రెండు క్లాసిక్ కలర్​ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది.

Samsung Galaxy M32 5G: రూ.20,999 విలువైన స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్‌లో రూ.1,199 ధరకే కొనండి ఇలా

స్పెసిఫికేషన్లు


నాయిస్ సెన్స్​ను మల్టీ టాస్కింగ్ కోసం రూపొందించారు. కంఫర్ట్​, స్టైల్​, క్రిస్టల్​ క్లియర్​ ఆడియో క్వాలిటీని ఇష్టపడే వినియోగదారులకు ఇది సరైన నెక్​బ్యాంక్. ఈ నెక్‌బ్యాండ్‌లో బ్లూటూత్ 5.0ని అందించింది. ఈజీ కనెక్టివిటీ, ఛార్జింగ్ కోసం దీనిలో యూఎస్​బీ టైప్ సీ కేబుల్​ను చేర్చింది. నాయిస్ సెన్స్ ఇయర్‌బడ్స్​ 10 మి.మీ. సైజు డ్రైవర్లతో వస్తాయి. మెరుగైన కాలింగ్​ కోసం దీనిలో ఇన్​బిల్ట్​ మైక్​ను చేర్చింది. ఇదే కాకుండా కాల్​ రిజెక్ట్​, వాల్యూమ్​, మ్యూజిక్​ కంట్రోల్​ కోసం టచ్​ సపోర్ట్​ను ఇచ్చింది. వీటిని చెవిలో సౌకర్యవంతంగా అమర్చుకునేందుకు సరైన గ్రిప్‌ను అందించింది. ఈ నెక్​ బ్యాండ్​లో గూగుల్​ అసిస్టెంట్​ సపోర్ట్​ కూడా ఉంటుంది.

Smartphone Tips: స్మార్ట్‌ఫోన్ హ్యాంగ్ అవుతోందా? ఈ 3 సెట్టింగ్స్ మార్చి చూడండి

నాయిస్​ సెన్స్ లాంచ్ గురించి నాయిస్ సహ వ్యవస్థాపకుడు గౌరవ్ ఖత్రి మాట్లాడుతూ ‘‘భారత మార్కెట్​లో మా ఆడియో ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియోకు మరో కొత్త ఉత్పత్తిని జోడించినందుకు సంతోషంగా ఉంది. ఈ శక్తివంతమైన, సరసమైన బ్లూటూత్ నెక్‌బ్యాండ్‌ అనేక అధునాతన ఫీచర్లతో వస్తుంది. ముఖ్యంగా భారతీయ యువతను దృష్టిలో పెట్టుకొని దీన్ని డిజైన్​ చేశాం. వారి నుంచి మంచి ఆదరణ లభిస్తుందని ఆశిస్తున్నాం” అని తెలిపారు.
Published by:Santhosh Kumar S
First published:

Tags: Amazon, AMAZON INDIA

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు