NoiseFit App: యోగా ప్లాట్‌ఫామ్​ సర్వాతో నాయిస్​ భాగస్వామ్యం.. ఇకపై నాయిస్‌ఫిట్ యాప్‌లోనే అన్ని రకాల సేవలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రస్తుతం ఫిట్​నెస్​ ట్రైనర్ల​తో పాటు ఫిట్​నెస్​ ఆన్​లైన్​ ప్లాట్​ఫామ్​లకు డిమాండ్​ పెరుగుతోంది. ఈ డిమాండ్​ను దృష్టిలో పెట్టుకొని భారతీయ టెక్ కంపెనీ నాయిస్ కీలక నిర్ణయం తీసుకుంది.

  • Share this:
నేటి బిజీ లైఫ్ స్టైల్​​లో పెరుగుతున్న ఒత్తిడి, ఆందోళన నుంచి బయటపడేందుకు చాలా మంది యోగా, ధ్యానం వైపు చూస్తున్నారు. దీంతో ఫిట్​నెస్​ ట్రైనర్ల​తో పాటు ఫిట్​నెస్​ ఆన్​లైన్​ ప్లాట్​ఫామ్​లకు డిమాండ్​ పెరుగుతోంది. ఈ డిమాండ్​ను దృష్టిలో పెట్టుకొని భారతీయ టెక్ కంపెనీ నాయిస్ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని ప్రముఖ డిజిటల్ యోగా, వెల్​నెస్ ప్లాట్‌ఫామ్ సర్వాతో చేతులు కలిపింది. ఫిట్​నెస్​ ప్రియులు ఇకపై సర్వలోని యోగా, ధ్యాన సెషన్లను కూడా నేరుగా నాయిస్‌ఫిట్ యాప్​ ద్వారా బ్రౌజ్ చేయవచ్చు. తద్వారా వారి ఫిట్‌నెస్ లక్ష్యాలను ఎప్పటికప్పుడు ట్రాక్ చేసుకోవచ్చు. దీనిపై నాయిస్​ సంస్థ ప్రతినిధి మాట్లాడుతూ ‘‘మా భాగస్వామ్యం కస్టమర్ల మానసిక, భావోద్వేగ శ్రేయస్సుపై దృష్టి కేంద్రీకరించింది. కస్టమర్లు తమ ఫిట్​నెస్​ లక్ష్యాలను త్వరగా చేరుకోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది” అని అన్నారు. సర్వా ఇప్పటికే సొంత యాప్​ను కలిగి ఉంది. ఇది సర్వ యోగా, మైండ్​ఫుల్​నెస్​ అనే పేర్లతో యాప్​లను నిర్వహిస్తుంది. ఈ ప్లాట్​ఫామ్​ల ద్వారా వేర్వేరు ధరల్లో వేర్వేరు యోగా, మెడిటేషన్​ వర్క్‌షాప్‌ సెషన్‌లను అందిస్తుంది. ఇవి ఆండ్రాయిడ్, ఐఓఎస్ రెండు వెర్షన్లలో అందుబాటులో ఉన్నాయి.
Eyes Keeper APP: ఈ యాప్ తో స్మార్ట్ ఫోన్ నుంచి కళ్లను కాపాడుకోవచ్చు.. ఎలాగంటే
OnePlus: ఆ స్మార్ట్‌ఫోన్‌ యాప్స్‌ను కిల్‌ చేస్తుందా? వన్‌ప్లస్ 9 ప్రో డివైజ్‌ పనితీరుపై ఆరోపణలు

కరోనాతో పెరిగిన ఆరోగ్య స్పృహ...
ఈ భాగస్వామ్యంపై నాయిస్​ సహ వ్యవస్థాపకుడు గౌరవ్ ఖాత్రి మాట్లాడుతూ.. ‘‘ కరోనా మహమ్మారి కారణంగా ప్రజలు మానసిక, శారీరక శ్రేయస్సుపై ఎక్కువ శ్రద్ధ వహిస్తున్నారు. ఆరోగ్యంపై ప్రజల్లో స్పృహ పెరిగింది. దీంతో, ఫిట్​నెస్​ సంబంధిత యాప్స్​కు విపరీతమైన క్రేజ్​ ఏర్పడింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మానసిక, శారీరక, ఆధ్యాత్మిక శ్రేయస్సు కోరుకునే వారందరికీ అన్ని రకాల సేవలను ఒకేచోటకు చేర్చాం. సర్వాతో చేతులు కలపడం ఆనందంగా ఉంది. మా భాగస్వామ్యంతో ఫిట్​నెస్ ప్రియులకు అన్ని రకాల సేవలు అందిస్తాం” అని చెప్పారు.
Smartphones Under Rs 15000: స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే.. రూ. 15 వేల కన్నా తక్కువ ధరకు లభించే బెస్ట్ ఫోన్లు ఇవే

సర్వ వ్యవస్థాపకుడు, సర్వేష్ శశి కూడా నాయిస్​తో చేతులు కలపడంపై సంతోషం వ్యక్తం చేశాడు. ఆయన మాట్లాడుతూ ‘‘డిజిటల్​ వేదికపై యోగా సేవలు అందించాలనే లక్ష్యంతో మా ప్లాట్​ఫామ్​పై 1500 గంటల యోగా కంటెంట్​ను అందుబాటులోకి తెచ్చాం. నాయిస్​తో భాగస్వామ్యం ద్వారా ఎక్కువ మందికి చేరువవుతాం” అని తెలిపారు.
Published by:Nikhil Kumar S
First published: