ఆడియో ప్రొడక్ట్స్ తయారీ సంస్థ నాయిస్.. కంబాట్ వైర్లెస్ నెక్‌బ్యాండ్ తరహా ఇయర్ఫోన్లను మంగళవారం భారత మార్కెట్లోకి లాంచ్ చేసింది. వీటిలో అదిరిపోయే ఫీచర్లను అందించింది.
కరోనా(Corona) తర్వాత భారత్‌తో స్మార్ట్‌ఫోన్ సేల్స్(Smart phones Sales) బాగా పెరిగాయి. దీంతో ఆడియో ప్రొడక్ట్స్‌కు సైతం మంచి డిమాండ్ ఏర్పడింది. ఈ మార్కెట్‌ను క్యాష్ చేసుకునేందుకు వివిధ సంస్థలు వరుసగా ఇయర్ఫోన్లు, ఇయర్‌బడ్స్‌ను లాంచ్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆడియో ప్రొడక్ట్స్(Products) తయారీ సంస్థ నాయిస్.. కంబాట్ వైర్లెస్ నెక్‌బ్యాండ్ తరహా ఇయర్ఫోన్లను మంగళవారం భారత మార్కెట్లోకి లాంచ్ చేసింది. వీటిలో అదిరిపోయే ఫీచర్లను అందించింది. ఈ నాయిస్ కంబాట్ ఇయర్ఫోన్లు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కలిగి ఉంటాయి. ఒకే ఛార్జ్‌పై గరిష్టంగా 25 గంటల ప్లేబ్యాక్‌ను అందిస్తాయి. ఇవి "బ్రీత్" ఎఫెక్ట్‌కు సపోర్ట్ చేస్తాయి. అంతేకాదు, ఎన్విరాన్మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ (ENC)కి కూడా మద్దతిస్తాయి. ఇవి డ్యూయల్ మైక్ సిస్టమ్‌ను కలిగి ఉంటాయి. ఈ నెక్‌బ్యాండ్- తరహా వైర్లెస్ ఇయర్ఫోన్లు IPX5 రేటింగ్‌తో వాటర్ రెసిస్టన్స్తో వస్తాయి.
నాయిస్ కంబాట్ ధర, లభ్యత
భారతదేశంలో నాయిస్ కంబాట్ నెక్‌బ్యాండ్ స్టైల్ ఇయర్ఫోన్లు రూ. 1,499 ధర వద్ద లభిస్తాయి. ఈ వైర్లెస్ ఇయర్ఫోన్లు ఒకే థండర్ బ్లాక్ కలర్ ఆప్షన్లో అందుబాటులో ఉంటాయి. నాయిస్ కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, రిటైల్ స్టోర్ల ద్వారా వీటిని కొనుగోలు చేయవచ్చు.
నాయిస్ కంబాట్ నెక్‌బ్యాండ్ స్టైల్ ఇయర్ఫోన్లను గేమర్స్‌ను లక్ష్యంగా చేసుకుని డిజైన్ చేశారు. ఇవి 45ms వరకు తక్కువ లేటెన్సీ మోడ్‌ను కలిగి ఉంటాయి. ఈ ఇయర్ఫోన్లలో ఓమ్ని డైరెక్షనల్ సౌండ్‌తో 10 ఎంఎం డ్రైవర్స్‌ను అమర్చింది. నాయిస్ కంబాట్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్‌తో వస్తాయి. వాయిస్ కాలింగ్ కోసం డ్యూయల్ మైక్ సెటప్‌ను అందించింది. ఈ ఇయర్ఫోన్లు నెక్బ్యాండ్పై బటన్ కంట్రోల్స్‌ను కలిగి ఉంటాయి. నాయిస్ కంబాట్ ఇయర్‌బడ్స్ రెండు డివైజ్‌లకు కనెక్ట్ చేయడానికి అనుమతించే “డ్యూయల్ పెయిరింగ్” మోడ్‌తో వస్తాయి.
ఈ ఆడియో డివైజ్(Audio Devise) 10 మీటర్ల పరిధితో బ్లూటూత్ 5 కనెక్టివిటీకి(Connectivity) మద్దతిస్తాయి. ఈ ఇయర్‌బడ్స్(Ear buds) 70 శాతం వాల్యూమ్‌తో 25 గంటల ప్లేబ్యాక్‌ని (Play Back) అందిస్తాయి. గేమింగ్ మోడ్‌లో ఉన్నప్పుడు గరిష్టంగా 12 గంటల బ్యాటరీ లైఫ్‌ను అందిస్తాయి. యూఎస్బీ టైప్-సి పోర్ట్ ద్వారా కేవలం 8 నిమిషాల ఛార్జ్‌తో ఎనిమిది గంటల ప్లేటైమ్‌ను ఆస్వాదించవచ్చు. దీనిలోని ఇన్‌స్టాఛార్జ్ టెక్నాలజీ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.