హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Noise Colorfit Ultra 2: మార్కెట్​లోకి నాయిస్ కలర్‌ఫిట్ అల్ట్రా 2 స్మార్ట్​వాచ్ లాంచ్​.. 60 స్పోర్ట్స్​ మోడ్​ల్స్..

Noise Colorfit Ultra 2: మార్కెట్​లోకి నాయిస్ కలర్‌ఫిట్ అల్ట్రా 2 స్మార్ట్​వాచ్ లాంచ్​.. 60 స్పోర్ట్స్​ మోడ్​ల్స్..

6. దీన్ని ఒక్కసారి ఫుల్​ ఛార్జ్​ చేస్తే 14 రోజులు లేదా 2 వారాల వరకు బ్యాటరీ బ్యాకప్​ ఇస్తుంది. ఈ స్మార్ట్​వాచ్​ ఫాస్ట్ ఛార్జింగ్​కు మద్దతిస్తుంది. తద్వారా, కేవలం 5 నిమిషాల ఛార్జింగ్‌తో 24 గంటల బ్యాకప్‌ను పొందవచ్చు. (ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

6. దీన్ని ఒక్కసారి ఫుల్​ ఛార్జ్​ చేస్తే 14 రోజులు లేదా 2 వారాల వరకు బ్యాటరీ బ్యాకప్​ ఇస్తుంది. ఈ స్మార్ట్​వాచ్​ ఫాస్ట్ ఛార్జింగ్​కు మద్దతిస్తుంది. తద్వారా, కేవలం 5 నిమిషాల ఛార్జింగ్‌తో 24 గంటల బ్యాకప్‌ను పొందవచ్చు. (ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

కరోనా తర్వాత స్మార్ట్ ఉత్పత్తులకు డిమాండ్​ అమాంతం పెరిగింది. అందుకే, ప్రముఖ స్మార్ట్​బ్రాండ్లు వరుసగా స్మార్ట్​వాచ్​లను లాంచ్​ చేస్తున్నాయి. తాజాగా నాయిస్ సంస్థ కలర్‌ఫిట్ అల్ట్రా 2 (Noise Colorfit Ultra 2) స్మార్ట్‌వాచ్​ను భారత మార్కెట్​లోకి విడుదల చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇంకా చదవండి ...

కరోనా తర్వాత స్మార్ట్ ఉత్పత్తులకు డిమాండ్​ అమాంతం పెరిగింది. అందుకే, ప్రముఖ స్మార్ట్​బ్రాండ్లు వరుసగా స్మార్ట్​వాచ్​లను లాంచ్​ చేస్తున్నాయి. తాజాగా నాయిస్ సంస్థ కలర్‌ఫిట్ అల్ట్రా 2 (Noise Colorfit Ultra 2) స్మార్ట్‌వాచ్​ను భారత మార్కెట్​లోకి విడుదల చేసింది. దీన్ని రూ. 4,499 ప్రారంభ ధర వద్ద అందుబాటులోకి తెచ్చింది. ఈ సంవత్సరం ప్రారంభంలో విడుదలైన నాయిస్ కలర్‌ఫిట్ అల్ట్రా స్మార్ట్​వాచ్​కు కొనసాగింపుగా దీన్ని తీసుకొచ్చింది.

నాయిస్ కలర్‌ఫిట్ అల్ట్రాలో అద్భుతమైన ఫీచర్లను అందించింది.​ సరసమైన ధరలోనే ప్రీమియం ఫీచర్లను జోడించింది. నాయిస్ కలర్‌ఫిట్ అల్ట్రా 2 స్మార్ట్​వాచ్​ 1.78 -అంగుళాల AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. ఇది SpO2 మానిటర్, 24×7 హార్ట్​ రేట్​ మానిటరింగ్​కు మద్దతిస్తుంది. ఇది 7 -రోజుల బ్యాటరీ లైఫ్‌ అందిస్తుంది.

Smart Watch: ఇలాంటి Smart Watch మీరెప్పుడు చూసి ఉండరు.. 10 రోజుల బ్యాటరీ బ్యాకప్ తో.. అదిరిపోయే ఫీచర్లు..


నాయిస్ కలర్‌ఫిట్ అల్ట్రా 2 స్పెసిఫికేషన్లు..

నాయిస్ కలర్‌ఫిట్ అల్ట్రా 2 స్మార్ట్‌వాచ్​లో బడ్జెట్ ధరలోనే ప్రీమియం ఫీచర్లను అందించింది. ఈ స్మార్ట్ వాచ్ 1.75 అంగుళాల AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. ఇది డిస్టెన్స్​, స్లీప్​ మానిటరింగ్​, స్ట్రెస్​ మానిటరింగ్​, స్టెప్ ట్రాకింగ్, బర్న్​ కౌంటర్, డిస్టెన్స్ కాలిక్యులేటర్, యాక్టివిటీ హిస్టరీ, స్లీప్ మానిటరింగ్ మొదలైన యాక్టివిటీ ట్రాకింగ్​కి మద్దతిస్తుంది.

హార్ట్​ రేట్ మానిటర్, SpO2 మానిటరింగ్​ కోసం దీనిలో ప్రత్యేక సెన్సార్లను ఏర్పాటు చేసింది. నాయిస్​ కలర్​ఫిట్​ అల్ట్రా 2 స్మార్ట్​వాచ్​లో కాలర్ ఐడీ ఇన్ఫర్మేషన్, కాల్ రిజెక్షన్, ఫైండ్ మై ఫోన్, రిమోట్ మ్యూజిక్ కంట్రోల్, రిమోట్ కెమెరా కంట్రోల్ వంటి కనెక్టింగ్​ ఫీచర్లను కూడా అందించింది.

ఈ స్టాప్‌వాచ్​లో టైమర్, అలారం, కాలిక్యులేటర్, స్టాక్‌లు, వరల్డ్​ క్లాక్​ వంటివి చూసుకోవచ్చు. నాయిస్​ కలర్​ఫిట్​ అల్ట్రా 2 స్మార్ట్​వాచ్​ 60 స్పోర్ట్స్ మోడ్‌లు, స్మార్ట్ డీఎన్​డీ ఫీచర్, వేక్ అలర్ట్‌లు, వాకింగ్​ రిమైండర్‌లు, బ్యాటరీ రిమైండర్లకు మద్దతిస్తుంది. ఇక, బ్యాటరీ విషయానికి వస్తే.. దీనిలో 180mAh బ్యాటరీని చేర్చింది. దీన్ని ఒక్కసారి ఫుల్​ ఛార్జ్​ చేస్తే 7 రోజుల వరకు బ్యాటరీ లైఫ్​, 20 రోజుల వరకు స్టాండ్‌బై సమయాన్ని​ అందిస్తుంది. నాయిస్ కలర్‌ఫిట్ అల్ట్రా మొత్తం నాలుగు కలర్​ ఆప్షన్లలో లభిస్తుంది. సిల్వర్ గ్రే, ఆలివ్ గ్రీన్, జెట్ బ్లాక్, నేవీ గోల్డ్ కలర్​ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది.

First published:

Tags: Latest Technology, Smart watch

ఉత్తమ కథలు