హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Smartwatch Offer: రూ.5 వేల స్మార్ట్‌వాచ్ రూ.1299కే!

Smartwatch Offer: రూ.5 వేల స్మార్ట్‌వాచ్ రూ.1299కే!

Smartwatch Offer: రూ.5 వేల స్మార్ట్‌వాచ్ రూ.1299కే!

Smartwatch Offer: రూ.5 వేల స్మార్ట్‌వాచ్ రూ.1299కే!

Flipkart Sale | మీరు కొత్త స్మార్ట్‌ వాచ్ కోసం చూస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. తక్కువ ధరలోనే అదిరిపోయే స్మార్ట్ వాచ్ అందుబాటులో ఉంది. ఏకంగా 70 శాతానికి పైగా తగ్గింపు పొందొచ్చు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

Flipkart Offer | స్మార్ట్‌వాచ్ కోసం చూస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. ఎందుకంటే తక్కువ ధరలోనే అదిరిపోయే స్మార్ట్ వాచ్ అందుబాటులో ఉంది. నాయిస్ స్మార్ట్‌వాచ్‌పై (Smart Watch) భారీ తగ్గింపు అందుబాటులో ఉంది. ఏకంగా 75 శాతం వరకు తగ్గింపు లభిస్తోంది. ప్రముఖ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో (Flipkart) ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. నాయిస్ కలర్‌ఫిట్ క్యూబ్ స్మార్ట్‌వాచ్‌ను బిగ్ డిస్కౌంట్‌తో సొంతం చేసుకోవచ్చు.

ఈ స్మార్ట్‌వాచ్ ఎంఆర్‌పీ రూ. 4,999గా ఉంది. అయితే దీన్ని ఇప్పుడు రూ. 1299కే కొనుగోలు చేయొచ్చు. అంటే దాదాపు 74 శాతం డిస్కౌంట్ వస్తోంది. అంతేకాకుండా అదనంగా 5 శాతం క్యాష్ బ్యాక్ పొందొచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డు ద్వారా కొంటే ఈ ఆఫర్ లభిస్తుంది. ఈ స్మార్ట్‌వాచ్‌లో 1.4 ఇంచుల టచ్ స్క్రీన్ హెచ్‌డీ డిస్‌ప్లే ఉంటుంది. స్వేర్ డయల్ ఉంటుంది. ఈ స్మార్ట్‌వాచ్ స్ట్రాప్‌ను థర్మో ప్లాస్టిక్ పాలీయురేథేన్ మెటీరియల్‌తో తయారు చేశారు.

ఏకంగా రూ.17 వేల డిస్కౌంట్.. రూ.12,990కే 39 ఇంచుల టీవీ, కిర్రాక్ ఆఫర్!

ఇంకా ఈ స్మార్ట్‌వాచ్‌లో వాటర్ రెసిస్టెన్సీ కూడా ఉంటుంది. ఐపీ 68 వాటర్‌ప్రూఫ్ రేటింగ్ ఉంది. 1.5 మీటర్ల వరకు నీటిలోకి పడిపోయిన కూడా పని చేస్తుంది. ఆండ్రాయిడ్ , యాపిల్ యూజర్లు ఇద్దరూ ఈ స్మార్ట్ వాచ్‌ను కొనుగోలు చేయొచ్చు. ఇంకా ఇందులో క్యాలరీ కౌంట్, స్టెప్ కౌంట్, హార్ట్ రేటు మానిటర్, ఎస్‌పీఓ2 మానిటరింగ్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఒక్కసారి చార్జింగ్ పెడితే ఈ స్మార్ట్‌వాచ్ ఏకంగా 7 రోజులు పని చేస్తుందని కంపెనీ పేర్కొంటోంది. అలాగే స్టాండ్ బై అయితే 600 గంటలు వస్తుందని తెలియజేస్తోంది.

రోజుకు రూ.2 ఖర్చు.. ఏడాదంతా ఉచితంగా కాల్స్ చేసుకోవచ్చు, రోజుకు 2 జీబీ డేటా వస్తుంది!

జీరో నుంచి 100 శాతం బ్యాటరీ ఫుల్ కావడానికి దాదాపు 150 నిమిషాలు పడుతుంది. సైక్లింగ్, వాకింగ్, యోగ, ట్రెడ్‌మిట్, రన్నింగ్, స్పిన్నింగ్, క్లైంబింగ్ వంటి పలు రకాల మల్టీ స్పోర్ట్స్ మోడ్స్ ఈ స్మార్ట్ వాట్‌లో అందుబాటులో ఉన్నాయి. నాయిస్ ఫిట్ ట్రాక్ యాప్ ద్వారా మీరు ఈ స్మార్ట్ వాచ్‌ను ఆపరేట్ చేయొచ్చు. ఇంకా వెదర్ ఫోర్‌కాస్ట్, అలారం, ఫైండ్‌ మై డివైజ్, మ్యూజిక్ కంట్రోల్, స్టాప్‌వాచ్ స్లీప్ మానిటర్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. అందువల్ల అందుబాటు ధరలో అదిరే స్మార్ట్‌ వాచ్ కొనుగోలు చేయాలని భావించే వారు ఈ స్మార్ట్‌వాచ్‌ను ఒకసారి పరిశీలించొచ్చు. ఇప్పటికే వేల మంది ఈ స్మార్ట్ వాచ్‌ను కొనుగోలు చేశారు. ఫ్లిప్‌కార్ట్‌లో దీనికి ప్రస్తుతం 4.1 రేటింగ్ ఉంది.

First published:

Tags: Flipkart, Latest offers, Offers, Smartwatch

ఉత్తమ కథలు