స్మార్ట్ బ్యాండ్స్(Smart Brands) మార్కెట్లో మంచి పేరున్న నాయిస్ (Noise) కంపెనీ మరో కొత్త స్మార్ట్ బ్యాండ్‌ను ఇండియాలో(India) లాంచ్ చేసింది. నాయిస్ కలర్ ఫిట్ పల్స్ బజ్ (Color Fit Pulse Buzz) పేరుతో కొత్త వేరబుల్(New Variable) డివైజ్‌ను కంపెనీ రిలీజ్(Release) చేసింది. రూ. 5,000 కంటే తక్కువ ధర(Low Cost) విభాగంలో కంపెనీ ఈ వాచ్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. నాయిస్ కలర్‌ఫిట్ పల్స్ బజ్ ఫీచర్లలో( Features) బ్లూటూత్ కాలింగ్(Bluetooth Calling) ఫంక్షనాలిటీ, SpO2 ట్రాకింగ్, బ్లడ్ ప్రెజర్ (BP) మానిటరింగ్, హార్ట్ రేట్ సెన్సార్ మానిటర్ వంటివి ఉన్నాయి. ఈ వాచ్‌కి ఒక్కసారి ఛార్జింగ్(Charging) పెడితే ఒక వారం బ్యాటరీ లైఫ్(Battery Life) అందించగలదని నాయిస్ కంపెనీ(Company) పేర్కొంది. ఈ కొత్త స్మార్ట్ వాచ్(New Smartwatch) గురించి మరిన్ని వివరాలు..
నాయిస్ కలర్ ఫిట్ పల్స్ బజ్ ధర
ఇండియాలో రిలీజ్ అయిన నాయిస్ కలర్ ఫిట్ పల్స్ బజ్ స్మార్ట్‌వాచ్ ధర రూ. 3,999. ఈ డివైజ్ రోజ్ పింక్, జెట్ బ్లాక్, ఆలివ్ గ్రీన్, షాంపైన్ గ్రే, ఎలక్ట్రిక్ బ్లూ వంటి ఐదు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ వేరబుల్ ప్రొడక్ట్‌ను అమెజాన్, కంపెనీ అధికారిక సెల్లింగ్ పోర్టల్ అయిన gonoise.com ద్వారా కొనుగోలు చేయవచ్చు. దీని సేల్స్ జూన్ 8న ప్రారంభమయ్యాయి.
నాయిస్ కలర్‌ఫిట్ పల్స్ బజ్ స్పెసిఫికేషన్లు
కొత్త నాయిస్ స్మార్ట్‌వాచ్ 1.69-అంగుళాల LCD డిస్‌ప్లేతో వస్తుంది. ఇది 240 x 280 పిక్సెల్స్ రిజల్యూషన్‌కు సపోర్ట్ చేస్తుంది. దీని డిస్‌ప్లే టచ్‌స్క్రీన్ సపోర్ట్‌తో వచ్చింది. ఆండ్రాయిడ్, iOS ఆపరేటింగ్ సిస్టమ్స్‌కు కంపాటబుల్‌గా ఉంటుంది. స్మార్ట్ వాచ్ బ్లూటూత్ 5.1 కనెక్టివిటీకి కూడా సపోర్ట్ చేస్తుంది.
Smart Phone: అదిరిపోయే ఫీచర్.. నిమిషాల్లో ఫుల్ చార్జింగ్.. వన్ ప్లస్ నుంచి కొత్త మోడల్
ఈ స్మార్ట్‌వాచ్ 150 కంటే ఎక్కువ క్లౌడ్ బేస్డ్ కస్టమైజ్డ్ వాచ్ ఫేస్‌లను అందిస్తుందని కంపెనీ పేర్కొంది. నాయిస్ కలర్ ఫిట్ పల్స్ బజ్.. ఆప్టికల్ హార్ట్ రేట్ సెన్సార్, SpO2 మానిటర్, ఇతర సెన్సార్లతో వస్తుంది. ఈ డివైజ్ యూజర్ల నిద్ర విధానాలను కూడా ట్రాక్ చేయగలదు. రక్తపోటు, ఒత్తిడి స్థాయిలు, పీరియడ్స్‌ను కూడా ట్రాక్ చేయగలదు.
iQoo Neo 6: గేమింగ్ ప్రియుల కోసం సూపర్ ఫోన్.. ఫీచర్స్, ధర వివరాలు తెలుసుకోండి
కొత్తగా లాంచ్ అయిన నాయిస్ కలర్‌ఫిట్ పల్స్ బజ్ డివైజ్‌ను బ్లూటూత్ సపోర్ట్‌తో ఫోన్‌కు కనెస్ట్ చేస్తే.. వాచ్ సాయంతో వాయిస్ కాల్స్ స్వీకరించవచ్చు. వాచ్‌లో కాల్ చేయడానికి డయల్ ప్యాడ్ కూడా ఉంది. స్మార్ట్ వాచ్ నుంచి ఫోన్ మ్యూజిక్, కెమెరాను కూడా కంట్రోల్ చేయవచ్చు. కొత్త నాయిస్ వాచ్ వాటర్-రెసిస్టెంట్ డిజైన్‌తో వస్తుంది. దీన్ని ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే, ఏడు రోజుల వరకు బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుందని కంపెనీ పేర్కొంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 5g technology, Smart mobile, Smart watch, Technology