ప్రముఖ లైఫ్‌స్టైల్ టెక్ బ్రాండ్ నాయిస్ వరుసగా స్మార్ట్ ప్రోడక్ట్స్‌ను లాంచ్ చేస్తూ భారత్‌లో తన మార్కెట్‌ను విస్తరిస్తోంది. ఈ సంస్థ తాజాగా భారత మార్కెట్లోకి మరో స్మార్ట్‌వాచ్‌ను (Smartwatch) లాంచ్ చేసింది. నాయిస్ కలర్‌ఫిట్ లూప్ పేరుతో దీన్ని ఆవిష్కరించింది. ఈ స్మార్ట్‌వాచ్ మొత్తం ఆరు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. దీని ధర, ఫీచర్లను పరిశీలిద్దాం.
ధర
నాయిస్ కలర్ ఫిట్ లూప్ స్మార్ట్‌వాచ్ రూ.2499 ధర వద్ద విడుదలైంది. ను ప్రముఖ ఈ–కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్, నాయిస్ అధికారిక వెబ్సైట్ గోనాయిస్.కామ్ల ద్వారా దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఇప్పటికే వీటి అమ్మకాలను ప్రారంభించినట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.
స్పెసిఫికేషన్స్
కొత్త నాయిస్ కలర్‌ఫిట్ లూప్ స్మార్ట్‌వాచ్ 60Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన 1.85 అంగుళాల పెద్ద డిస్ప్లేను కలిగి ఉంటుంది. దీనిలోని 2.5D కర్వ్డ్ గ్లాస్ క్లబ్ డిస్ప్లే 550 నిట్స్ బ్రైట్నెస్ను అందిస్తుంది. ట్రూ సింక్ టెక్నాలజీతో ఆధారిత ఈ సరికొత్త స్మార్ట్‌వాచ్ సింగిల్ చిప్ బ్లూటూత్ 5.3తో వస్తుంది. ఈ స్మార్ట్‌వాచ్‌ను మన స్మార్ట్‌ఫోన్‌తో సులభంగా అనుసంధానం చేసుకోవచ్చు. దీనిలోని లాగ్-ఫ్రీ యూజర్ ఇంటర్ఫేస్ (UI) బెస్ట్ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. వాటర్, డస్ట్ రెసిస్టన్స్తో వస్తుంది. దీన్ని ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే మొత్తం ఏడు రోజుల పాటు బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది.
ఈ స్మార్ట్‌వాచ్‌తో SPO2 లెవల్, హార్ట్ రేటు, నిద్ర, శ్వాస, ఒత్తిడి వంటి అన్ని ముఖ్యమైన అంశాలను ట్రాక్ చేయవచ్చు. 10 కాంటాక్ట్‌లను కూడా సేవ్ చేసుకోవచ్చు. "స్మార్ట్‌వాచ్‌లోని ప్రొడక్టివిటీ సూట్లో కాలిక్యులేటర్, ఈవెంట్స్ రిమైండర్, వెదర్ అప్డేట్స్, కాల్స్, ఎస్ఎమ్ఎస్, యాప్ నోటిఫికేషన్లతో పాటు క్విక్ రిప్లై, స్మార్ట్ DND వంటి ఫీచర్లు ఉన్నాయి. యూజర్లు ఇన్‌బిల్ట్ స్పీకర్లు, మైక్రోఫోన్ సపోర్ట్‌తో పాటు తక్కువ బ్యాటరీ యూసేజ్‌తో స్థిరమైన, లాగ్-ఫ్రీ కాల్‌లను ఆస్వాదించవచ్చు." అని కంపెనీ తెలిపింది.
కలర్‌ఫిట్ లూప్ స్మార్ట్‌వాచ్ లాంఛింగ్‌పై నాయిస్ సహ వ్యవస్థాపకుడు అమిత్ ఖత్రి మాట్లాడుతూ ‘‘యూజర్ల అంచనాలకు అనుగుణంగా మా స్మార్ట్ ఉత్పత్తులను తయారు చేస్తున్నాం. కొత్త ప్రొడక్ట్‌ను ఆవిష్కరించిన ప్రతిసారీ యూజర్ల అవసరాలను అధిగమించడంపై దృష్టి పెడుతున్నాం. ఇదే తరహాలో మా తాజా ప్రొడక్ట్‌లో ట్రూసింక్ టెక్నాలజీని జోడించాం. స్మార్ట్‌వాచ్‌లో పవర్-ప్యాక్డ్ ఎక్స్పీరియన్స్ కోసం వెతుకుతున్న యువతరానికి నాయిస్ కలర్‌ఫిట్ లూప్ స్మార్ట్‌వాచ్ బెస్ట్ ఛాయిస్." అని పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Smartwatch