హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Noise Air Buds 2: నాయిస్ ఎయిర్ బడ్స్ 2 వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ లాంచ్.. బడ్జెట్ ధరలోనే అదిరిపోయే ఫీచర్లు

Noise Air Buds 2: నాయిస్ ఎయిర్ బడ్స్ 2 వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ లాంచ్.. బడ్జెట్ ధరలోనే అదిరిపోయే ఫీచర్లు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

బడ్జెట్ ధరల్లో ప్రీమియం ఫీచర్లతో ఇయర్‌​ఫోన్లను అందించే ప్రముఖ ఆడియో బ్రాండ్ నాయిస్ నుంచి మరో కొత్త ప్రొడక్ట్ లాంచ్ అయింది. తాజాగా నాయిస్ ఎయిర్ బడ్స్ 2 (Noise Air Buds 2) పేరుతో సరికొత్త ఇయర్‌బడ్స్‌ను కంపెనీ లాంచ్ చేసింది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Vijayawada

బడ్జెట్ ధరల్లో ప్రీమియం ఫీచర్లతో ఇయర్‌​ఫోన్లను అందించే ప్రముఖ ఆడియో బ్రాండ్ నాయిస్ నుంచి మరో కొత్త ప్రొడక్ట్ లాంచ్ అయింది. తాజాగా నాయిస్ ఎయిర్ బడ్స్ 2 (Noise Air Buds 2) పేరుతో సరికొత్త ఇయర్‌బడ్స్‌ను కంపెనీ లాంచ్ చేసింది. ఇండియాలో వీటి అమ్మకాలు నవంబర్ 24 నుంచి ప్రారంభమయ్యాయి. వీటిని నాయిస్ అధికారిక వెబ్‌సైట్, ప్రముఖ ఈ–కామర్స్ దిగ్జజాలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. నాయిస్ ఎయిర్ బడ్స్ 2 ధర, ఫీచర్లు, ప్రత్యేకతలు చూద్దాం నాయిస్ ఎయిర్ బడ్స్2 వైర్​లెస్​ ఇయర్ ​బడ్స్​ క్లియర్ వైట్, క్లియర్ బ్లాక్ అనే రెండు కలర్ వేరియంట్లలో అందుబాటులో ఉంటాయి. నాయిస్ సంస్థ తన ట్రూ వైర్‌లెస్ స్టీరియో ఇయర్‌ఫోన్ లైనప్‌ను విస్తరిస్తూ, స్వదేశీ పరిజ్ఞానంతో వీటిని లాంచ్ చేసింది. ఇండియాలో దీని ధర 1,799గా ఉంది.

ఎయిర్ బడ్స్ 2 స్పెసిఫికేషన్స్

ఎయిర్ బడ్స్ 2 హాఫ్ ఇన్-ఇయర్ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ ట్రాన్స్ ​లియెంట్ లిడ్‌​తో తయారైన కేస్‌​తో వస్తుంది. చెమట, నీటి నిరోధకత కోసం IPX4 రెసిస్టెన్స్ రేటింగ్ కలిగి ఉంటుంది. ఈ ఇయర్‌బడ్స్ 13mm ఆడియో డ్రైవర్స్‌తో వస్తుంది. దీనిలోని ఛార్జింగ్ కేస్‌ 40 గంటల బ్యాటరీ లైఫ్ ఇస్తుంది. ఛార్జింగ్ కోసం USB టైప్-C పోర్ట్‌ డివైజ్‌కు ఉంటుంది. ఈ ఇయర్‌బడ్స్ కేవలం 10 నిమిషాల ఛార్జింగ్‌తో 4 గంటల ప్లేటైమ్‌ను అందించగలవని నాయిస్ సంస్థ పేర్కొంది.

వైర్‌లెస్ కనెక్టివిటీ కోసం బ్లూటూత్ 5.3, వేక్, పెయిర్ ఫీచర్లు, బ్లూటూత్ కాలింగ్ కోసం ఇన్‌బిల్ట్ క్వాడ్ మైక్రోఫోన్ సెటప్‌ ఉండే ఈ డివైజ్.. ఆండ్రాయిడ్ , iOS డివైజెస్‌కు కంపాటబుల్‌గా ఉంటుంది. గూగుల్ అసిస్టెంట్, సిరి వాయిస్ అసిస్టెంట్‌ సపోర్ట్ సిస్టం, మ్యూజిక్ కంట్రోల్, వాల్యూమ్ అడ్జెస్ట్, కాల్‌ టచ్ బటన్స్, ఎన్విరాన్‌మెంట్ నాయిస్ క్యాన్సిలేషన్ (ENC).. వంటి ఫీచర్లతో ఇయర్ బడ్స్ లాంచ్ అయ్యాయి.

నాయిస్ ఎయిర్‌బడ్స్‌ లాంచింగ్ సందర్భంగా కంపెనీ సహ వ్యవస్థాపకుడు అమిత్ ఖత్రి మాట్లాడుతూ, వినియోగదారుల అభిరుచిని దృష్టిలో పెట్టుకొని కొత్త ప్రొడక్ట్స్ రూపొందిస్తున్నామని చెప్పారు. తాజాగా విడుదలైన నాయిస్ ఎయిర్ బడ్స్ 2 బడ్జెట్ ఫ్రెండ్లీ ఇయర్ ​బడ్స్​ అన్నారు. నాణ్యమైన సౌండ్ క్వాలిటీ కోరుకునే వారికి ఫ్లాగ్‌షిప్ ఆడియో ఎక్స్‌పీరియన్స్ అందించడానికి వీటిని రూపొందించామని చెప్పారు. లేటెస్ట్ టెక్నాలజీతో మంచి ప్రొడక్ట్స్ పరిచయం చేయాలనే దృక్పథంతో ముందుకు వెళ్తున్నామని, ఈ ఫీచర్-ప్యాక్ ప్రొడక్ట్‌కు మంచి ఆదరణ లభిస్తుందని ఆశిస్తున్నామని అమిత్ పేర్కొన్నారు.

First published:

Tags: Earbuds, Oppo

ఉత్తమ కథలు