సెప్టెంబర్ 27, 2021న అంటే ఈ రోజు భూ మ్యాగ్నటిక్ తుఫాను భూమిని తాకబోతోందని, ఇది ఉపగ్రహాలు మరియు విద్యుత్ గ్రిడ్‌లపై ప్రభావం చూపే అవకాశం ఉందని అమెరికన్ స్పేస్ వెథర్ ట్రాకింగ్ ఏజెన్సీ (US space weather tracking agency) హెచ్చరిస్తోంది. ఈ తుఫాను భూ అయస్కాంత తుఫాను సౌర తుఫానుకు భిన్నంగా ఉంటుందని సంస్థ తెలిపింది. ఈ తుఫానును నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ (NOAA)కు చెందిన అంతరిక్ష వాతావరణ అంచనా కేంద్రం (SWPC) సెప్టెంబర్ 27న భూమికి G1 లేదా G2- స్థాయి తుఫాను సంభవించే అవకాశం గురించి SWPC హెచ్చరించింది. ఇక SWPC అంచనా ప్రకారం.. భూ అయస్కాంత తుఫాను యొక్క ప్రభావం ప్రధానంగా 60 డిగ్రీల జియోమాగ్నెటిక్ (Geomagnetic) అక్షాంశం ధ్రువంగా ఉంటుందన అంచాన వేస్తోంది. అంతే కాకుండా ఇది పవర్ గ్రిడ్ హెచ్చుతగ్గులకు కారణమవుతుందనే అనుమానం వ్యక్తం చేసింది. ఈ తుఫాను కారణంగా ఉపగ్రహాలు బాగా ప్రభావితం అవ్వవచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.
ఏం జరగొచ్చు..
- భూ అయస్కాంత తుఫాను అనేది భూమి యొక్క మాగ్నెటోస్పియర్‌కు భంగం కలిగిస్తుందని.. ఇంకా అలాగే సౌర గాలి నుంచి భూమి చుట్టూ ఉన్న అంతరిక్ష వాతావరణంలోకి శక్తి మార్పిడి తర్వాత జరుగుతుందని సంస్థ పేర్కొంది.
- ఈ పరిస్థితుల వల్ల ఏర్పడే అతి పెద్ద తుఫానులు సౌర కరోనల్ మాస్ ఎజెక్షన్‌లతో (CME లు) సంబంధం కలిగి ఉన్నాయని SWPC తెలిపింది.
- ఇక SWPC ప్రకారం, భూ అయస్కాంత తుఫాను యొక్క ప్రభావం ప్రధానంగా 60 డిగ్రీల జియోమాగ్నెటిక్ అక్షాంశం ధ్రువంగా ఉంటుంది.
- ఇంకా అలాగే ఇది పవర్ గ్రిడ్ హెచ్చుతగ్గులకు కారణమవుతుంది.ఇక అంతేగాక ఉపగ్రహాలను కూడా బాగా ప్రభావితం చేయవచ్చని SWPC తెలిపింది.
- అంతే కాకుండా అరోరా భూ అయస్కాంత తుఫాను వలన సంభవించవచ్చని అంచనా వేస్తున్నారు.
- ఈ తుఫానులో G1 లేదా G2 రకం తుఫాను ఏదైనా సంభవించే అవకాశం ఉందన్ని సంస్థ భావిస్తోంది.
- G1 ఇంకా G2 మైనర్ అలాగే మోడరేట్ స్థాయి తుఫానులు. ఎంతో కొంత నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది.
- ఒక G2 స్థాయి తుఫాను అధిక-అక్షాంశ విద్యుత్ వ్యవస్థలలో వోల్టేజ్ అలారాలు ఇంకా ట్రాన్స్‌ఫార్మర్ ని దెబ్బతీసే అవకాశం ఉందని సంస్థ పేర్కొంది.
- ముఖ్యంగా, G1 స్థాయి తుఫాను ఉపగ్రహ కార్యకలాపాలపై స్వల్ప ప్రభావాన్ని చూపుతుంది.
- సంస్థ ప్రకటించిన నివేదికల ప్రకారం ఐసోలేటెడ్ జి 1 (మైనర్) జియోమాగ్నెటిక్ స్ట్రోమింగ్ సెప్టెంబర్ 27 న జరిగే అవకాశం ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Earth, International news, Space