news18-telugu
Updated: May 24, 2019, 2:44 PM IST
Instagram: యూజర్ల డేటా లీక్ కాలేదంటున్న ఇన్స్టాగ్రామ్
(ప్రతీకాత్మక చిత్రం)
ఇన్స్టాగ్రామ్ యూజర్ల ప్రైవేట్ డేటా లీకైందన్న వార్త యూజర్లలో కలకలం రేపింది. యూజర్ల పేర్లు, ఫోన్ నెంబర్లు, ఫోటోలు, ఇమెయిల్ అడ్రస్లు లీక్ అయ్యాయని సైబర్ నిపుణులు వెల్లడించడం సంచలనంగా మారింది. ముంబైకి చెందిన సోషల్ మీడియా మార్కెటింగ్ సంస్థ Chtrbox ప్లాట్ఫామ్లో ఇన్స్టాగ్రామ్ యూజర్ల డేటా లీక్ అయిందన్న అంశంపై ఇన్స్టాగ్రామ్ స్పందించింది. యూజర్ల ఇమెయిల్స్, ఫోన్ నెంబర్లు లీక్ కాలేదని తాము జరిపిన ప్రాథమిక విచారణలో తేలిందని ఇన్స్టాగ్రామ్ వివరించింది. ఈ వ్యవహారంపై Chtrbox సంస్థ కూడా స్పందించింది.

వేర్వేరు సోర్సుల నుంచి సేకరించిన డేటా Chtrbox ప్లాట్ఫామ్లో ఉంది. అందులో ఇన్స్టాగ్రామ్ కూడా ఒకటి. ఫేస్బుక్ లేదా ఇన్స్టాగ్రామ్కు సంబంధించిన ఎలాంటి డేటా లీక్ కాలేదు. ఇన్స్టాగ్రామ్ యూజర్ల డేటా లీక్ కావడం వెనుక Chtrbox సంస్థదే బాధ్యత అన్న వాదన సరైనది కాదు.
— ప్రణయ్ స్వరూప్, Chtrbox ఫౌండర్
అయితే ఇన్స్టాగ్రామ్ యూజర్ల డేటా లీక్ వ్యవహారంపై స్పష్టత రావాల్సి ఉంది. ఏకంగా 5 కోట్ల మంది ఇన్స్టాగ్రామ్ యూజర్ల డేటా లీక్ అయిందన్న వార్తలు మాత్రం యూజర్లలో కలకలం రేపుతున్నాయి. ఇన్స్టాగ్రామ్ యూజర్ల డేటా లీక్ కావడం ఇదే మొదటి సారి కాదు. 2017 లో ఇన్స్టాగ్రామ్లో ఓ బగ్ కారణంగా 60 లక్షల మంది యూజర్ల డేటా లీకైంది.
Redmi Note 7S: బడ్జెట్ స్మార్ట్ఫోన్ రెడ్మీ నోట్ 7ఎస్ ఎలా ఉందో చూశారా?
ఇవి కూడా చదవండి:
SBI Jobs: ఎస్బీఐలో 579 ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే
Lock Aadhaar: ఎస్ఎంఎస్తో ఆధార్ లాక్ చేయొచ్చు ఇలా
Budget Smartphones: బడ్జెట్ ఫోన్ కావాలా? రూ.15,000 లోపు స్మార్ట్ఫోన్లు ఇవే...
First published:
May 24, 2019, 2:44 PM IST