మెటా యాజమాన్యంలోని ఫోటో షేరింగ్ ప్లాట్‌ఫారమ్ ఇన్స్టాగ్రామ్(Instagram) వినియోగదారుల కోసం కొత్త ఫీచర్లను లాంచ్ చేస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌ను యూజర్లకు సురక్షితంగా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియా అకౌంట్స్ క్రియేట్ చేసుకొనేందుకు పిల్లలు తప్పుడు వయస్సును ఎంటర్ చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే కొన్ని దేశాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అమెరికా, బ్రెజిల్లో ఎక్కువగా పిల్లలు తప్పుడు అకౌంట్లు క్రియేట్ చేసినట్లు తెలిసింది. ఇప్పుడు ఇండియాలో కూడా ఇలాంటి ఘటనలు బయటపడుతున్నాయి. ఈ క్రమంలోనే తప్పుడు వయస్సుతో అకౌంట్లు క్రియేట్ చేయకుండా ఉండేందుకు ఇన్స్టాగ్రామ్ చర్యలు తీసుకుంటోంది. కొత్తగా ఒరిజినల్ ఐడీ లేదా సెల్ఫీ వీడియో ద్వారా వయస్సును నిర్ధారించే(Age Verification) ప్రాసెస్‌ను తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలిసింది.
* కొత్త ఫీచర్ వివరాలు ఇవే
ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత.. ఇండియాలో ఇన్‌స్టాగ్రామ్‌లో 18 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఆప్షన్‌ను 18 ఏళ్ల వయసుగా మార్చేందుకు ప్రయత్నిస్తే వయస్సును నిర్ధారించాల్సి ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసే ముందు వయస్సును తప్పకుండా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. 13 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసుకోలేరు. వయస్సును నిర్ధారించడానికి ఒరిజినల్ ఐడీ అప్లోడ్ చేయడం లేదా సెల్ఫీ వీడియో రికార్డ్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ వివరాలను పరిశీలించి, సరైన వయస్సు ఉందని ఇన్స్టాగ్రామ్ ప్రతినిధులు నిర్ధారించుకొన్న తర్వాతే ఇన్‌స్టాగ్రామ్‌లో మాడిఫికేషన్కు అనుమతిస్తారు. ఈ ఫీచర్‌ను ప్రస్తుత సంవత్సరం ముగిసే లోపే యూకే, యూఎస్‌లలో అందుబాటులోకి తీసుకురావాలని ఇన్స్టాగ్రామ్ భావిస్తున్నట్లు తెలిసింది.
* ఇన్స్టాగ్రామ్ వయస్సు ధ్రువీకరణ
ఎవరైనా భారతదేశంలో ఇన్‌స్టాగ్రామ్‌లో 18 ఏళ్ల కంటే తక్కువ వయసును 18 ఏళ్ల వయసుగా మాడిఫై చేయాలంటే, వారి పుట్టిన తేదీని మార్చడానికి ప్రయత్నిస్తే ముందుగా కంపెనీ నియమాల ప్రకారం వయస్సును నిర్ధారించాలి. అందుకు ఒరిజినల్ ఐడీ అప్లోడ్, లేదా సెల్ఫీ వీడియో రికార్డ్ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. ఆ రెండింటిలో ఒక ఆప్షన్ సెలక్ట్ చేసుకొన్న తర్వాత స్క్రీన్‌పై సూచనలు కనిపిస్తాయి.
వ్యక్తి సెల్ఫీ వీడియో తీసుకున్న తర్వాత, ఆ ఇమేజ్ యోటి(Yoti)తో షేర్ అవుతుందని ఇన్స్టాగ్రామ్ తెలిపింది. యోటి అనేది ఫేసియల్ ఫీచర్స్ ఆధారంగా వయస్సును అంచనా వేసే టెక్నాలజీ. వయస్సును వెరిఫై చేయడానికి సెక్యూర్, సేఫ్ సర్వీస్‌ను యోటి అందిస్తుంది. ప్రక్రియ పూర్తయిన తర్వాత మెటా, యోటి తమ డేటాబేస్‌ల నుంచి యూజర్ ఇమేజ్ను డిలీట్ చేస్తాయి. ఈ ఇమేజ్ ద్వారా ఎలాంటి వివరాలు సేకరించవు. కేవలం వయస్సును మాత్రమే అంచనా వేస్తాయి.
* సోషల్ వోచింగ్ ఆప్షన్
ఇన్‌స్టాగ్రామ్‌లో సోషల్ వోచింగ్ అనే ఆప్షన్ ఉండేది. ఈ ఆప్షన్ వినియోగదారులు వయస్సు ఎంత అని నిర్ధారించుకోవడానికి మ్యూచువల్ ఫాలోవర్లను అడిగేది. యూజర్ సెలక్ట్ చేసుకొన్న ముగ్గురు వ్యక్తులకు వయస్సును నిర్ధారించాలనే రిక్వెస్ట్ వెళ్లేది. ఆ యూజర్లు మూడు రోజుల లోపు ప్రతిస్పందించాల్సి ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cute selfie, Instagram, Social Media