Home /News /technology /

Green hydrogen car: హైడ్రోజన్​ కారును కొనుగోలు చేసిన నితిన్​ గడ్కరీ.. దీని ప్రత్యేకతలేంటో తెలుసా?

Green hydrogen car: హైడ్రోజన్​ కారును కొనుగోలు చేసిన నితిన్​ గడ్కరీ.. దీని ప్రత్యేకతలేంటో తెలుసా?

హైడ్రోజన్​ కారును కొనుగోలు చేసిన నితిన్​ గడ్కరీ.. దీని ప్రత్యేకలేంటో తెలుసా?

హైడ్రోజన్​ కారును కొనుగోలు చేసిన నితిన్​ గడ్కరీ.. దీని ప్రత్యేకలేంటో తెలుసా?

కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ మిగతా రాజకీయ నాయకులతో పోల్చితే భిన్నంగా ఉంటారు. తాజాగా ఆయన హైడ్రోజన్ కారును కొనుగోలు చేశారు. ఆ కారు ప్రత్యేకతలు ఇలా ఉన్నాయి.

కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) ఆలోచనా విధానం మిగతా వాళ్లతో పోలిస్తే భిన్నంగా ఉంటుంది. గత కొంతకాలంగా సంప్రదాయ ఇంధనాలు కాకుండా ప్రత్యామ్నయాలను ఉపయోగించాలని ఇదివరకే ఆయన సూచించారు. చాలా కాలంగా ప్రత్యామ్నాయ ఇంధనాలను వాడాలని కూడా ప్రచారం చేస్తున్నారు. భవిష్యత్​లో పెట్రోల్ వినియోగం తక్కువగా ఉండాలంటే ఇప్పటినుంచే ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించాలని పేర్కొన్నారు.కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తాజాగా పెట్రోల్(Petrol) , డీజిల్ (Diesel), సీఎన్​జీ(CNG)తో కాకుండా హైడ్రోజన్​తో నడిచే కారును కొనుగోలు చేశారు. తాను కొన్న కారు(Car) లో ఎలాంటి ఇంధనాన్ని ఉపయోగించరు. వ్యర్థాల నుంచి సంపదను సృష్టించుకోవాలన్నది ఆయన అభిమతం. ఫలితంగా వివిధ నగరాల్లో బస్సులు, ట్రక్కులుస కార్లను హైడ్రోజన్​తో నడపాలని యోచిస్తున్నారు.

గురువారంజరిగిన ఫైనాన్షియల్ ఇన్​క్లూజన్ ఆరవ జాతీయ శిఖరాగ్ర సదస్సులో కేంద్రమంత్రి పాల్గొన్నారు. అందులో ఆయన ప్రసంగిస్తూ... సిటీల్లో మురుగునీరు, ఘన వ్యర్థాలను ఉపయోగించి బస్సులు, ట్రక్కులు, కార్లలో గ్రీన్​ హైడ్రోజన్ ఉపయోగించాలని భావిస్తున్నట్లు తెలిపారు. వ్యర్థాలను నుంచి సంపదను సృష్టించుకోవాలని సూచించారు.
Suzuki Alto 2022: మారుతి సుజుకి నుంచి న్యూ జనరేషన్​ ఆల్టో మోడల్​ లాంచ్​.. స్టైలిష్​ డిజైన్​తో ఎంట్రీ లెవల్​ కారు

స్వయంగా నేనే కారు నడుపుతా..
గ్రీన్ హైడ్రోజన్​తో కూడా కార్లు నడవగలవని ప్రజల్లో విశ్వాసం కలిగించడానికి తాను ఢిల్లీలో హైడ్రోజన్ ఆధారిత కారులో ప్రయాణించనున్నట్లు నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. ఫరీదాబాద్​ చమురు పరిశోధనా సంస్థలో ఉత్పత్తి చేసిన గ్రీన్​ హైడ్రోజన్​తో నడిచే పైలట్ ప్రాజెక్ట్ కారును కొన్నట్లు ఆయన తెలిపారు. ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం తాను ఈ కారులో ప్రయాణిస్తానని వివరించారు. కార్ల తయారీదారులు వాహనాల్లో ఫ్లెక్స్-ఫ్యూయల్ ఇంజిన్​లను ప్రవేశపెట్టడం తప్పనిసరి చేస్తూ... రెండు మూడు రోజుల్లో ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు.
Ola Test Rides: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ మరో ఘనత.. డెలివరీకి ముందే రికార్డులు

ప్రతి సంవత్సరం ఇండియా 8 లక్షల కోట్ల పెట్రోలియం ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటోదని వివరించారు. పరిస్థితి ఇలానే కొనసాగితే వచ్చే ఐదేళ్లలో దిగుమతి విలువ 25 లక్షల కోట్లకు పెరుగుతుందని తెలిపారు. శిలాజ ఇంధనాల దిగుమతి తగ్గించడానికి త్వరలో ఫైల్​పై సంతకం చేయనున్నట్లు వివరించారు. ఫెక్స్ ఇంజిన్లను రూపొందించాలని (ఒకటి కంటే ఎక్కువ ఇంధనంతో నడిచే) వాహనాలను తయారు చేయమని వాహనదారులకు సూచించారు.
Flipkart​ Best Offer: ఫ్లిప్‌కార్ట్ లో బంపరాఫర్.. కేవలం రూ.15కే Oppo A12 స్మార్ట్ ఫోన్.. ఆఫర్ వివరాలివే

టయోటా మోటార్ కార్పొరేషన్, సుజుకీ, హ్యుందాయ్ మోటార్ ఇండియా తమ వాహనాల్లో ఫ్లెక్స్ ఇంజిన్‌లను ప్రవేశపెడతామని ఉన్నతాధికారులు హామీ ఇచ్చారని గడ్కరీ తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ భారత్‌ అని కూడా ఆయన అన్నారు.
Published by:Nikhil Kumar S
First published:

Tags: CAR, Cars, Nitin Gadkari

తదుపరి వార్తలు