Home /News /technology /

NITA M AMBANI LAUNCHES THE POPULAR WOMEN EMPOWERMENT PLATFORM HER CIRCLE IN HINDI SS

Her Circle: మహిళా సాధికారత ప్లాట్‌ఫామ్ 'హర్ సర్కిల్'ను హిందీలో లాంఛ్ చేసిన నీతా అంబానీ

Her Circle: మహిళా సాధికారత ప్లాట్‌ఫామ్ 'హర్ సర్కిల్'ను హిందీలో లాంఛ్ చేసిన నీతా అంబానీ

Her Circle: మహిళా సాధికారత ప్లాట్‌ఫామ్ 'హర్ సర్కిల్'ను హిందీలో లాంఛ్ చేసిన నీతా అంబానీ

Her Circle | మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించిన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ హర్ సర్కిల్‌ను హిందీలో రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, ఛైర్‌పర్సన్ నీతా అంబానీ (Nita Ambani) ప్రారంభించారు. ఈ ప్లాట్‌ఫామ్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోండి.

  అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా సాధికారత ప్లాట్‌ఫామ్ అయిన 'హర్ సర్కిల్'ను (Her Circle) హిందీలో రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, ఛైర్‌పర్సన్ నీతా అంబానీ (Nita Ambani) లాంఛ్ చేశారు. దీంతో హర్ సర్కిల్ హిందీ యాప్ అందుబాటులోకి వచ్చింది. హర్ సర్కిల్ ప్లాట్‌ఫామ్‌ను గతేడాది మహిళా దినోత్సవం సందర్భంగా నీతా అంబానీ లాంఛ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ ప్లాట్‌ఫామ్ మొదటి వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ ప్లాట్‌ఫామ్ భారతదేశంలో వేగంగా వృద్ధిలోకి వస్తున్న ప్లాట్‌ఫామ్ కావడం విశేషం. ఓవరాల్ రీచ్ 42 మిలియన్లు అంటే 4.2 కోట్లు కావడం విశేషం. హర్ సర్కిల్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా హర్ సర్కిల్ హిందీ భాషలో అందుబాటులోకి వచ్చింది.

  హర్ సర్కిల్ ప్రాంతం, భాషతో సంబంధం లేకుండా మహిళలందరికోసం రూపొందించిన వేదిక. ఈ ప్లాట్‌ఫామ్‌ను ఎలాంటి అడ్డంకులు లేకుండా విస్తరించేందుకు కృషి చేస్తున్నాం. మరింత మంది మహిళలను సులభంగా వారి భాషలో చేరుకోవడానికి, మేము మొదట హిందీలో హర్ సర్కిల్‌ను ప్రారంభిస్తున్నాం. ఇప్పటివరకు ఇంగ్లీష్ ప్లాట్‌ఫామ్‌కు లభించినంత ప్రేమను ఇది పొందుతుందని నేను ఆశిస్తున్నాను.
  నీతా అంబానీ, రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, ఛైర్‌పర్సన్


  EPF Rules: ఈపీఎఫ్ డబ్బులు డ్రా చేస్తున్నారా? ట్యాక్స్ రూల్స్ తెలుసుకోండి

  హిందీ యాప్‌ను ప్రారంభించడంతో పాటు హర్ సర్కిల్ మొదటి వార్షికోత్సవాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా హర్ సర్కిల్ మొట్టమొదటి డిజిటల్ కవర్‌పై నీతా అంబానీ ఉండటం విశేషం. ఈ సందర్భంగా ఆమె ప్రత్యేక ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. ఆమె ఇంటర్వ్యూ సారాంశం ఇదే.

  హర్ సర్కిల్ మొదటి ఏడాది డిజిటల్ వినియోగం, నెట్వర్కింగ్ లాంటి అంశాల్లో అనేక మైలురాళ్లను చేరుకుంది. వినియోగదారుల కోసం క్యూరేటెడ్, జాబితా చేయబడిన వేలాది ఉద్యోగావకాశాలు ఇందులో లభిస్తున్నాయి. ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్, ఫుడ్ స్టైలిస్ట్, ఫిట్‌నెస్ ట్రైనర్, డాగ్ ట్రైనర్, రేడియో జాకీ ఎలా మారాలనే దానిపై విస్తృతమైన మాస్టర్‌క్లాస్‌లు అందుబాటులో ఉన్నాయి. మా నెట్‌వర్క్‌లో 30,000 మంది రిజిస్టర్డ్ ఆంట్రప్రెన్యూర్లతో, మహిళలు ఒకరికి మరొకరు సహకరించుకుంటూ ఎదగడానికి ఈ ప్లాట్‌ఫామ్ ఉపయోగపడుతుంది.

  మా నెట్వర్క్ ఆస్పత్రి అయిన సర్ హెచ్ఎన్ రిలయన్స్ హాస్పిటల్‌కు చెందిన వైద్య నిపుణులు 24 గంటల పాటు మెంటల్ వెల్‌నెస్, ఫిజికల్ ఫిట్‌నెస్, స్కిన్ కేర్, గైనకాలజికల్, కౌన్సిలింగ్ లాంటి అనేక అంశాల్లో ఉచిత సలహాలు ఇస్తున్నారు. దీంతో వేలాది మంది మహిళలు లాభపడుతున్నారు. ఫిట్‌నెస్, న్యూట్రిషన్, పీరియడ్స్, ఫెర్టిలిటీ, ప్రెగ్నెన్సీ, ఫైనాన్స్ లాంటివాటికోసం ప్రత్యేకంగా రూపొందించిన ట్రాకర్‌లను 1.50 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉచితంగా ఉపయోగిస్తున్నారు.

  IRCTC Tirupat Tour: తిరుమలలో శ్రీవారి ప్రత్యేక దర్శనంతో తిరుపతి లోకల్ టూర్ ప్యాకేజీ

  Nita Ambani, her circle app, her circle careers, her circle hindi, her circle logo, her circle play store, her circle reliance, హర్ సర్కిల్, హర్ సర్కిల్ ప్లాట్‌ఫామ్, హర్ సర్కిల్ యాప్, హర్ సర్కిల్ వెబ్‌సైట్, హర్ సర్కిల్ హిందీ

  గీతా గోపీనాథ్, నైనా లాల్ కిద్వాయ్, పద్మశ్రీ గులాబో సపేరా, గీతా ఫోగట్, అనితా డోంగ్రే వంటి మహిళా సాధకుల, అలాగే సురక్షితంగా తప్పించుకున్న ఆఫ్ఘన్ మహిళతో పాటు ఉక్రేనియన్ జాతీయులు, సంఘర్షణతో నిండిన ప్రాంతాల నుండి తరలివెళ్లిన వారి ఇంటర్వ్యూలు, కథనాలు ఇందులో పబ్లిష్ అయ్యాయి.

  అభినందనలు. హర్ సర్కిల్‌లోని ప్రతి స్త్రీకి మాత్రమే కాదు... మన సర్కిల్‌లో ఉన్నవారందరికీ. ఇంత తక్కువ సమయంలో హర్ సర్కిల్ విస్తరించి, పెరగడం చూసి నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఈ ఉద్యమంలో చేరిన మహిళలందరినీ నేను స్వాగతిస్తున్నాను. వారు సహకరించడం, చప్పట్లు కొట్టడం చూసి నేను సంతోషిస్తున్నాను. హర్ సర్కిల్‌లో, మేము వింటాం, పంచుకుంటాం, అవగాహన కల్పిస్తాం, ప్రారంభింస్తాం, కనెక్ట్ చేస్తాం. సంకోచం లేకుండా ప్రశ్నలు అడగండి. నిర్వచించిన దానికంటే మించి వెళ్ళండి. కొత్త విషయాలను నేర్చుకోవడం, తమలో తాము నైపుణ్యం పెంచుకోవడం, వారి కలలను నెరవేర్చుకోవడం ద్వారా మహిళలు అభివృద్ధి చెందే సురక్షితమైన స్థలం ఇది.
  హర్ సర్కిల్ వార్షికోత్సవం సందర్భంగా నీతా అంబానీ, రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, ఛైర్‌పర్సన్

  హర్ సర్కిల్ ఎలా పనిచేస్తుందంటే


  నెట్వర్కింగ్‌తో పాటు లక్ష్యం నెరవేర్చుకునేందుకు హర్ సర్కిల్ వేదిక. ఇందులో మహిళలకు సంబంధించిన కంటెంట్ ఉంటుంది. ఒకరినొకరు అనుసంధానించుకోవడానికి, ప్రోత్సహించుకోవడానికి పనిచేసే సామాజిక వేదిక. ఇందులో వీడియోలు చూడొచ్చు. ఆర్టికల్స్ చదవొచ్చు. జీవితం, వెల్‌నెస్, ఫైనాన్స్, వర్క్, పర్సనాలిటీ డెవలప్‌మెంట్, కమ్యూనిటీ సర్వీస్, బ్యూటీ, ఫ్యాషన్, ఎంటర్‌టైన్‌మెంట్, సెల్ఫ్ ఎక్స్‌ప్రెషన్, యాక్టీవ్ పార్టిసిపేషన్ లాంటి కంటెంట్ ఉంటుంది. ఇది కేవలం మహిళల కోసం పనిచేసే సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్‌ఫామ్ మాత్రమే. కాబట్టి ప్రైవసీ, విషయంలో సురక్షితంగా ఉండొచ్చు. కొత్త స్నేహితులను పొందొచ్చు. ఆసక్తులు వివరించొచ్చు. సందేహాలకు సమాధానాలు తెలుసుకోవచ్చు. కాన్ఫిడెన్షియల్ ఛాట్‌రూమ్స్ ద్వారా మెడికల్, ఫైనాన్స్ నిపుణుల నుంచి సలహాలు పొందొచ్చు. మొబైల్‌తో పాటు డెస్క్‌టాప్‌లో ఈ వెబ్‌సైట్ ఉపయోగించుకోవచ్చు. గూగుల్ ప్లేస్టోర్, మైజియో యాప్ స్టోర్ నుంచి యాప్ డౌన్‌లోడ్ చేయొచ్చు. హర్ సర్కిల్ ప్లాట్‌ఫామ్ పూర్తిగా ఉచితం. ఇప్పటివరకు ఇంగ్లీష్ భాషలో అందుబాటులో ఉండగా, ఇప్పుడు హిందీలో ప్రారంభమైంది.
  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: Nita Ambani, Social Media, Women's day

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు