జపనీస్ వాహన తయారీ సంస్థ నిస్సాన్.. కిక్స్ కాంపాక్ట్ ఎస్యూవీ కొనుగోలుపై బంపరాఫర్ ప్రకటించింది. కిక్స్ ఎస్యూవీ కొనుగోలుతో రూ. 1 లక్ష వరకు క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్, లాయల్టీ బెనిఫిట్స్ మొదలైన అనేక ప్రయోజనాలు పొందవచ్చు. ఈ ప్రయోజనాలు సెప్టెంబర్ 30 వరకే అందుబాటులో ఉంటాయని నిస్సాన్ తెలిపింది. వినాయక చవితి సందర్భంగా నిస్సాన్ కిక్ ఎస్యూవీ కొనుగోలుపై 2 గ్రాముల బంగారు నాణాన్ని కూడా అందిస్తామని పేర్కొంది. ఈ ఆఫర్ మహారాష్ట్ర, గోవా, రాజస్థాన్‌లోని డీలర్షిప్ సెంటర్లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. అది కూడా సెప్టెంబర్ 20లోపు కొనుగోలు చేసిన వారికే వర్తిస్తుందని తెలిపింది.
1.3 -లీటర్ టర్బో వేరియంట్‌పై బెనిఫిట్స్
నిస్సాన్ కిక్ ఎస్యూవీ మొత్తం రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఈ రెండు వేరియంట్లపై కూడా రూ. 1 లక్ష వరకు ప్రయోజనాలను అందిస్తుంది. 1.3 లీటర్ టర్బో వేరియంట్‌పై 15,000 క్యాష్ బెనిఫిట్, రూ. 5000 ఆన్‌లైన్ బుకింగ్ బోనస్, రూ. 70,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 10,000 కార్పొరేట్ బెనిఫిట్స్ అందిస్తుంది. వాహన కొనుగోలుపై ప్రత్యేక వడ్డీ రేట్లను అమలు చేస్తుంది. కేవలం 7.99% వడ్డీ రేటుకే కార్ లోన్ ఇచ్చేలా వివిధ బ్యాంకులతో ఒప్పందం చేసుకుంది.
1.5 -లీటర్ వేరియంట్‌పై బెనిఫిట్స్
నిస్సాన్ కిక్ ఎస్యూవీ 1.5 లీటర్ వేరియంట్‌పై కూడా రూ. 1 లక్ష ప్రయోజనాలను అందిస్తోంది. రూ. 10,000 క్యాష్ బెనిఫిట్, ఆన్‌లైన్ బుకింగ్ బోనస్ కింత రూ. 5,000 క్యాష్ బ్యాక్, రూ. 20,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.10,000 కార్పొరేట్ బెనిఫిట్స్‌ను సంస్థ అందిస్తోంది. ఈఎంఐలో కొనుగోలు చేసే వారికి 7.99 శాతం ప్రత్యేక వడ్డీ రేటును అమలు చేస్తోంది.
మొత్తం రెండు వేరియంట్లలో లభ్యం..
నిస్సాన్ కిక్స్ మొత్తం రెండు పెట్రోల్ ఇంజిన్ల ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది. 1.3- లీటర్ టర్బోచార్జ్డ్ ఇంజిన్ 154 bhp, 254 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇక, 1.5- లీటర్ ఇంజిన్ 105 bhp, 142 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనిలో 5 -స్పీడ్ మాన్యువల్, 6 -స్పీడ్ మాన్యువల్, సీవీటీ ఆటోమేటిక్ వంటి ట్రాన్స్మిషన్ ఆప్షన్లను అందించింది. భారత మార్కెట్లో నిస్సాన్ కిక్స్ ధర ప్రస్తుతం రూ. 9.5 లక్షల నుంచి రూ. 14.65 లక్షల (ఎక్స్-షోరూమ్, ఇండియా) మధ్య అందుబాటులో ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cars, Cash promo