NHEV SUGGESTS BLACK BOX LIKE FEATURE TO MONITOR EV BATTERIES UMG GH
EV Batteries: ఎలక్ట్రిక్ వెహికల్స్‌కు కొత్త సిఫార్సులు.. బ్లాక్-బాక్స్ అంట.. ఆ తప్పు జరగకుండా ఉండటానికే..!
ప్రతీకాత్మక చిత్రం
ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీ స్వాపింగ్, ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు సంబంధించిన సేఫ్టీ రికమండేషన్స్ సిఫార్సు చేసింది NHEV. బ్యాటరీ సిస్టమ్ కోసం బ్లాక్-బాక్స్ వంటి ఫీచర్‌ను ఇన్స్టాల్ చేయడం.. బ్యాటరీ ఫెయిల్యూర్‌కి దారితీసే సమస్యలను గుర్తించడం వంటివి రికమ?
గత కొంతకాలంగా భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (Electric Vehicles)లో మంటలు ఎగిసి పడటం కొనసాగుతూనే ఉంది. వరుసగా జరుగుతున్న ఈ ప్రమాదాల్లో ఎలక్ట్రిక్ స్కూటర్లు, కార్లు పూర్తిగా దగ్ధమవుతున్నాయి. ఈ ఘటనలు వాహనదారులను హడలెత్తిస్తున్నాయి. అయితే ఎలక్ట్రిక్ వెహికల్స్ వినియోగాన్ని పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వానికి ఈ దుర్ఘటనలు అడ్డంకిగా మారాయి. దీంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే నేషనల్ హైవేస్ ఫర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ (NHEV) ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీ స్వాపింగ్, ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు సంబంధించిన కొన్ని సేఫ్టీ రికమండేషన్స్ సిఫార్సు చేసింది. బ్యాటరీ సిస్టమ్‌లను పర్యవేక్షించడానికి బ్లాక్-బాక్స్ (Black-box) వంటి ఫీచర్‌ను ఇన్స్టాల్ చేయడం.. బ్యాటరీ ఫెయిల్యూర్‌కి దారితీసే సమస్యలను గుర్తించడం వంటివి కూడా ఎన్హెచ్ఈవీ రికమండేషన్స్‌లో ఉన్నాయి.
ఎన్హెచ్ఈవీ తాజాగా జరిగిన ఒక సమావేశంలో ఈవీ బ్యాటరీ (EV Battery) సేఫ్టీకి సంబంధించి 12 మార్గదర్శకాలను సంస్థ జారీ చేసింది. ఈ సూచనల్లో బ్యాటరీలో మంటలకు దారి తీసిన కారణాలు కనుగొనడానికి ఒక ఐడెంటిఫికేషన్ డివైజ్ తీసుకురావడం, బ్యాటరీ ఫెయిల్యూర్‌కి గల కారణం కనుగొనడం వంటివి ఉన్నాయి. ఇదే సమావేశంలో రెగ్యులేటరీ అంశాలకు సంబంధించి నాలుగు సిఫార్సులు కూడా చేసింది. బ్యాటరీ ఫెయిల్యూర్ సమస్యలను గుర్తించడం... బ్యాటరీ స్వాపింగ్ కోసం రియల్-టైమ్ వెరిఫైయబుల్ ఎక్స్ఛేంజ్ వాల్యూ.. అస్థిర ఉష్ణ ప్రవర్తన & రిస్క్స్, ఫెయిల్యూర్‌కి మూల కారణాన్ని అర్థం చేసుకోవడానికి ఐడెంటిఫికేషన్ డివైజ్, డిస్కమ్‌ల నుంచి ఛార్జింగ్ స్టేషన్ల నెట్ మీటరింగ్... ప్రభుత్వ ప్రమాణాలకు అనుగుణంగా ఉండే బ్యాటరీల తయారీకే ఫైనాన్సింగ్ చేయడం వంటి 4 రెగ్యులేటరీల సిఫార్సులను ఎన్హెచ్ఈవీ జారీ చేసింది.
ఎన్హెచ్ఈవీ సమావేశానికి నీతి ఆయోగ్ సభ్యుడు, ఎన్హెచ్ఈవీ నాలెడ్జ్ గ్రూప్ గౌరవాధ్యక్షుడు, వి. కె.సరస్వత్ తో పాటు ఈవీ పరిశ్రమ నుంచి కీలక వాటాదారులు పాల్గొన్నారు. ఎన్హెచ్ఈవీ వర్కింగ్ గ్రూప్ ఈ 12 సిఫార్సులను పాలసీ థింక్ ట్యాంక్, ప్రభుత్వం ముందు ఉంచాలని నిర్ణయించింది. ఈ రికమండేషన్లతో పాటుగా ఇటీవల ప్రకటించిన నాలుగు షార్ట్-టర్మ్ పైలట్లను కూడా థింక్ ట్యాంక్, ప్రభుత్వం ముందు ఉంచాలని నిర్ణయించింది. సోమవారం జరిగిన మరో సమావేశంలో.. సెంట్రల్ ఢిల్లీలో 2,000 ప్రాంతాల్లో 4,000-5,000 ఈవీ ఛార్జర్లను ఏర్పాటు చేయనున్నట్లు ఛార్జ్ పాయింట్ ఆపరేటర్స్ (CPO) సొసైటీ ప్రకటించింది. ఇటీవల ముంబైలో టాటా మోటార్స్ తయారుచేసిన నెక్సాన్ ఈవీ అగ్ని ప్రమాదానికి గురయ్యింది. దీనిపై ప్రభుత్వం విచారణకు ఆదేశించిన నేపథ్యంలోనే ఈ సిఫార్సులను ఎన్హెచ్ఈవీ తీసుకొచ్చింది.
ఇంతకుముందు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ద్వారా ఎలక్ట్రిక్ టూవీలర్ల అగ్ని ప్రమాదాలను పరిశోధించే బాధ్యతను భుజాలకెత్తుకుంది. ఇప్పుడు నెక్సాన్ ఈవీ అగ్నిప్రమాదంపై విచారణకు కూడా డీఆర్డీఓనే నాయకత్వం వహిస్తోంది. గతంలో డీఆర్డీఓ చేసిన విచారణలో ఈవీ ద్విచక్ర వాహనాల బ్యాటరీలలో తీవ్రమైన లోపాలు ఉన్నట్లు తేలింది. ఈవీ వాహనదారుల భద్రత కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) లిథియం-అయాన్ బ్యాటరీల విషయంలో కొత్త పనితీరు ప్రమాణాలను జారీ చేసింది.
Published by:Mahesh
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.