Realme: దసరా బొనాంజా.. రియల్ మీ నుంచి మరికొన్ని స్మార్ట్ ప్రొడక్ట్స్ లాంచ్.. అవి ఏంటంటే..

real me

Realme: భారతదేశంలో పండుగ సీజన్ రావడంతో అనేక ఎలక్ట్రానిక్(Electronic) తయారీ సంస్థలు సరికొత్త మొబైల్ ఫోన్స్, టీవీలు లాంచ్ (Launch)చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ (Smartphone) బ్రాండ్ రియల్‌మీ అనేక కొత్త ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ లాంచ్ చేస్తున్నట్టు ప్రకటించింది.

  • Share this:
భారతదేశంలో పండుగ సీజన్ రావడంతో అనేక ఎలక్ట్రానిక్(Electronic) తయారీ సంస్థలు సరికొత్త మొబైల్ ఫోన్స్, టీవీలు లాంచ్ (Launch)చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ (Smartphone) బ్రాండ్ రియల్‌మీ అనేక కొత్త ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ లాంచ్ చేస్తున్నట్టు ప్రకటించింది. రియల్‌మీ 4K స్మార్ట్ టీవీ గూగుల్ స్టిక్, రియల్‌మీ బ్రిక్ బ్లూటూత్ స్పీకర్, రియల్‌మీ స్మార్ట్‌ఫోన్‌ గేమింగ్ యాక్సెసరీస్, ట్రూ వైర్‌లెస్ ఇయర్ ఫోన్స్, రియల్‌మీ బడ్స్ ఎయిర్ 2 డివైజ్‌లను తీసుకొస్తున్నట్లు వెల్లడించింది. ఈ గ్యాడ్జెట్స్ అన్నీ భారత్ లో అక్టోబర్ 13న జరగనున్న లైవ్ వర్చువల్‌ ఈవెంట్ లో లాంచ్ కానున్నాయి.

New Smart Phone: ఇండియాలో లాంచ్ కానున్న కొత్త స్మార్ట్‌ఫోన్.. ధర, స్పెసిఫికేషన్ల వివరాలివే..


అక్టోబర్ 13 బుధవారం మధ్యాహ్నం 12.30 గంటలకు రియల్‌మీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో లాంచ్ ఈవెంట్ ప్రత్యక్ష ప్రసారమవుతుంది. అద్భుతమైన టీవీ వ్యూయింగ్(Viewing) అనుభూతిని కోరుకునే కస్టమర్ల అవసరాలకు తగినట్లు టీవీ స్టిక్స్ రూపొందించినట్లు కంపెనీ పేర్కొంది. దీంతోపాటు రియల్‌మీ 4కె స్మార్ట్ టీవీ గూగుల్ స్టిక్, రియల్‌మీ బ్రిక్ బ్లూటూత్ స్పీకర్, రియల్‌మీ స్మార్ట్‌ఫోన్ గేమింగ్ యాక్సెసరీస్, రియల్‌మీ బడ్స్ ఎయిర్ 2 (క్లోజర్ గ్రీన్)లను భారత్‌లో లాంచ్ చేస్తున్నామని సంస్థ తెలిపింది.

ఆండ్రాయిడ్ ఓఎస్ ఆధారంగా రియల్‌మీ 4కె స్మార్ట్ టీవీ గూగుల్ స్టిక్ పని చేస్తుందని కంపెనీ తెలిపింది. భారతదేశంలో రియల్‌మీ రిలీజ్ చేసే మొట్టమొదటి టీవీ స్టిక్ ఇదే కావడం విశేషం. స్మూత్ డిస్‌ప్లే, మెరుగైన పర్ఫామెన్స్ కోసం గూగుల్ స్టిక్ లో శక్తివంతమైన ప్రాసెసర్ ఇచ్చారు. ఇది సూపర్ లార్జ్ గా ఉంటుందని సమాచారం. ఇది అనేక ఎంటర్‌టైన్‌మెంట్ ప్లాట్‌ఫామ్‌లు, పలు కనెక్షన్‌లతో వస్తుంది.

Flipkart Big Billion Days: ఫ్లిప్‌కార్ట్ సేల్ మరో రెండు రోజులే... రూ.15,000 లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే


రియల్‌మీ బ్రిక్ బ్లూటూత్ స్పీకర్ లో ఎక్స్ట్రా బేస్, మోర్ పవర్, డైనమిక్ బేస్ బూస్ట్ డ్రైవర్లు, లాంగ్ ప్లేబ్యాక్ టైమ్, స్టీరియో పెయిరింగ్, ఈక్వలైజర్ ప్రీసెట్‌లు, బాస్ రేడియేటర్‌లు, బ్లూటూత్ టెక్నాలజీ వంటి ఎన్నో ఫీచర్లు అందించారు. రియల్‌మీ బ్రిక్ బ్లూటూత్ స్పీకర్ అద్భుతమైన ఆడియో ఎక్స్పీరియన్స్ అందిస్తుందని కంపెనీ పేర్కొంది. రియల్‌మీ గేమింగ్ యాక్సెసరీస్‌లో రియల్‌మీ కూలింగ్ బ్యాక్ క్లిప్ నియో, రియల్‌మీ టైప్-సీ సూపర్‌డార్ట్ గేమ్ కేబుల్, రియల్‌మీ మొబైల్ గేమ్ ట్రిగ్గర్ లను కంపెనీ లాంచ్ లాంచ్ చేయనుంది.

అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉండే ఈ యాక్సెసరీస్‌లు ప్రత్యేకంగా గేమింగ్ ప్రియుల కోసం రూపొందించారు. రియల్‌మీ కూలింగ్ బ్యాక్ క్లిప్ నియో గేమ్ సౌండ్ బాగా తగ్గించేస్తుంది. ఫలితంగా మొబైల్ బ్యాక్ సెకన్లలో కూల్ అవుతుంది. రియల్‌మీ టైప్-సీ సూపర్‌డార్ట్ గేమ్ కేబుల్ ఛార్జింగ్ చేస్తున్న సమయంలో గేమ్స్ ఫ్రీగా ఆడటానికి అనుమతిస్తుంది. రియల్‌మీ మొబైల్ గేమ్ ట్రిగ్గర్ గేమర్ చేతి వేళ్లకు రియాక్టివిటీ అనుభూతిని కలిగిస్తుంది. ఈ యాక్సెసరీస్‌లు గేమర్‌లకు అద్భుతమైన గేమింగ్ అనుభవాన్ని అందిస్తాయి.
Published by:Veera Babu
First published: