హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

దూసుకుపోతున్న న్యూస్18 తెలుగు, న్యూస్18 బంగ్లా.. ఏప్రిల్ 2021లో నంబర్‌వన్ స్థానం..

దూసుకుపోతున్న న్యూస్18 తెలుగు, న్యూస్18 బంగ్లా.. ఏప్రిల్ 2021లో నంబర్‌వన్ స్థానం..

న్యూస్18 తెలుగు లోగో

న్యూస్18 తెలుగు లోగో

News18 Telugu: డిజిటల్ రంగంలోకి అడుగుపెట్టిన కొద్దికాలంలోనే న్యూస్18 బంగ్లా, న్యూస్18 తెలుగు న్యూస్ వెబ్‌సైట్లు తమ తమ భాషల్లో నంబర్‌వన్ స్థానానికి చేరుకున్నాయి.

డిజిటల్ రంగంలో దూసుకుపోవడం అంత ఈజీ కాదు. మిగతా రంగాలతో పోలిస్తే ఇక్కడ కాస్త పోటీ ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ రంగంలోకి అడుగుపెట్టిన కొద్దికాలంలోనే న్యూస్18 బంగ్లా, న్యూస్18 తెలుగు న్యూస్ వెబ్‌సైట్లు తమ తమ భాషల్లో నంబర్‌వన్ స్థానానికి చేరుకున్నాయి. జర్నలిజం విలువలను కచ్చితంగా పాటిస్తూ నాణ్యమైన వార్తలు, ఫోటోలు, వీడియోలను నెటిజన్లకు అందిస్తూ వారి అభిమానాన్ని సొంతం చేసుకున్నాయి. 12.04 మిలియన్ యూనిక్ వ్యూవర్స్‌ను సాధించిన న్యూస్18 తెలుగు.. సాక్షి (12 మిలియన్ యూజర్లు), టీవీ9తెలుగు(11.98 మిలియన్ యూజర్లను)ను దాటుకుని ఏప్రిల్ 2021లో కామ్‌స్కోర్ మొబైల్ మెట్రిక్స్ లెక్కల ప్రకారం నంబర్‌వన్ స్థానానికి చేరుకుంది.

ఇక ఏప్రిల్ 2021లో న్యూస్18 బంగ్లా బంగ్లా భాషలో అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది. 7.42 మిలియన్ల యూనిక్ వ్యూవర్స్‌ను సాధించింది. అనందబజార్.కామ్(6.96 మిలియన్ వ్యూవర్స్), ఈసమయ్(6.95 వ్యూవర్స్)‌ను అధిగమించింది. అన్ని వర్గాలకు సంబంధించిన వ్యూవర్స్‌కు చేరువైన న్యూస్18 బంగ్లా.. ఎన్నికల సమయంలో వారికి దగ్గరైంది. గ్రౌండ్ రిపోర్ట్, వీడియోలు, నమ్మదగిన వార్తలతో వారి అభిమానాన్ని సొంతం చేసుకుంది.


న్యూస్18 తెలుగు, న్యూస్18 బంగ్లా దేశంలోని అతిపెద్ద మీడియా సంస్థల్లో ఒకటైన నెట్‌వర్క్18 డిజిటల్ విభాగానికి చెందిన సంస్థలు. నెట్‌వర్క్18 టెలివిజన్, ఇంటర్నెట్, సినిమాలు, ఈ-కామెర్స్, మ్యాగజైన్లు, మొబైల్ కంటెంట్ వంటి రంగాల్లోనూ సత్తా చాటుతోంది. వెబ్‌సైట్లు డిజిటల్ రంగంలో కొలమానంగా భావించే కామ్‌స్కోర్ మొబైల్ మెట్రిక్స్‌లో వెబ్‌సైట్ ఎంతమందికి చేరువైందనే అంశాలతో యూనిక్ యూజర్లు, పేజ్ వ్యూస్, బ్రౌజింగ్ సమయం, వెబ్ సైట్‌ను రోజూవారీగా సందర్శించే వారి సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటారు.

First published:

Tags: News18

ఉత్తమ కథలు