NewNew App: ఇతరుల జీవితాన్ని నియంత్రించగలిగే కొత్త యాప్

NewNew App: ఇతరుల జీవితాన్ని నియంత్రించగలిగే కొత్త యాప్ (ప్రతీకాత్మక చిత్రం)

NewNew App | యాప్ మార్కెట్‌లో న్యూన్యూ యాప్ ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ సరికొత్త యాప్‌తో ఇతరుల జీవితాలను నియంత్రించొచ్చు. అసలు ఈ యాప్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోండి.

  • Share this:
ఇంటర్నెట్, స్మార్ట్‌ఫోన్లు ఎక్కువ మందికి అందుబాటులోకి వచ్చిన తరువాత యాప్స్ వినియోగం పెరిగింది. వివిధ రకాల సేవలను కంపెనీలు యాప్స్‌ ద్వారా అందిస్తున్నాయి. ఈ తరం యువతకు తగ్గట్టు కొత్త రకం సేవలపై దృష్టి పెట్టిన ఎన్నో స్టార్టప్‌లు సక్సెస్‌ అయ్యాయి. తాజాగా ఒక కొత్త సోషల్ మీడియా యాప్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. ఇతరుల జీవితాన్ని ప్రభావితం చేసే శక్తిని యూజర్లకు కల్పిస్తోంది న్యూన్యూ (NewNew) అనే యాప్. ఎదుటివారి జీవితంలోని కీలకమైన అంశాలను నియంత్రించే అవకాశాన్ని ఈ యాప్ కల్పిస్తోంది. రెండు అంశాల్లో ఏదో ఒకదాన్ని ఎంచుకోలేని సందర్భంలో.. క్రియేటర్లు, సెలబ్రిటీలు తమ ఫాలోవర్స్‌కు ఓటింగ్ నిర్వహించవచ్చు. ఇలాంటప్పుడు, దేన్ని ఎంచుకుంటే మంచిదనే తుది నిర్ణయాన్ని.. వారి అనుచరుల ఓటింగ్ అభిప్రాయాలే నిర్దేశిస్తాయి. ఇక్కడ మరో విషయం ఉంది. ఓటింగ్‌లో పాల్గొనే వ్యక్తులు కొంత డబ్బు చెల్లించాల్సి ఉంటుంది.

ఈ ప్లాట్‌ఫాం సోషల్ పోలింగ్ కాన్సెప్ట్‌ను తదుపరి స్థాయికి తీసుకెళ్లనుంది. ఇక్కడ ప్రతి ఒక్కరూ తమ ఆప్షన్లను ఒక రకమైన సోషల్ స్టాక్ మార్కెట్‌గా మార్చుకోవచ్చు. ఇది క్రియేటర్లకు డబ్బు సంపాదించే వీలు కల్పిస్తుంది. అక్కడ ఇతరులు ఓటింగ్ అనే షేర్స్ ద్వారా ఎదుటివారి నిర్ణయాన్ని ప్రభావితం చేయవచ్చు. ఇందుకు పెట్టుబడిగా చెల్లించే మొత్తం ఐదు డాలర్లు. ఒక ఓటుకు కనీసం ఐదు డాలర్లను ఫాలోవర్లు చెల్లించాల్సి ఉంటుంది. ఈ యాప్ ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉంది. బీటా వెర్షన్‌లో కొందరికి న్యూన్యూ సేవలు అందుబాటులోకి వచ్చాయి.

Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఈ 15 స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్

Online Banking: ఆన్‌లైన్‌లో డబ్బులు పంపిస్తున్నారా? ఈ విషయాలు గుర్తుంచుకోండి

క్రియేటర్లకు ఆదాయ మార్గం


రచయితలు, పెయింటర్స్, మ్యుజిషియన్స్, ఫ్యాషన్ డిజైనర్లు, బ్లాగర్లు.. వంటి క్రియేటర్ల కోసం దీన్ని రూపొందించారు. ఇతర సోషల్ మీడియా యాప్‌లతో పోలిస్తే, ఈ ప్లాట్‌ఫాంలో క్రియేటర్లు తమ అభిమానులు, ఫాలోవర్లతో మరింత ఎక్కువగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. దీంతో పాటు ఈ కనెక్షన్‌ను డబ్బు సంపాదించే మార్గంగా ఉపయోగించే వీలు కూడా ఉంటుంది. క్రియేటర్లు ముందు యాప్‌లో అకౌంట్ ఓపెన్ చేసుకొని, ఫాలోవర్లను సంపాదించుకోవాలి. వీరు తమ వ్యక్తిగత విషయాలపై నిర్ణయాన్ని ఫాలోవర్లకు వదిలేయవచ్చు. ఏదైనా విషయంలో తుది నిర్ణయం కోసం ఓటు వేయాలని వీడియో క్లిప్‌ల ద్వారా యాప్‌లో కోరాలి.

ఫాలోవర్లు తమకు నచ్చిన, అభిమాన క్రియేటర్ల నిర్ణయంలో భాగం అయ్యే అవకాశం కలుగుతుంది. ఇలా ఓటు వేసినప్పుడల్లా ఫాలోవర్లు కొంత డబ్బు చెల్లించాలి. దీని నుంచి కొంత కమీషన్‌ను న్యూన్యూ ప్లాట్‌ఫాం తీసుకొని, మిగతాది క్రియేటర్లకు ఇస్తుంది. క్రియేటర్లు ఒక ప్రశ్న, దానికి రెండు సమాధానాలను యాప్‌లో సెట్ చేయాలి. ఫాలోవర్లు దీనికి ఎన్నిసార్లు అయినా ఓటు వేయవచ్చు. ఇందుకు ప్రతిసారీ కొంత డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. ఓటింగ్ ముగిసిన తరువాత ఫలితం ఎలా వచ్చినా కూడా, ఫాలోవర్లు తాము చెల్లించిన డబ్బు తిరిగి పొందే అవకాశం ఉండదు.

Realme 8 5G: ఈ 5జీ స్మార్ట్‌ఫోన్ ధర ఇప్పుడు రూ.13,999 మాత్రమే

Free Wifi at Railway Station: దేశంలోని 6,000 రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై

క్రియేటర్లకు సూచనలు


ఓటింగ్‌తో పాటు అమ అభిమాన క్రియేటర్లకు కొన్ని సూచనలు చేసే అవకాశాన్ని కూడా న్యూన్యూ ప్లాట్‌ఫాం కల్పిస్తోంది. ఉదాహరణకు ఒక రచయిత రాసే పుస్తకంలోని ఒక పాత్రకు పేరును అభిమానులు సూచించవచ్చు. అయితే ఇందుకు కూడా కాస్త డబ్బు చెల్లించాలి. ఇది 20 డాలర్ల నుంచి ప్రారంభమవుతుంది. కానీ క్రియేటర్లు మాత్రం తమ అభిమానులు లేదా ఫాలోవర్ల సూచనలను పక్కనపెట్టవచ్చు. ఈ సందర్భంలో ఫాలోవర్లు డబ్బు చెల్లించాల్సిన అవసరం ఉండదు. తమ సూచనలను క్రియేటర్లు పరిగణనలోకి తీసుకుంటేనే ఆ మొత్తం చెల్లించాల్సి ఉంటుంది.

ప్లాట్‌ఫాంలో పెట్టుబడులు


కోర్టిన్ స్మిత్ అనే మహిళా ఎంటర్‌ప్రెన్యూర్ న్యూన్యూ ప్లాట్‌ఫాం సహ వ్యవస్థాపకులు, సీఈఓగా వ్యవహరిస్తున్నారు. భవిష్యత్తులో ఈ సేవలను విస్తరించేందుకు ఆమె ప్రణాళికలు వేస్తున్నారు. ఇప్పటికే ప్రముఖ ఇన్వెస్టర్లు న్యూన్యూలో పెట్టుబడులు పెడుతున్నారు. ఈ ఆలోచనపై స్మిత్ రెండేళ్లుగా పనిచేస్తున్నారు. ఇప్పటికే అందుబాటులో ఉన్న కొన్ని యాప్‌లు పోలింగ్, ఓటింగ్ అవకాశాన్ని కల్పిస్తున్నాయి. అయితే న్యూన్యూ యాప్ మాత్రం, కొంత డబ్బు చెల్లించడం ద్వారా క్రియేటర్లకు సంబంధించిన వ్యక్తిగత జీవిత అంశాలపై ఓటు వేయడానికి అవకాశం కల్పిస్తోంది. ఈ యాప్‌ను రెండు నెలల క్రితం ప్రారంభించారు. ప్రస్తుతం ఈ ప్లాట్‌ఫాంలో 100 కంటే తక్కువ మంది క్రియేటర్లు మాత్రమే ఉన్నారు.

పాలోవర్లకు ఏం లాభం?


ఒక క్రియేటర్ రోజువారీ వ్యవహారాలపై ఓటు వేయడం వల్ల ఫాలోవర్లకు ఎలాంటి లబ్ధి చేకూరుతుందని చెప్పడం కష్టం. ఈ ప్లాట్‌ఫాం ద్వారా ఫాలోవర్లు, క్రియేటర్ల మధ్య బంధం మరింత బలోపేతమవుతుంది. న్యూన్యూ అనేది ఒక వ్యక్తితో సన్నిహితంగా ఉండటానికి అభివృద్ధి చేసిన కొత్త మార్గం. అయితే ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చిన తరువాతే, యాప్ విజయవంతం అవుతుందా లేదా అనేది తెలియనుంది.
Published by:Santhosh Kumar S
First published: