NEW TECHNOLOGY UPDATES INSTAGRAM TO ALLOW LONGER VIDEOS UP TO 60 SECONDS ON STORIES GH SK
Instagram: ఇన్స్టాగ్రామ్ నుంచి మరో కొత్త అప్డేట్.. ఇన్‌స్టా స్టోరీస్ వీడియోల నిడివి పెంపు
ప్రతీకాత్మక చిత్రం
Instagram Stories: ఇప్పటి వరకు 15 సెకండ్ల వరకు మాత్రమే ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ వీడియో చేసుకునే వీలుండగా.. ప్రస్తుతం ఈ నివిడిని 60 సెకండ్ల వరకు పెంచింది. దీని గురించి ఇన్స్టాగ్రామ్ తమ యూజర్లకు నోటిఫికేషన్ ద్వారా తెలియజేస్తుంది.
మెటా (గతంలో ఫేస్బుక్) ఆధ్వర్యంలో నడిచే సోషల్ మీడియా యాప్ ఇన్స్టాగ్రామ్ క్రేజ్ అంతా ఇంతా కాదు. సెలబ్రిటీల దగ్గర నుంచి సామాన్యుల వరకు అంతా తమను తాము ఆవిష్కరించుకునేందుకు అదో చక్కటి వేదికగా ఉపయోగపడుతోంది. ముఖ్యంగా దీనిలో ఉండే స్టోరీస్ ప్లాట్‌ఫాంకు చాలా ప్రాధాన్యం ఉంది. 24 గంటల వరకు కనిపించే ఈ స్టోరీస్ యువతకు బాగా కనెక్ట్ అయ్యాయి. ఈ నేపథ్యంలో దానిని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్ది వినియోగదారులకు అందించేందుకు ఇన్‌స్టా మేకర్స్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు 15 సెకండ్ల వరకు మాత్రమే ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ వీడియో చేసుకునే వీలుండగా.. ప్రస్తుతం ఈ నివిడిని 60 సెకండ్ల వరకు పెంచింది. దీని గురించి ఇన్స్టాగ్రామ్ తమ యూజర్లకు నోటిఫికేషన్ ద్వారా తెలియజేస్తుంది.
* పోటీని అధిగమించేందుకే..
ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌కు స్నాప్‌చాట్, టిక్‌టాక్ ల నుంచి విపరీతమైన పోటీ ఎదురవుతోంది. ఈ విభాగంలో షార్ట్ వీడియోస్ ప్లాట్‌ఫాం టిక్‌టాక్ ఇప్పటికే నంబర్ వన్‌గా దూసుకుపోతుండగా.. ఇప్పుడు స్నాప్‌చాట్ కూడా షార్ట్ వీడియోల కోసం కొత్త యాప్‌ను ప్రారంభించింది. దీంతో చాలా మంది షార్ట్ వీడియో లవర్స్ వాటికి ఆకర్షితులవుతున్నారు. ఇన్‌స్టా నుంచి ఇతర యాప్స్‌కు మారుతున్నారు. ఈ నేపథ్యంలో ఇన్స్టాగ్రామ్ కూడా తన వినియోగదారులను కాపాడుకునేందుకు.. వారికి కొత్త అనుభూతిని కలిగించేందుకు యాప్‌ను అప్‌గ్రేడ్ చేసింది. 15 సెకండ్లుగా ఉన్న వీడియో నివిడిని నిమిషం వరకు పెంచింది.
JioSaavn: జియో యూజర్లకు బంపరాఫర్... ఒక్క రూపాయికే జియోసావన్ సబ్స్క్రిప్షన్
* కొత్త అప్డేట్లో ఏముందంటే..
ఇన్‌స్టా తీసుకొచ్చిన కొత్త అప్డేట్లో స్టోరీల నివిడి 60 సెకండ్లు ఉండనుంది. ఇప్పటి వరకు ఇస్టా స్టోరీలో 15 సెకండ్లు దాటితే అది ఆటోమేటిక్‌గా స్ప్లిట్ అయిపోతుంది. ఒకే స్టోరీ చేసినా.. దాని నివిడిని బట్టి రెండు మూడు స్టోరీలుగా విడిపోతుంది. దీని వల్ల వినియోగదారులు కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు తీసుకొచ్చిన కొత్త అప్డేట్ ప్రకారం 60 సెకండ్ల వరకూ ఒకే స్టోరీ అయ్యే వెసులుబాటు ఉంటుంది. రెండు, మూడు స్టోరీలుగా విడిపోదు. తద్వరా వినియోదారులకు మరింత సౌకర్యవంతంగా ఉంటుంది.
యూజర్లు క్రియేట్ చేసుకున్న స్టోరీలను ఇతర సోషల్ మీడియా అకౌంట్లలో పోస్ట్ చేసేందుకు సులువైన విధానాలను తీసుకొచ్చింది ఇన్స్టాగ్రామ్. అలాగే దానిలో లోకేషన్ కూడా యాడ్ చేసుకునేందుకు మరింత సౌకర్యవంతంగా తీర్చిదిద్దింది. దీని ద్వారా వినియోగదారులకు సరికొత్త అనుభూతిని మిగల్చడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ అప్డేట్తో తమకు తీవ్ర పోటీ ఇస్తున్న సోషల్ నెట్వర్క్ సైట్లకు దీటుగా నిలబడేందుకు ఇన్‌స్టా ప్రయత్నిస్తోంది.
అయితే ఈ అప్డేట్ ప్రపంచవ్యాప్తంగా ఉందా.. లేక కొన్ని దేశాల్లోనే ప్రయోగాత్మకంగా తీసుకొచ్చిందా? అనే విషయంలో స్పష్టత లేదు. ఇప్పటి వరకూ అయితే కొంతమంది వినియోగదారులకు మాత్రమే దీనిని అందుబాటులో ఉంచింది. మీరూ ఒక సారి గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్లి, ఒకసారి యాప్ అప్డేట్ చేసి చూడండి. ఫీచర్ అందుబాటులోకి వచ్చిందేమో తెలుస్తుంది.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.