మన చందమామ ముసలోడే.. జాబిల్లి వయసెంతో తెలుసా..

Moon Age: నాసా శాస్త్రవేత్తలు చందమామ వయసును కచ్చితంగా లెక్కించారు. అపోలో మిషన్ సందర్భంగా చంద్రుడి ఉపరితలం నుంచి తీసుకొచ్చిన పలు శాంపిళ్లను పరిశీలించగా 451 కోట్ల సంవత్సరాల క్రితం జాబిల్లి ఏర్పడిందని శాస్త్రవేత్తలు తేల్చారు.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: July 31, 2019, 3:17 PM IST
మన చందమామ ముసలోడే.. జాబిల్లి వయసెంతో తెలుసా..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
రాత్రి వేళలో.. పున్నమి వెలుతురులో.. అమ్మ తినిపించే గోరుముద్దలు.. పాడే లాలి పాటలన్నీ మరపురాని గుర్తులు, మనసుకు ఉల్లాసాన్నిచ్చే తీపి జ్ఞాపకాలు. వీటన్నింటికీ సాక్ష్యం చందమామే. అమ్మకు, చందమామకు ఉన్న అనుబంధం వేల ఏళ్ల నాటిది. కాదు.. కాదు.. కోట్ల సంవత్సరాలది అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే.. మనం ఇప్పటి వరకు చంద్రుడి వయసు భూమి కంటే చాలా తక్కువ అని భావిస్తూ వచ్చాం. కానీ, చాలా ఎక్కువేనట. తాజాగా నాసా శాస్త్రవేత్తలు చందమామ వయసును కచ్చితంగా లెక్కించారు. అపోలో మిషన్ సందర్భంగా చంద్రుడి ఉపరితలం నుంచి తీసుకొచ్చిన పలు శాంపిళ్లను పరిశీలించగా 456 కోట్ల సంవత్సరాల క్రితం జాబిల్లి ఏర్పడిందని శాస్త్రవేత్తలు తేల్చారు. 1969 జూలై 21న నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌, ఎడ్విన్‌ ఆల్ర్డిన్‌ చంద్రుడిపై కాలుమోపిన సందర్భంగా అక్కడి నుంచి 21.55 కిలోల శాంపిళ్లను భూమిపైకి తీసుకొచ్చారు. వాటిని జర్మనీలోని కోలెగ్నో యూనివర్సిటీ శాస్త్రవేత్తలు విశ్లేషించగా సౌర వ్యవస్థ ఏర్పడిన 5 కోట్ల సంవత్సరాలకు చందమామ ఏర్పడిందని వెల్లడైంది.

moon landing,moon,moon landing hoax,moon landing conspiracy,moon landing fake,fake moon landing,moon landing footage,moon landing conspiracy theories,moon landing 50 years later,landing,nasa,neil armstrong,moon landings,moon landing movie,moon landing first man,moon landing documentary,iet moon landing,moon landing hoax proof,moon landing 50th anniversary,moon landing film,moon landing 1969,మూన్ లాండింగ్, చందమామపై కాలు,నీల్ ఆర్మ్ స్ట్రాంగ్,50 ఏళ్లు పూర్తి, నాసా, గూగుల్ డూడుల్,
చంద్రుడిపై కాలు పెట్టి 50 ఏళ్లు


ఇప్పటి వరకు సౌర వ్యవస్థ ఏర్పడిన 15 కోట్ల సంవత్సరాలకు చంద్రుడు రూపాంతరం చెందాడని భావిస్తూ వచ్చాం. అది నిజం కాదని, అనుకున్నదానికంటే చాలా కోట్ల ఏళ్ల క్రితమే జాబిల్లి పుట్టాడని తాజాగా శాస్త్రవేత్తలు నిర్ధారించారు.
First published: July 31, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading