Hallo App: కొత్త సోషల్‌ మీడియా యాప్ 'హల్లో' వచ్చింది... ఓ సారి 'హలో' చెప్పేద్దామా

Hallo App: కొత్త సోషల్‌ మీడియా యాప్ 'హల్లో' వచ్చింది... ఓ సారి 'హలో' చెప్పేద్దామా

Hallo App | హల్లో పేరుతో కొత్త సోషల్ మీడియా యాప్ వచ్చేసింది. ఈ యాప్ ప్రత్యేకతలు ఏంటో తెలుసుకోండి.

  • Share this:
సోషల్‌ మీడియాలో మనుషుల జీవితంలో ఓ భాగమైపోయిన రోజులివి. ఎన్ని సోషల్‌ మీడియా యాప్‌లు వచ్చినా.. వాటిని ప్రజలు ఆదరిస్తున్నారు. దేనికదే విభిన్నమైన ఆప్షన్లు, ఫీచర్లతో ఉండటమే ఇందుకు కారణం. కొన్ని మన దేశంలో ఆకట్టుకోకపోయినా... విదేశాల్లో వావ్‌ అనిపిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా మరో యాప్‌ అందుబాటులోకి వచ్చింది. అదే ‘హల్లో యాప్‌’. ఇద్దరు వాట్సాప్‌ మాజీ ఉద్యోగులు ఈ యాప్‌ను సిద్ధం చేశారు. మరి ఈ యాప్‌ ఫీచర్లు, ఆప్షన్లేంటో చూద్దామా!

సోషల్‌ మీడియాను అందరూ వాడుతున్నా.. ఎక్కడో ఓ చిన్న భయం ఉంటుంది. అదే ప్రైవసీ గురించి ఆందోళన. రెండోది ట్రోలింగ్‌. ఈ రెండింటికీ ఆస్కారం లేకుండా ‘హల్లోయాప్‌’ను రూపొందించారు నీరజ్‌ అరోరా, మైఖేల్‌ డోనూ. నీరజ్‌ గతంలో వాట్సాప్‌ చీఫ్‌ బిజినెస్‌ ఆఫీసర్‌గా పని చేసేవారు. మైఖేల్‌... ఇంజినీరింగ్‌ డైరక్టర్‌గా విధులు నిర్వర్తించేవారు. ‘హల్లో యాప్‌’లో యాడ్స్‌ అనేవే ఉండవని వారు చెబుతున్నారు. మీ మొబైల్‌ కాంటాక్ట్స్‌లో ఉన్నవాళ్లు ‘హల్లో యాప్‌’లో ఖాతా తెరిస్తే... ఆటోమేటిక్‌గా మీరు వారితో సంభాషించొచ్చు. తద్వారా ఈ యాప్‌ పూర్తి ప్రైవేట్‌ స్పేస్‌గా ఉంటుందట.

Samsung Galaxy M21 2021: సాంసంగ్ గెలాక్సీ ఎం21 కొత్త మోడల్ వచ్చేసింది... ధర ఎంతంటే

Redmi Note 10T 5G: రెడ్‌మీ నుంచి తక్కువ ధరకే తొలి 5జీ స్మార్ట్‌ఫోన్... రెడ్‌మీ నోట్ 10టీ 5జీ ప్రత్యేకతలు ఇవే

‘హల్లో యాప్‌’ను నేరుగా వాట్సాప్‌కు పోటీగా తీసుకొచ్చినట్లు అర్థమవుతోంది. అయితే దీనికి సిగ్నల్‌, టెలిగ్రామ్‌ నుంచి గట్టి పోటీయే ఎదురవుతుంది. ‘హల్లో యాప్‌’లో ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌లు పంపడం, యాక్సెప్ట్‌ చేమని అడగడం లాంటి ఝంఝాటాలు ఉండవట. మొబైల్‌ కాంటాక్ట్స్‌లో ఎవరైనా హల్లో యాప్‌లో చేరితే... వారి పోస్టులు యాప్‌ హోం స్క్రీన్‌లో ఆటోమేటిక్‌గా కనిపించేస్తాయి. అంటే హోమ్‌ సెక్షన్‌లో ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్‌ పోస్టుల తరహాలో పోస్టులు చూసుకునే అవకాశం ఉంది.

హలో పేరుతో ప్లేస్టోర్‌, యాప్‌ స్టోర్‌లో చాలా యాప్స్‌ ఉన్నాయి. అయితే HalloApp అని రెండు పదాలుకలిపి సెర్చ్‌ చేస్తే సులభంగా దొరికేస్తుంది. యాప్‌ ఓపెన్‌ అయ్యాక పేరు, మొబైల్‌ నెంబరు ఇస్తే... ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్‌ చేస్తే మీ ఖాతా తెరుచుకుంటుంది. ఆ తర్వాత యాప్‌ వాడుకోవచ్చు. దీని కోసం యాప్‌ కాంటాక్ట్స్‌, గ్యాలరీ పర్మిషన్‌ అడుగుతుంది. ఇందులో హోమ్, గ్రూప్స్‌,ఛాట్స్‌, సెట్టింగ్స్‌ ఐకాన్‌ ఉంటాయి. ఒకవేళ మీ డేటా కావాలన్నా, అకౌంట్‌ డిలీట్‌ చేయాలన్నా... సెట్టింగ్స్‌ ఐకాన్‌ క్లిక్‌ చేసి అకౌంట్‌లోకి వెళ్లాలి. అక్కడ రిక్వెస్ట్‌ డేటా, డిలీట్‌ అకౌంట్‌ అని ఉంటుంది.

Dual WhatsApp: స్మార్ట్‌ఫోన్‌లో ఈ సెట్టింగ్స్‌ మారిస్తే రెండు వాట్సప్ అకౌంట్స్ వాడుకోవచ్చు

Earphones: ఆ ఇయర్‌ఫోన్స్ ధర రూ.1,29,990... షాకయ్యారా? ఎందుకో తెలుసుకోండి

యాప్‌ యూజర్ల నుంచి ఎలాంటి డేటా సేకరించడం లేదని సంస్థ వ్యవస్థాపకులు చెబుతున్నారు. అలాగే యాప్‌కు సంబంధించి పెద్ద స్థాయిలో హైప్‌ క్రియేట్‌ చేసి ప్రచారం చేసినా ఉపయోగం ఉంటుంది అని అనుకోవడం లేదని వ్యవస్థాపకులు నీరజ్‌, మైఖేల్‌ అన్నారు. యాప్‌ పనితీరు నచ్చి యూజర్లే అందరికీ చెప్పేలా ఉండాలని, తమ యాప్ ఆ పని చేయగలుగుతుందని నమ్ముతున్నామని చెప్పారు.
Published by:Santhosh Kumar S
First published: