కొత్త సంవత్సరంలో(New Year) ప్రీమియం స్మార్ట్‌ఫోన్ల హవా కొనసాగుతోంది. బారత్‌లో ఈ సంవత్సరం 5G నెట్‌వర్క్(Network) సేవలు విడుదలయ్యే అవకాశం ఉంది. దీంతో 2022లో అన్ని కంపెనీలు 5G సపోర్ట్‌తో స్మార్ట్‌ఫోన్‌లను తయారు చేస్తున్నాయి. ప్రధాన స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలు అనేక కొత్త స్మార్ట్‌ఫోన్లను(New Smartpones) లాంచ్ చేశాయి. ఈ నేపథ్యంలో 2022 జనవరిలో(January) విడుదలైన టాప్ స్మార్ట్‌ఫోన్‌లను చూద్దాం.
వివో V23 Pro 5G
వివో నుంచి వచ్చిన V23 Pro 5G స్మార్ట్‌ఫోన్.. 6.56 అంగుళాల AMOLED FHD+ 90Hz డిస్‌ప్లేతో కస్టమర్లను ఆకర్షిస్తోంది. కర్వ్డ్ ఎడ్జెస్, పెద్ద నాచ్‌తో వచ్చిన ఈ ఫోన్‌లో 50-మెగాపిక్సెల్ డ్యూయల్ సెల్ఫీ కెమెరా సిస్టమ్ ఉంటుంది. రియర్ కెమెరా సెటప్‌లో 108-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్, 2-మెగాపిక్సెల్ మాక్రో స్నాపర్ ఉన్నాయి. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 1200 చిప్‌సెట్, 44W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 4,300mAh బ్యాటరీతో విడుదలైంది.
Smartphone Hack: స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు అలర్ట్.. హ్యాకింగ్ గురించి ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
OnePlus 9RT
ఈ స్మార్ట్‌ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, 20:9 యాస్పెక్ట్ రేషియోతో 6.7-అంగుళాల FHD+ AMOLED డిస్‌ప్లేతో వచ్చింది. 8GB RAM, 128GB స్టోరేజ్.. 12GB RAM, 256GB స్టోరేజ్ ఆప్షన్లతో, స్నాప్‌డ్రాగన్ 888 చిప్‌సెట్‌తో విడుదలైంది. 50-మెగాపిక్సెల్ ప్రైమరీ షూటర్, 16-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ లెన్స్, 2-మెగాపిక్సెల్ మాక్రో లెన్స్‌తో ట్రిపుల్-లెన్స్ కెమెరా సెటప్, 16-మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ దీని స్పెషాలిటీ.
The Xiaomi 11T Pro
షియోమి 11T ప్రో స్మార్ట్‌ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, 6.67-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్ 888 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. 108-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్, 5-మెగాపిక్సెల్ టెలిమాక్రో సెన్సార్ ఉన్న ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 16-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో ఈ ఫోన్ విడుదలైంది.
Micromax IN Note 2
ఈ ఫోన్ జనవరి 25న లాంచ్ అయింది. 6.43-అంగుళాల ఫుల్ HD+ AMOLED డిస్‌ప్లే, 21:9 యాస్పెక్ట్ రేషియో, 30W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్న 5000 mAh బ్యాటరీ వంటివి దీని ప్రత్యేకతలు. IN నోట్ 2.. 48-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌తో సహా క్వాడ్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. MediaTek Helio G95 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.
IGNOU: సామాజిక సేవను ఉద్యోగంగా మార్చే కోర్సు... మీరూ ఆన్‌లైన్‌లో చేయొచ్చు
Realme 9i
ఈ స్మార్ట్‌ఫోన్ అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌తో 6.6-అంగుళాల ఫుల్-HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది Qualcomm Snapdragon 680 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2-మెగాపిక్సెల్ మాక్రో కెమెరా, 2-మెగాపిక్సెల్ పోర్ట్రెయిట్ లెన్స్ ఉన్న ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ 16-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా దీంట్లో ఉన్నాయి. 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్న 5000mAh బ్యాటరీతో ఈ ఫోన్ లాంచ్ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్ల ధర, ఫుల్ స్పెసిఫికేషన్లు, ప్రారంభ ఆఫర్ల కోసం అధికారిక వెబ్‌సైట్లు, ఈ-కామర్స్ ప్లాట్‌ఫాంలను సందర్శించవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 5G Smartphone, Mobile News, Mobiles, New Year 2022, Smart phone, Smartphone, Vivo