హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

New Smart Phone: 11న లాంచ్‌ అవుతున్న మరో కొత్త ఫోల్డ్‌ ఫోన్ .. బడ్జెట్ ధరల్లో అందుబాటులోకి..

New Smart Phone: 11న లాంచ్‌ అవుతున్న మరో కొత్త ఫోల్డ్‌ ఫోన్ .. బడ్జెట్ ధరల్లో అందుబాటులోకి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

చైనీస్ కంపెనీ టెక్నో త్వరలోనే టెక్నో ఫాంటమ్ V ఫోల్డ్ పేరుతో ఫోల్డబుల్ ఫోన్‌ను భారత్ లో లాంచ్ చేయనుంది. మరి, దాని స్పెసిఫికేషన్స్, ధర, లాంచ్ వంటి వివరాలను ఇప్పుడు పరిశీలిద్దాం. 

  • Trending Desk
  • Last Updated :
  • Telangana, India

ఇటీవల కాలంలో స్మార్ట్‌ఫోన్ కంపెనీలు ఫోల్డబుల్ సెగ్మెంట్‌పై ఫోకస్ చేస్తున్నాయి. అందుకు తగ్గట్టుగా ఒప్పొ కంపెనీ ఇటీవల ఫైండ్ ఎన్2 ఫ్లిప్‌ పేరుతో తన మొట్టమొదటి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. ఇక శామ్‌సంగ్, మోటోరోలా సైతం ఇప్పటికే ప్లిప్ ఫోన్లను పరిచయం చేశాయి. తాజాగా చైనీస్ కంపెనీ టెక్నో కూడా ఈ జాబితాలో చేరింది. త్వరలోనే టెక్నో ఫాంటమ్ V ఫోల్డ్ పేరుతో ఫోల్డబుల్ ఫోన్‌ను భారత్ లో లాంచ్ చేయనుంది. మరి, దాని స్పెసిఫికేషన్స్, ధర, లాంచ్ వంటి వివరాలను ఇప్పుడు పరిశీలిద్దాం.

* ధర, ఆఫర్ వివరాలు

టెక్నో కంపెనీ ఫాంటమ్ V ఫోల్డ్‌ను బార్సిలోనా వేదికగా జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌-2023లో తొలిసారిగా ప్రదర్శించింది. ఈ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ ఏప్రిల్ 11న లాంచ్ చేయనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో అందుబాటులోకి రానుంది. 12GB+256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.89,999 కాగా, 12GB+512GB వేరియంట్ ధర రూ.99,999గా కంపెనీ నిర్ణయించింది. లాంచ్ ఆఫర్‌లో భాగంగా బేస్ వేరియంట్‌ను రూ.77,777కు విక్రయించనుంది. అయితే ఈ ఆఫర్ పరిమితకాలం మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఏప్రిల్ 12 నుంచి అమెజాన్‌లో దీని సేల్స్ ప్రారంభం కానున్నాయి. ఈ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ బ్లాక్ అండ్ వైట్ కలర్ ఆప్షన్స్‌లో లభించనుంది.

* స్పెసిఫికేషన్స్

టెక్నో ఫాంటమ్ V ఫోల్డ్‌‌లో ధరకు తగ్గట్టు ప్రీమియం ఫీచర్స్ ఉన్నాయి. ఈ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లో రెండు డిస్‌ప్లేలు ఉంటాయి. బయటి డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌తో FHD+ 6.42-అంగుళాల AMOLED ప్యానెల్‌తో ఉంటుంది. మెయిన్ డిస్‌ప్లేలో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 2K 7.65-అంగుళాల AMOLED ప్యానెల్ ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 9000+ SoC ప్రాసెసర్ ద్వారా బెస్ట్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఇది 12GB RAMతో 256/512GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో కనెక్ట్ అయి ఉంటుంది.

* ట్రిపుల్ కెమెరా సెటప్, 5,000mAh బ్యాటరీ

ఈ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 50-మెగాపిక్సెల్ 2X టెలిఫోటో కెమెరా, 13-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ సెన్సార్ ఉంటాయి. అవుట్‌సైట్ స్క్రీన్‌పై 32-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను అమర్చారు. మెయిన్ డిస్‌ప్లేలో 16-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ చేసే 5,000mAh బ్యాటరీ ఉంటుంది. ఫోన్ సరికొత్త Android 13 OS- ఆధారిత HiOS UIపై రన్ అవుతుంది.

School Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 03 నుంచి సెలవులు..

* నోయిడా‌ యూనిట్‌లో తయారీ

టెక్నో కంపెనీ ఫాంటమ్ V ఫోల్డ్‌ను భారత్‌లోనే ఉత్పత్తి చేస్తోంది. నోయిడా‌లోని యూనిట్‌లో ఇప్పటికే ఉత్పత్తిని ప్రారంభించింది. ఈ యూనిట్ సంవత్సరానికి 24 మిలియన్ ఫోన్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది. దీంతో భారత్ నుంచే విదేశాలకు సైతం ఎగుమతి చేసే అవకాశం ఉంది.

First published:

Tags: 5g mobile, 5g technology, Technolgy, Technology, Tecno

ఉత్తమ కథలు