NEW SMART PHONE MOTOROLA LAUNCHED ONE 5G UW ACE ON JULY 9 KNOW FULL FEATURES PRICE AND SPECIFICATIONS HERE NK GH
Motorola One 5G UW Ace: మోటోరోలా నుంచి కొత్త 5G ఫోన్... ధర ఎంతంటే...
Motorola One 5G UW Ace: మోటోరోలా నుంచి కొత్త 5G ఫోన్... (image credit - Inside Verizon)
Motorola One 5G UW Ace: ఇండియాలో, ప్రపంచ దేశాల్లో కరోనా కేసులు తగ్గుతుంటే... మొబైల్ తయారీ కంపెనీలు తిరిగి పుంజుకునేందుకు సరికొత్త హ్యాండ్ సెట్లను రిలీజ్ చేస్తున్నాయి. మరి ఈ కొత్త ఫోన్ సంగతులేంటో చూద్దాం.
Motorola One 5G UW Ace: మోటోరోలా కొత్త 5జీ ఫోన్‌ను విడుదల చేసింది. మోటోరోలా వన్5జీ యూడబ్ల్యూ ఏస్ (One 5G UW Ace) పేరుతో దీన్ని లాంచ్ చేసింది. ఇంటర్నెట్ సూపర్ స్పీడ్‌లో ఉండేందుకు ఇది 5జీ అల్ట్రా-వైడ్బ్యాండ్కనెక్టివిటీ సదుపాయంతో వస్తోంది. అలాగే డాల్బీఅట్మాస్, డీటీఎస్-ఎక్స్ లాంచి వెరిజోన్ అడాప్టివ్ సౌండ్ సిస్టం ఈ మోడల్లో ప్రత్యేకంగా ఉంది. ప్రస్తుతానికి వెరిజోన్ వెబ్సైట్లో ఇది ప్రత్యేకంగా అమ్మకానికి ఉంది. ఈ ఏడాది మొదట్లో లాంచ్ చేసిన మోటోరోలా వన్ 5జీ యూడబ్ల్యూతో పోలిస్తే కొత్తగా తీసుకువచ్చిన ఈ వన్ 5జీ యూడబ్ల్యూ ఏస్‌లో ఈ రెండు మార్పులే ప్రధానంగా ఉన్నాయి.
కొత్త మోటోరోలా వన్ 5జీ యూడబ్ల్యూ ఏస్ ఆండ్రాయిడ్ 11తో వస్తోంది. అలాగే 20:9 యాస్పెక్ట్ రేషియాతో 6.7 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ మ్యాక్స్ వర్షన్ డిస్ప్లే ఉంది. క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్750జీ ఎస్వోసీ, 4 జీబీ ర్యామ్ ఈ ఏస్ మోడల్లో ఉంది. వెనుక 3 కెమెరాలు.. 48 మెగాపిక్సెల్, 8 మెగాపిక్సెల్అల్ట్రావైడ్, 2 మెగాపిక్సెల్మాక్రో షూటర్ కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీల కోసం ఫ్రంట్‌లో 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.
Motorola One 5G UW Ace: మోటోరోలా నుంచి కొత్త 5G ఫోన్... (image credit - Inside Verizon)
మోటోరోలా వన్ 5జీ యూడబ్ల్యూ ఏస్64 జీబీ ఇంటర్నల్ స్టోరేజీతో వస్తుండగా.. మైక్రో ఎస్డీ కార్డుతో స్టోరేజీని పెంచుకోవచ్చు. 5జీ, 4జీ, వైఫై 802.11ఏసీ, బ్లూటూత్ వీ5.1, జీపీఎస్/ఏ-జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ, 3.5ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ కనెక్టివీటీ ఫీచర్లు ఉన్నాయి. అలాగే వెనుక భాగంలో ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌తో ఇది వస్తోంది.
ఇక సౌండ్ఎక్స్పీరియన్స్ రిచ్‌గా ఉండేందుకు వన్ 5జీ యూడబ్ల్యూ ఏస్‌లో కొత్తగా వెరిజోన్ అడాప్టివ్ సౌండ్ సిస్టమ్‌ను మోటోరోలా చేర్చింది. ఫేమస్ యాప్స్‌తో పాటు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌లో కూడా ఈ సౌండ్ సిస్టం పని చేస్తుంది. మ్యూజిక్, వీడియో లాంటి సౌండ్ ప్రొఫైల్స్‌తో పాటు యూజర్లు కూడా కస్టమైజేషన్ ప్రొఫైల్స్క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడున్న కొన్ని ఫోన్లకు కూడా ఓటీఏ అప్డేట్ ద్వారా వెరిజోన్ ఫీచర్ రానుంది. అయితే ఏఏ డివైజ్‌లకు అందిస్తుందో మోటో చెప్పలేదు. మరోవైపు మోటోరోలా వన్ 5జీ యూడబ్ల్యూ ఏస్‌లో 5000 Mah బ్యాటరీ ఉండగా... 20వాట్ల ఫాస్ట్ చార్జింగ్‌తో వస్తోంది.
మోటోరోలా వన్ 5జీ యూడబ్ల్యూ ఏస్4+64 జీబీ వేరియంట్ ధర 299.99 డాలర్లు (దాదాపు రూ.22,400)గా ఉంది. వొలానిక్ గ్రే కలర్లో మాత్రమే ఇది అందుబాటులో ఉంది. వెరిజోన్ ప్లాట్‌ఫాం ద్వారా ప్రస్తుతం అమ్మకానికి ఉంది. అయితే భారత్‌లోకి దీన్ని ఎప్పుడు తీసుకొస్తారనే వివరాలను మోటోరోలా ప్రకటించలేదు.
Published by:Krishna Kumar N
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.