Home /News /technology /

Smart Phones: నవంబర్‌లో మార్కెట్‌లోకి కొత్త ఫోన్లు.. జాబితాలో వన్‌ప్లస్ 9RT, ఐకూ 8 సిరీస్

Smart Phones: నవంబర్‌లో మార్కెట్‌లోకి కొత్త ఫోన్లు.. జాబితాలో వన్‌ప్లస్ 9RT, ఐకూ 8 సిరీస్

జియో ఫోన్ నెక్ట్స్ స్మార్ట్‌ఫోన్
(Image: Soumyadip Choudhury / News18)

జియో ఫోన్ నెక్ట్స్ స్మార్ట్‌ఫోన్ (Image: Soumyadip Choudhury / News18)

Smart Phones: కస్టమర్లను ఆకట్టుకునేందుకు ప్రముఖ ఎలక్ట్రానిక్ తయారీ కంపెనీలు సిద్ధమవుతున్నాయి. ఈ నవంబర్ నెలలో అదిరిపోయే స్మార్ట్‌ఫోన్‌ (Smart Phone)లతో భారత మార్కెట్లో (Market) సందడి చేయడానికి రెడీ అయిపోయాయి. మరి ఆ స్మార్ట్ ఫోన్స్ ఏవో.. వాటి ప్రత్యేకతలేంటో చూద్దాం.

ఇంకా చదవండి ...
ప్రస్తుతం భారతదేశం (India)లో ఫెస్టివల్ సీజన్ (Festival Season) కొనసాగుతోంది. ఈ సమయంలో చాలామంది మొబైల్ ప్రియులు కొత్త ఫోన్ల (New Phones)ను కొనుగోలు చేయాలనుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే కస్టమర్లను ఆకట్టుకునేందుకు ప్రముఖ ఎలక్ట్రానిక్ తయారీ కంపెనీలు సిద్ధమవుతున్నాయి. వినియోగ‌దారుల కోసం ప‌లు కంపెనీలు ఫోన్ ధ‌ర‌లు త‌గ్గిస్తుంటే.. ప‌లు కంపెనీలు కొత్త మోడ‌ళ్ల‌ (New Models)ను మార్కెట్‌లోకి ప్ర‌వేశ పెడుతున్నాయి. ఈ నవంబర్ నెలలో అదిరిపోయే స్మార్ట్‌ఫోన్‌ (Smart Phone) లతో భారత మార్కెట్లో(Market) సందడి చేయడానికి రెడీ అయిపోయాయి. మరి ఆ స్మార్ట్ ఫోన్స్ ఏవో.. వాటి ప్రత్యేకతలేంటో చూద్దాం.

జియోఫోన్ నెక్స్ట్ (JioPhone Next)

దీపావళి కానుకగా నవంబర్ 4న జియోఫోన్ నెక్స్ట్‌ను భారతదేశంలో లాంచ్ చేయనున్నామని రిలయన్స్ సంస్థ ప్రకటించిన విషయం తెలిసిందే. ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల కోసం రూపొందించిన ఈ ఫోన్ రూ. 1,999 (Down Payment) ప్లస్ ఈజీ ఈఎంఐతో కొనుగోలు చేయవచ్చు. మిగతా మొత్తం 18 లేదా 24 నెలల్లో వాయిదా కట్టుకోవచ్చు. తక్కువ బడ్జెట్ ఉన్నవారికి జియోఫోన్ నెక్స్ట్ ఉత్తమ ఎంపికగా నిలుస్తుందని దాని ఫీచర్స్ చూస్తే స్పష్టమవుతోంది. ఇందులో ప్రగతి ఆపరేటింగ్‌ సిస్టమ్‌, ఫ్రెంట్ 8 ఎంపీ కెమెరా, బ్యాక్ 13 ఎంపీ కెమెరా, 5.45 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5, స్నాప్‌డ్రాగన్‌ 215 ప్రాసెసర్‌, 3500 ఎంఏహెచ్‌ బ్యాటరీ వంటి మరెన్నో ఫీచర్లు ఉన్నాయి.

Whatsapp : 93 లక్ష‌ల భార‌తీయ ఖాతాల‌ను తొల‌గించిన వాట్స‌ప్‌.. కార‌ణం ఇదే!


వన్‌ప్లస్ 9RT (OnePlus 9RT)

అక్టోబర్‌లో వన్‌ప్లస్ 9RT చైనాలో అమ్మకానికి వచ్చింది. దీని ప్రారంభ ధరను 3,299 (దాదాపు రూ. 38,400) చైనీస్ యెన్‌లుగా నిర్ణయించారు. ఫోన్ బీఐఎస్ (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్)లో కనిపించిందని.. నవంబర్‌లో వన్‌ప్లస్ ఫోన్ ను భారత్‌లో రిలీజ్ చేసే అవకాశాలున్నాయని లీక్‌లు సూచిస్తున్నాయి. క్వాల్‌కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ (Snapdragon) 888 ప్రాసెసర్‌ (Processer) తో పనిచేసే వన్‌ప్లస్ 9RT లో 4500 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 65 వాట్‌ ఫాస్ట్ ఛార్జింగ్, 7జీబీ వర్చువల్‌ ర్యామ్‌ (Virtual RAM) వంటి ఆకర్షణీయమైన ఫీచర్లు ఉన్నాయి.

ఐకూ 8 (iQoo 8)

ఐకూ 8 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు త్వరలో భారతదేశంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. నవంబర్‌ నెలాఖరులో ఈ సిరీస్‌లో ఐకూ 8, ఐకూ 8 ప్రో విడుదల కానున్నాయని సమాచారం. ఐకూ 8 ప్రో.. ఐకూ 8 లెజెండ్‌గా భారతదేశంలో లాంచ్ కానుందని తెలుస్తోంది. ఐకూ 8, ఐకూ 8 లెజెండ్‌ రెండూ ట్రిపుల్‌ కెమెరా సెటప్‌తో వస్తాయి. ఈ రెండు మొబైల్ ఫోన్లలో చాలా శక్తివంతమైన ప్రాసెసర్‌లు ఇచ్చారు. ఐకూ 8 లెజెండ్‌/ఐకూ 8 ప్రోలో వైర్‌లెస్ ఛార్జింగ్, రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్ (Wireless Charger), ఆరిజన్ఓఎస్1.0 వంటి హై-ఎండ్ ఫీచర్లు ఉంటాయి. ఫీచర్లకు తగ్గట్టుగానే వీటి ధరలు 40-60 మధ్య ఉండొచ్చని తెలుస్తోంది.

రెడ్‌మీ నోట్ 11 ప్రో (Redmi Note 11 Pro)

సరికొత్త రెడ్‌మీ నోట్ 11 సిరీస్ గత వారం చైనాలో లాంచ్ అయ్యింది. ఈ సిరీస్‌లో రెడ్‌మీ నోట్ 11 5జీ, రెడ్‌మీ నోట్ 11 ప్రో, రెడ్‌మీ నోట్ 11 ప్రో మ్యాక్స్ అనే మూడు మోడల్‌లు ఉన్నాయి. రెడ్‌మీ నోట్ 11 ప్రో భారతదేశంలో Xiaomi 11iగా లాంచ్ కావచ్చని.. ప్రో మ్యాక్స్ Xiaomi 11i హైపర్‌ఛార్జ్‌ (Hyper Charger)గా లాంచ్ కావచ్చని లీక్‌స్టర్లు అవుతున్నారు. ఏది నవంబర్ నెలలో విడుదల కావచ్చు కానీ కచ్చితమైన స్పష్టత లేదు.
Published by:Sharath Chandra
First published:

Tags: JioPhone Next, ONE PLUS, Redmi, Smartphone

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు