NEW SAMSUNG GALAXY A SERIES SMARTPHONES CONFIRMED TO LAUNCH ON MARCH 17 HERE DETAILS NS GH
Samsung Galaxy A-Series: మార్చి 17న భారత మార్కెట్లోకి శామ్సంగ్ గెలాక్సీ A సిరీస్ ఫోన్లు.. ధర, ఫీచర్ల వివరాలివే!
ప్రతీకాత్మక చిత్రం
దక్షిణ కొరియా స్మార్ట్ దిగ్గజం శామ్సంగ్ మార్చి 17న కొత్త స్మార్ట్‌ఫోన్ సిరీస్‌ను ప్రారంభించనుంది. భారత మార్కెట్లోకి సరికొత్త గెలాక్సీ A-సిరీస్‌ను లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది.
దక్షిణ కొరియా స్మార్ట్ దిగ్గజం శామ్సంగ్ (Samsung) మార్చి 17న కొత్త స్మార్ట్‌ఫోన్ సిరీస్‌ను ప్రారంభించనుంది. భారత మార్కెట్లోకి సరికొత్త గెలాక్సీ (Samsung Galaxy) A-సిరీస్‌ను లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ లాంచింగ్ ఈవెంట్‌ను వర్చువల్‌గా నిర్వహించనుంది. శామ్సంగ్ యూట్యూబ్ ఛానెల్, శామ్సంగ్ న్యూస్‌రూమ్ ఇండియా వెబ్సైట్లలో లాంచింగ్ ఈవెంట్ లైవ్‌ను చూడవచ్చు. ఈవెంట్ 7:30 PM ISTకి ప్రారంభమవుతుంది. అయితే, శామ్సంగ్ మాత్రం రాబోయే ఫోన్ల ధర, స్పెసిఫికేషన్లను పేర్కొనలేదు. కానీ, ఇటీవల కొన్ని నివేదికలు మాత్రం గెలాక్సీ A53 5G, గెలాక్సీ A73 5G రాకను సూచించాయి. వీటి ధర, ఫీచర్లను టీజ్ చేశాయి. ఆ వివరాలేంటో చూద్దాం.
శామ్సంగ్ గెలాక్సీ A53 స్పెసిఫికేషన్లు
శామ్సంగ్ గెలాక్సీ A53 స్మార్ట్‌ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్‌తో కూడిన 6.52 -అంగుళాల AMOLED డిస్ప్లేను కలిగి ఉంటుంది. ఈ మేరకు శ్యామ్ (shadow_leak) అనే టిప్‌స్టర్ గత నెలలో పేర్కొన్నారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం, శామ్సంగ్ గెలాక్సీ S21 సిరీస్‌లో ఉపయోగించిన ఎక్సినోస్ 1200 SoC ప్రాసెసర్‌నే దీనిలోనూ ఉపయోగించనున్నారు. దీని వెనుకవైపు గల క్వాడ్ కెమెరా సెటప్‌లో 64 -మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 12 -మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా, రెండు 5 మెగాపిక్సెల్ సెన్సార్ కెమెరాలను అందించనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ గల 5,000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. Smartphones Under Rs 10000: ఈ బెస్ట్ స్మార్ట్ ఫోన్ల ధర రూ.10 వేలలోపే.. ఓ లుక్కేయండి
శామ్సంగ్ గెలాక్సీ A73 5G స్పెసిఫికేషన్లు మరోవైపు, శామ్సంగ్ గెలాక్సీ A73 5G 6.7- అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ 120Hz AMOLED డిస్ప్లేను కలిగి ఉంటుంది. ఇది క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 750G SoC ప్రాసెసర్‌పై పనిచేస్తుంది. 25W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5000mAhని కలిగి ఉంటుంది. దీని వెనుక భాగంలో 108 -మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 12-మెగాపిక్సెల్ సెకండరీ షూటర్, 8-మెగాపిక్సెల్ టెర్షరీ షూటర్, 2- మెగాపిక్సెల్ సెన్సార్ కెమెరాలు ఉండనున్నాయి. ఈ రెండు ఫోన్లు ఆండ్రాయిడ్ 12- ఆధారిత One UI 3 ద్వారా పనిచేస్తుంది. శామ్సంగ్ సంస్థ తన గెలాక్సీ "A సిరీస్‌ను విస్తరించే పనిలో పడింది. అద్భుతమైన కొత్త గెలాక్సీ A సిరీస్ ప్రజలు కోరుకునే ఫుల్లీ -లోడెడ్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుంది. Samsung Galaxy Tab A8: అదిరిపోయే లుక్.. ఆకట్టుకొనే ఫీచర్స్ మార్కెట్లోకి శామ్సంగ్ కొత్త టాబ్
శామ్సంగ్ గెలాక్సీ A సిరీస్ ధరలు భారత మార్కెట్లో శామ్సంగ్ గెలాక్సీ A52 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ రూ. 26,499 ప్రారంభ ధర వద్ద లభిస్తుంది. శామ్సంగ్ గెలాక్సీ A72 8GB ర్యామ్ వేరియంట్ రూ. 34,999 ధర వద్ద లభిస్తుంది. అయితే, ఈ రెండు ఫోన్లు ప్రస్తుతం భారత మార్కెట్లో అందుబాటులో లేవు. త్వరలోనే వీటి బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.