ప్రముఖ మొబైల్ తయారీ దిగ్గజం షియోమీ (Xiaomi)కి సబ్‌బ్రాండ్ అయిన రెడ్‌మీ (Redmi) ఎప్పటికప్పుడు ఆకర్షణీయమైన ఫీచర్లతో సరికొత్త ఫోన్లను లాంచ్ చేస్తోంది. ఈ కంపెనీ వచ్చే ఏడాది Redmi Note 12 సిరీస్‌ను చైనాలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. అయితే ఈ సిరీస్‌లో స్టాండర్డ్ మోడల్ అయిన రెడ్‌మీ నోట్ 12 (Redmi Note 12) గురించి తాజాగా ఒక కొత్త లీక్ బయటకొచ్చింది. ఈ అప్‌కమింగ్ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 1080 ప్రాసెసర్ (MediaTek Dimensity 1080)తో రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్లు వివరాలు బయటకు వచ్చాయి. ఈ చిప్‌ను తైవాన్ చిప్‌మేకర్ మీడియాటెక్ సంస్థ ఇటీవలే లాంచ్ చేసింది. ఈ కొత్త ప్రాసెసర్ స్నాప్‌డ్రాగన్‌తో పోలిస్తే ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటుంది? Redmi Note 12 ఫోన్ ధర ఎంత ఉండొచ్చు? లాంటి వివరాలు ఇప్పుడు చూద్దాం.
* మీడియాటెక్ డైమెన్సిటీ 1080 ప్రాసెసర్
డైమెన్సిటీ 1080 అనేది Mali-G68 GPU, 6nm ఫ్యాబ్రికేషన్ ప్రాసెస్‌పై ఆధారపడి ఉంటుంది. ఈ చిప్‌సెట్ 200MP కెమెరా, HyperEngine 3.0కి సపోర్ట్ ఇస్తుంది. ఇది 4K వీడియో రికార్డింగ్‌ను కూడా సపోర్ట్ చేస్తుంది. 4Kకి సపోర్ట్ ఉంది కాబట్టి, నోట్ 12 కూడా 4K వీడియో షూటింగ్ సపోర్ట్‌తో రావచ్చు. రెడ్‌మీ నోట్ 12లో అందించారని చెబుతున్న ఈ మీడియాటెక్ డైమెన్సిటీ 1080 ప్రాసెసర్ 778Gకి సమానమైన పర్ఫామెన్స్ ఆఫర్ చేస్తుందని టెక్ నిపుణులు అంటున్నారు.
స్నాప్‌డ్రాగన్ 778G చిప్‌సెట్‌ను మిడ్-రేంజ్ ఫోన్లలో అందిస్తారు. ఈ ప్రాసెసర్ రూ.25,000 ధర ఉండే ఫోన్లలో కనిపిస్తుంది. అంటే స్నాప్‌డ్రాగన్ 778G లాంటి పర్ఫామెన్స్‌తో రెడ్‌మీ నోట్ 12 కూడా ఇంచుమించు ఇదే ప్రైస్ రేంజ్‌లో లాంచ్ అవ్వచ్చు. వెనిలా రెడ్‌మీ నోట్ 12 డైమెన్సిటీ 1080తో వస్తే దాని ధర రూ.20-రూ.25 వేలలోపు ఉండవచ్చని కొందరు అంచనా వేస్తున్నారు.
* కెమెరా కెపాసిటీ
రెడ్‌మీ నోట్ 12 చిప్ అప్‌గ్రేడ్‌తో AnTuTuలో 520,000 కంటే ఎక్కువ స్కోర్‌ను సాధించిందని సమాచారం. ఈ ఫోన్ అప్‌గ్రేడెడ్ 50MP మెయిన్ లెన్స్‌తో వస్తుందని టాక్. ఈ మెయిన్ లెన్స్‌తో పాటు 8MP అల్ట్రా-వైడ్ కెమెరా, 2MP మాక్రో లెన్స్ అందించారని లీక్స్ పేర్కొన్నాయి. వెనిలా నోట్ 12 ఫోన్ 4,980mAh బ్యాటరీతో వస్తుందని తెలిసింది. ఈ నోట్ 67W ఫాస్ట్ ఛార్జింగ్‌కి సపోర్ట్ చేయనుంది.
Jio True 5G: ఏపీలో ఈ నగరాల్లో త్వరలో జియో 5జీ సేవలు... 1జీబీపీఎస్ వేగంతో 5జీ డేటా
Dangerous Messages: వాట్సప్‌లో ఈ మెసేజ్ వచ్చిందా? మీ అకౌంట్ ఖాళీ అవుతుంది జాగ్రత్త
* 12 సిరీస్‌లో మరిన్ని ఫోన్లు
12 సిరీస్‌లో వెనిలా నోట్ 12 కాకుండా రెడ్‌మీ నోట్ 12 ప్రో, రెడ్‌మీ నోట్ 12 ప్రో+ అనే మరో రెండు ఫోన్స్ రిలీజ్ కావచ్చు. ఈ రెండూ 6.6-అంగుళాల AMOLED డిస్‌ప్లేతో 120Hz రిఫ్రెష్ రేట్.. FHD+ మద్దతుతో రావచ్చు. Note 12 Pro+ 210W ఫాస్ట్ ఛార్జింగ్‌కి సపోర్ట్ చేయొచ్చని.. 4,300mAh బ్యాటరీతో రావచ్చని సమాచారం. నోట్ 12 ప్రో 120W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే అవకాశం ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Redmi