Home /News /technology /

NEW PROBLEM WITH APPLE IOS 15 4 LATEST UPDATE USERS ANGRY THAT BATTERY IS DRAINING FAST GH VB

Apple iPhone: యాపిల్ కంపెనీపై ఆగ్రహంతో ఐఫోన్ యూజర్లు.. కారణం ఏంటో తెలుసా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

యాపిల్ తాజాగా రిలీజ్​ చేసిన ఐఓఎస్​ 15.4 అప్​డేట్​పై కొంత మంది ఐఫోన్​ 13 యూజర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తమ ఫోన్​లో ఈ కొత్త ఐఓఎస్​ను అప్​డేట్ చేస్తే అనేక సమస్యలు తలెత్తుతున్నాయని, వెంటనే పరిష్కరించాలని యూపిల్​ సంస్థకు వరుసగా ఫిర్యాదులు చేస్తున్నారు.

ఇంకా చదవండి ...
ప్రముఖ టెక్​ దిగ్గజం యాపిల్(Apple) నుంచి విడుదలయ్యే ఐఫోన్లకు(iPhones) మార్కెట్​లో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీటి ధర ఎక్కువగా ఉన్నా సరే.. ఎగబడి మరీ కొనుగోలు చేస్తుంటారు. ఐఫోన్లలో ఉండే లేటెస్ట్ ఫీచర్లు(Latest Features), యూజర్​ ఫ్రెండ్లీ ఇంటర్​ఫేజ్(User Friendly Interphase)​ ఇంతటి పాపులారిటీకి(Popularity) ప్రధాన కారణంగా చెప్పవచ్చు. అందుకే, యూజర్ల అవసరాలను దృష్టిలో పెట్టుకొని కొత్త అప్​డేట్లను రిలీజ్​ చేస్తుంటుంది యాపిల్​ సంస్థ. ఈ అప్​డేట్లకు మంచి ఆదరణ కూడా లభిస్తుంది. అయితే, యాపిల్ తాజాగా రిలీజ్​ చేసిన ఐఓఎస్​ 15.4 అప్​డేట్​పై కొంత మంది ఐఫోన్​ 13 యూజర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తమ ఫోన్​లో ఈ కొత్త ఐఓఎస్​ను అప్​డేట్ చేస్తే అనేక సమస్యలు తలెత్తుతున్నాయని, వెంటనే పరిష్కరించాలని యూపిల్​ సంస్థకు వరుసగా ఫిర్యాదులు చేస్తున్నారు.

లేటెస్ట్ ఐఓఎస్​ వెర్షన్​లో ఫీచర్లు బాగానే ఉన్నా.. పనితీరు మాత్రం బాగాలేదంటూ వరుస ట్వీట్లతో యూజర్లు హోరెత్తిస్తున్నారు. ముఖ్యంగా, ఐఓఎస్​ 15.4 OS అప్​డేట్ తర్వాత బ్యాటరీ సమస్యలు తలెత్తుతున్నాయని వాపోతున్నారు. మార్చి 14న ఐఫోన్​లలో యాపిల్ అట్టహాసంగా ప్రారంభమైన ఐఓఎస్​ 15.4 అప్​డేట్​ దెబ్బకు ఫోన్ బ్యాటరీ డెడ్ అయ్యిందంటూ ట్వీట్​లలో ప్రస్తావిస్తున్నారు. మగ్జిమ్​ షిషాకో అనే ట్విట్టర్​ యూజర్​ ట్వీట్​ చేస్తూ ‘‘ఐఓఎస్​ 15.4 అప్​డేట్ తర్వాత నా ఫోన్ డెడ్​ అయ్యింది. ఇప్పుడే ఐఫోన్ 13 ప్రో మాక్స్​లో ఐఓఎస్​ అప్​డేట్ చేశాను. ఇంతకు ముందు ఛార్జింగ్ పెడితే ఒకటి లేదా రెండు రోజుల పాటు బ్యాటరీ బ్యాకప్​ వచ్చేది. కానీ, ఇప్పుడు ఒక్కరోజు కాదు కదా.. కనీసం సగం రోజులోనే ఫోన్​ ఛార్జింగ్ అయిపోతుంది.”అని వాపోయాడు.

Traffic Challans: ట్రాఫిక్ చలాన్లను తప్పించుకోవాలనుకుంటున్నారా..? అయితే ఇలా చేయండి..!


ఫేస్​ మాస్క్​ తీయకుండానే ఐఫోన్ అన్​లాక్​..

మరో ట్విట్టర్​ యూజర్​ యాపిల్ సంస్థను ట్యాగ్ చేస్తూ.. ‘‘నా ఐఫోన్​కు ఛార్జింగ్ పెట్టగానే 95 పర్సంటేజ్​, 97 పర్సంటేజ్​ బ్యాటరీ నిండినట్లు చూపించింది. ఛార్జింగ్​ తీసేస్తే 100 పర్సెంట్ చూపిస్తుంది. ఐదు నిమిషాల తర్వాత ఆటోమేటిక్​గా ఫోన్​ రీస్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ఛార్జింగ్ ఎంత పర్సంటేజ్​ ఉందో కూడా చూపించడం లేదు.” అని యాపిల్​ సంస్థపై మండిపడ్డాడు. అయితే, యాపిల్​ iOS 15.4 లో ఓ కొత్త అప్​డేట్​ను పరిచయం చేసింది. 'ఫేస్ మాస్క్‌తో ఐఫోన్‌ అన్‌లాక్' ఫీచర్‌ను పరిచయం చేసింది.

వినియోగదారులు ఇప్పుడు మాస్క్ ధరించి ఫేస్ ఐడీతో ఐఫోన్​ని అన్‌లాక్ చేయవచ్చు. ఇంతకుముందు, స్మార్ట్‌ఫోన్‌ను అన్‌లాక్ చేయడానికి వినియోగదారులు ఫేస్ మాస్క్‌ను తీసివేయవలసి ఉండేది. అయితే, ఈ ఫీచర్ ఐఫోన్ 12, ఐఫోన్ 13 సిరీస్ ఫోన్లలో మాత్రమే పనిచేస్తుంది. పాత ఐఫోన్లలో ఈ ఫీచర్​ను పొందలేరు. ఇది ఫేస్​ ఐడీకి మద్దతు ఇచ్చే ఐఫోన్​ ఎక్స్​, ఐఫోన్​ 11 స్మార్ట్‌ఫోన్లలో పనిచేయదు.
Published by:Veera Babu
First published:

Tags: Apple, Apple store, Iphone

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు