NEW PAN CARD APPLICATION AND CORRECTIONS IN PAN CARD CAN BE DONE ON UMANG APP KNOW HOW SS
Pan card: ఉమాంగ్ యాప్‌లో పాన్ కార్డు సేవలు... ఇలా అప్లై చేయొచ్చు
Pan card: ఉమాంగ్ యాప్‌లో పాన్ కార్డు సేవలు... ఇలా అప్లై చేయొచ్చు
Umang App | ఉమాంగ్ యాప్‌లో 300 ప్రభుత్వ సేవలు పొందొచ్చు. అందులో పాన్ కార్డు ఒకటి. పాన్ కార్డు దరఖాస్తుకు, కరెక్షన్స్‌కు వేర్వేరు వెబ్సైట్లు ఓపెన్ చేయాల్సిన అవసరం లేకుండా ఈ యాప్‌లోనే సేవలు పొందొచ్చు.
మీ దగ్గర పాన్ కార్డు లేదా? పాన్ కార్డ్ తీసుకోవడానికి ఏజెంట్ల దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేదు. మీరే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అంతేకాదు... మీ దగ్గర ఓ మొబైల్ యాప్ ఉన్నా చాలు. పాన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఉమాంగ్ యాప్ ద్వారా మీరు పాన్ కార్డుకు అప్లై చేయొచ్చు. అంతేకాదు... పాన్ కార్డు కరెక్షన్స్ కూడా ఈ యాప్‌లో చేయడం సులువే. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ప్రతీ ఒక్కరికి పాన్ కార్డు తప్పనిసరైపోయింది. పాన్ కార్డ్ లేకపోతే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడం కూడా సాధ్యం కాదు. కాబట్టి మీరు కొత్తగా పాన్ కార్డు తీసుకోవాలనుకున్నా, ఇప్పటికే ఉన్న పాన్ కార్డులో కరెక్షన్స్ చేయాలన్నా ఉమాంగ్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే చాలు.
కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, నేషనల్ ఇ-గవర్నెన్స్ సంయుక్తంగా ఉమాంగ్ యాప్‌ను రూపొందించాయి. ఉమాంగ్ యాప్‌లో 300 ప్రభుత్వ సేవలు పొందొచ్చు. అందులో పాన్ కార్డు ఒకటి. పాన్ కార్డు దరఖాస్తుకు, కరెక్షన్స్‌కు వేర్వేరు వెబ్సైట్లు ఓపెన్ చేయాల్సిన అవసరం లేకుండా ఈ యాప్‌లోనే సేవలు పొందొచ్చు. గూగుల్ ప్లేస్టోర్, ఆపిల్ యాప్‌స్టోర్ నుంచి ఉమాంగ్ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మరాఠీ, తమిళ్ సహా 13 భాషల్లో సేవల్ని అందిస్తోంది. ఉమాంగ్ యాప్‌లో పాన్ కార్డు సేవలు ఇలా పొందొచ్చో తెలుసుకోండి.
ముందుగా మీ స్మార్ట్పోన్లో ఉమాంగ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
వ్యక్తిగతంగానే కాదు కంపెనీలు కూడా ఈ యాప్‌లో పాన్ కార్డు కోసం దరఖాస్తు చేయొచ్చు.
కొత్త పాన్ కార్డు కోసం 49ఏ ఫామ్ ద్వారా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.
కొత్త పాన్ కార్డు దరఖాస్తుతో పాటు పాన్ కార్డులో తప్పుల్ని కూడా సరిచేసుకోవచ్చు.
పేరు, అడ్రస్, పుట్టినతేదీ, తండ్రి పేరు లాంటి తప్పుల్ని సరిదిద్దుకోవచ్చు.
ఇందుకోసం 'ఛేంజ్ రిక్వెస్ట్ ఫామ్-CSF' పూర్తి చేయాల్సి ఉంటుంది.
కొత్త పాన్ కార్డు కోసం లేదా తప్పులు సరిచేసుకోవడానికి చేసుకున్న దరఖాస్తును ట్రాక్ చేయొచ్చు.
రిఫరెన్స్ నెంబర్ ద్వారా పాన్ కార్డ్ అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవచ్చు.
అప్లికేషన్ నెంబర్ ఆధారంగానే పేమెంట్ చేయాల్సి ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.