Home /News /technology /

Google: గూగుల్ నుంచి కొత్త ఫీచర్‌.. వాటిని ఎవరూ చూడకుండా సరికొత్త ఆప్షన్.. వివరాలిలా..

Google: గూగుల్ నుంచి కొత్త ఫీచర్‌.. వాటిని ఎవరూ చూడకుండా సరికొత్త ఆప్షన్.. వివరాలిలా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Google: సెర్చ్ ఇంజ‌న్ దిగ్గ‌జం గూగుల్ స‌రికొత్త ఫీచ‌ర్‌ను తీసుకొచ్చింది. యూజ‌ర్ల డేటాను మ‌రింత భ్ర‌దంగా ఉంచేందుకు చివ‌రి 15 నిమిషాల బ్రౌజింగ్ హిస్ట‌రీని ఆటోమెటిగ్గా డిలీట్ చేసుకునే వెసులుబాటును అందిస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇంకా చదవండి ...
సెర్చ్ ఇంజ‌న్ దిగ్గ‌జం గూగుల్ స‌రికొత్త ఫీచ‌ర్‌ను తీసుకొచ్చింది. యూజ‌ర్ల డేటాను మ‌రింత భ్ర‌దంగా ఉంచేందుకు చివ‌రి 15 నిమిషాల బ్రౌజింగ్ హిస్ట‌రీని ఆటోమెటిగ్గా డిలీట్ చేసుకునే వెసులుబాటును అందిస్తోంది. ప్రస్తుతానికి ఈ ఆప్షన్‌ ఐఓఎస్ యూజ‌ర్ల‌కు మాత్ర‌మే అందుబాటులో ఉన్నా ఈ ఏడాది ఆఖ‌రుక‌ల్లా ఆండ్రాయిడ్ యూజ‌ర్ల‌కూ అందుబాటులోకి రానున్న‌ట్టు గూగూల్‌ ప్ర‌క‌టించింది. అయితే డెస్క్ టాప్ యూజ‌ర్ల‌కు ఇదెప్పుడు అందుబాటులోకి వ‌స్తుంద‌నే విష‌యం మాత్రం తెలియ‌జేయ‌లేదు. ప్ర‌స్తుతం యూజ‌ర్లు త‌మ బ్రౌజింగ్ హిస్ట‌రీతోపాటు వెబ్ యాక్టివిటీకి సంబంధించిన స‌మాచారాన్ని తొల‌గించ‌డానికి కొన్ని ఆప్షన్లు ఉన్నాయి. గూగూల్ త‌న ఆటో డిలీట్ కంట్రోల్స్‌లో మూడునెల‌లు, 18 లేదా 36 నెల‌ల స‌మాచారాన్ని తొల‌గించుకోవ‌డానికి అవ‌కాశం ఉంది. మీరు వీటిల్లో ఏది ఎంచుకుంటే ఆ మేర‌కు ఆ కాల‌వ్య‌వ‌ధిలోని స‌మాచారాన్ని గూగూల్ నిరంత‌రాయంగా డిలీట్ చేస్తుంటుంది. కొత్త‌గా అకౌంట్ క్రియేట్ చేసుకునేవారికి.. డిలీట్ హిస్ట‌రీ ఆటోమెటిగ్గా 18నెల‌లకు ఎనేబుల్‌గా ఉంటుంది.

దీనిని యూజర్లు సెట్టింగ్స్ ద్వారా మార్చుకోవచ్చు. త్వరలో ఈ సెట్టింగ్స్‌లో కొత్తగా 15 నిమిషాల ఆప్షన్‌ కూడా రానుంది. స‌హ‌జంగా మ‌న ఈమెయిల్ ఐడీ, పాస్‌వ‌ర్డ్ ఎవ‌రికైనా తెలిస్తే ఎవ‌రైనా మై యాక్టివిటీ ద్వారా మ‌న బ్రౌజింగ్ హిస్ట‌రీని చూసే అవ‌కాశం ఉంటుంది. ఈ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించ‌డానికి వీలుగా ఓటిపీ త‌ర‌హాలో ఇక‌పై మై యాక్ట‌విటీ వీక్ష‌ణ‌కు అద‌న‌పు స‌మాచారాన్ని జోడించాల్సి ఉంటుంది. అంటే పాస్‌వ‌ర్డ్‌తోపాటు టూ ఫ్యాక్ట‌ర్ అథెంటికేష‌న్ కూడా జోడించాల్సి ఉంటుంది. ఇక ఒకే పాస్‌వ‌ర్డ్‌ను అన్ని చోట్లా వాడుతుంటే... ఆ విష‌యాన్ని గూగూల్ త‌న యూజ‌ర్ల‌కు గుర్తు చేయ‌నుంది. మ‌న డేటాను భ్ర‌దంగా ఉంచ‌డానికి, మ‌న డేటా గోప్య‌త‌కు భంగం క‌ల‌గ‌కుండా ఈ చ‌ర్య‌లు తీసుకున్న‌ట్టు గూగూల్ వెల్ల‌డించింది.

ఇప్ప‌టికే డేంజ‌ర‌స్ సైట్ల జోలికి వెళ్ళేవారిని, ప్ర‌మాద‌క‌ర‌మైన ఫైల్స్‌ను డౌన్‌లోడ్ చేసుకునేవారికి గూగూల్ వార్నింగ్ అల‌ర్ట్‌లు పంపిస్తుంటుంది. ఇలా సుమారు ప్ర‌తిరోజూ కోట్ల మంది యూజ‌ర్ల‌ను గూగూల్ అప్ర‌మ‌త్తం చేస్తుంటుంది. ఫ‌లితంగా ఆయా యూజ‌ర్లు హ్యాక‌ర్ల బారిన ప‌డ‌కుండా ర‌క్షిస్తుంటుంది. ప్ర‌స్తుతం మై యాక్టివిటీలో చేర్చ‌ని సెకండ్ వెరిఫికేష‌న్ కూడా యూజ‌ర్ల డేటాను భ్ర‌దంగా ఉంచ‌డానికి, ఇత‌రులు దాన్ని చూసే వీలు లేకుండా చేయ‌డానికే అందుబాటులోకి తీసుకువ‌చ్చింది.
Published by:Veera Babu
First published:

Tags: Android, Google, Google search, Website

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు