ప్రీమియం స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వన్‌ప్లస్ నార్డ్ సిరీస్‌లో మరో కొత్త మొబైల్ ఫోన్లు లాంఛ్ చేయనుంది. ఇటీవల నార్డ్ లైనప్‌ను ప్రారంభించిన వన్‌ప్లస్ అదే సిరీస్‌లో మరో స్మార్ట్‌ఫోన్ లాంఛ్ చేయనున్నట్లు తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ప్రకటించింది. అక్టోబర్ 14న వన్‌ప్లస్ 8టీ 5జీ లాంఛింగ్ ఉంది. అదే ఈవెంట్లో వన్‌ప్లస్ నార్డ్ కొత్త మోడల్ రిలీజ్ అయ్యే అవకాశముంది. ఈ మేరకు వన్‌ప్లస్ నార్డ్ అధికారిక ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో టీజర్ రిలీజ్ చేసింది. కమింగ్ సూన్ అనే పోస్ట్‌తో నలుపు రంగులో ఉన్న వన్‌ప్లస్ లోగోతో ఉన్న టీజర్‌ను విడుదల చేసింది. త్వరలోనే అమెరికాలో ప్రారంభించబోయే కొత్త వన్‌ప్లస్ నార్డ్ ఎన్ 10 5జీ స్మార్ట్‌ఫోన్‌ను సూచించే విధంగా ఈ టీజర్‌ను రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ టీజర్ ద్వారా వన్‌ప్లస్ నార్డ్ ఎన్10 5జీ లాంచింగ్‌కు సంబంధించిన ఎటువంటి ఫోటోలను షేర్చేయనప్పటికీ మొబైల్ ఫోన్ స్కెచ్‌తో పాటు వన్‌ప్లస్ లోగోను అందులో ఉంచింది. మరికొద్ది రోజుల్లో ఈ మొబైల్‌కు సంబంధించిన మరింత సమాచారాన్ని వినియోగదారులతో పంచుకోనుంది వన్‌ప్లస్.
Samsung: ఈ రెండు స్మార్ట్ఫోన్ల ధరల్ని తగ్గించిన సాంసంగ్
Poco X3: ఈరోజే పోకో ఎక్స్3 ఫస్ట్ సేల్... డిస్కౌంట్‌తో కొనండి ఇలా
— OnePlus (@oneplus) September 28, 2020
వన్‌ప్లస్ నార్డ్ ఎన్ 10 మొబైల్ 5జీ ఫీచర్‌తో రానుంది. దీనిలో 6.49- అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే ఉండనుంది. అంతేకాక ఇది 90Hz రిఫ్రెష్ రేటును అందిస్తుంది. వన్‌ప్లస్ నార్డ్ ఎన్ 10 5 జి స్మార్ట్‌ఫోన్ 6 జిబి ర్యామ్‌తో పాటు స్నాప్‌డ్రాగన్ 690 ఎన్ఓసీతో వస్తుందని అంచనా వేస్తున్నారు. ఒక స్టోరేజ్ విషయానికొస్తే 128జిబి ఇంటర్నల్ స్టోరేజీ ఉండే అవకాశం ఉంది. కెమెరా విషయానికొస్తే క్వార్డ్ కమెరా సెటప్, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 64 మెగా పిక్సెల్ మెయిన్ సెన్సార్, 8 ఎంపి అల్ట్రావైడ్ కెమెరా మరియు రెండు 2 ఎంపి షూటర్ కెమెరాలు ఉండవచ్చు. వన్‌ప్లస్ ఎన్ 10 5 జి ధర రూ.30,000 కంటే తక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. అంతేకాక ఇది అమెరికాలో విడుదల కానున్న అత్యంత సరసమైన 5 జి పరికరాల్లో ఒకటిగా మారే అవకాశముందని తెలుస్తోంది. కాగా ఇటీవల వన్‌ప్లస్ సంస్థ వరుసగా స్మార్ట్ఫోన్ల రిలీజ్‌కు సన్నాహాలు చేస్తుంది. ఇందులో భాగంగానే వన్‌ప్లస్ 8 టి అక్టోబర్ లాంచ్ చేయాలని కంపెనీ నిర్ణయించింది. దీని తర్వాత వన్‌ప్లస్ ఎన్ 10 5జి కూడా లాంచ్ అయ్యే అవకాశం ఉంది. వన్‌ప్లస్ నార్డ్ ఎన్10 5జీ స్మార్ట్‌ఫోన్ ఐఫోన్ SE మరియు గూగుల్ పిక్సెల్ 4a 5G ఫోన్లకు గట్టి పోటీనిస్తుందని అంచనా వేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Android 10, Oneplus, Smartphone