Home /News /technology /

NEW NOKIA WIRELESS EARPHONES WITH NEW FEATURES AND SPECIFICATIONS AK GH

Nokia Earphones: సరికొత్త టెక్నాలజీతో నోకియా వైర్‌లెస్ ఇయర్ ఫోన్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Nokia Wireless Earphones: నోకియా వైర్లెస్ ఇయర్ఫోన్స్లోని రెండు ఇయర్‌బడ్స్‌లో ఒక్కొక్కటి 45 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో ఉంటుంది. దీని ఛార్జింగ్ కేసులో 400 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు.

Nokia Wireless Earphones: ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ నోకియా ఈ మధ్య కాలంలో స్మార్ట్ ఫోన్లతో పాటు ఎలక్ట్రానిక్ పరికరాలను విడుదల చేస్తూ తన మార్కెట్‌ను విస్తరిస్తోంది. ఇటీవలి కాలంలో నోకియా స్మార్ట్ టీవీలు, ఏసీలు, ల్యాప్టాప్లను విడుదల చేయగా.. తాజాగా ప్రొఫెషనల్ ట్రూ వైర్లెస్ ఇయర్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. నోకియా పి3600 పేరుతో విడుదలైన నోకియా ట్రూ వైర్‌లెస్ స్టీరియో (టిడబ్ల్యుఎస్) ఇయర్‌ఫోన్‌లను ఎలాంటి ప్రచార ఆర్భాటాలు లేకుండానే నోకియా తన వెబ్‌సైట్‌లో ప్రదర్శించింది. ఈ ఇయర్ ఫోన్‌ను ఒకే కలర్ వేరియంట్లో విడుదల చేసింది. ఇది ఎస్‌బిసి, ఆప్టిఎక్స్ అడాప్టివ్ ఆడియో కోడెక్‌లకు సపోర్ట్ ఇస్తుంది. దీన్ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 6 గంటల వరకు పనిచేస్తుంది. ఛార్జింగ్ కేసుతో దీన్ని 24 గంటల వరకు పొడిగించవచ్చు. టిడబ్ల్యుఎస్ ఇయర్‌ఫోన్‌లు ఐపిఎక్స్ 4 వాటర్ రెసిస్టెన్స్‌కు సపోర్ట్ ఇస్తాయి. అయితే, దీని ధరను మాత్రం ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. త్వరలోనే దీని ధరను ప్రకటిస్తామని నోకియా తన అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొంది.

స్పెసిఫికేషన్స్, ఫీచర్లు
నోకియా ప్రొఫెషనల్ ట్రూ వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్ పి 3600 ఇయర్‌ఫోన్‌లు 8 ఎంఎం డైనమిక్ డ్రైవర్లతో బ్యాలెన్స్డ్ ఆర్మేచర్‌తో డ్యూయల్ డ్రైవర్ డిజైన్‌ను కలిగి ఉంటాయి. ఇవి 20Hz నుండి 20,000Hz వరకు ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ పరిధిని కలిగి ఉంటాయి. అంతేకాక, ఇది బ్లూటూత్ 5.2తో పాటు HSP, HFP, AVRCP, A2DP ప్రొఫైల్‌లకు సపోర్ట్ ఇస్తుంది. అలాగే, దీని ఆడియో ఫార్మాట్లలో SBC, AptX అడాప్టివ్ వంటివి ఉన్నాయి.

క్లియర్ వాయిస్ క్యాప్చర్ టెక్నాలజీతో..
నోకియా వైర్లెస్ ఇయర్ఫోన్స్లోని రెండు ఇయర్‌బడ్స్‌లో ఒక్కొక్కటి 45 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో ఉంటుంది. దీని ఛార్జింగ్ కేసులో 400 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. పి 3600 ఇయర్‌ఫోన్‌లు ఒకే ఛార్జీపై ఆరు గంటలు, ఛార్జింగ్ కేసు సహాయంతో 24 గంటల వరకు పనిచేస్తాయని నోకియా తెలిపింది. అంతేకాక, కేవలం రెండు గంటల్లోనే వీటిని ఛార్జ్ చేయవచ్చని నోకియా పేర్కొంది. దీనిలో ఐపిఎక్స్ 4 వాటర్ రెసిస్టెన్స్‌ను ఫీచర్ కూడా అందుబాటులో ఉంది. దీనిలోని ప్రతి ఇయర్‌బడ్ 4.6 గ్రాముల బరువు ఉంటుంది. దీని ఛార్జింగ్ కేసు 63 గ్రాముల బరువు ఉంటుందని నోకియా స్పష్టం చేసింది. మెరుగైన వాయిస్ కాల్‌ల కోసం దీనిలో క్లియర్ వాయిస్ క్యాప్చర్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు.
Published by:Kishore Akkaladevi
First published:

Tags: Nokia

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు