Home /News /technology /

NEW NOISE BUDS PRIMA 2 PRICED AT JUST 1299 ON LAUNCH HERE IS THE DETAILS AK GH

Noise Buds Prima 2: నాయిస్ కంపెనీ నుంచి కొత్త ఇయర్ బడ్స్ లాంచ్.. ధర కేవలం రూ.1299.. ఫీచర్లు ఇవే..

నాయిస్ హీరో ఈయర్ బడ్స్

నాయిస్ హీరో ఈయర్ బడ్స్

ఆడియో ప్రొడక్ట్స్‌తో ఇండియన్ మార్కెట్లో పాపులర్ అయిన నాయిస్ కంపెనీ, TWS ఇయర్‌బడ్స్ రేంజ్‌ను విస్తరిస్తోంది. ఈ క్రమంలో కొత్తగా నాయిస్ బడ్స్ ప్రైమా 2 (Noise Buds Prima 2) పేరుతో మరో ప్రొడక్ట్‌ను లాంచ్ చేసింది. వీటి ధర కేవలం రూ.1299. మార్కెట్లో అత్యంత సరసమైన ట్రూ వైర్‌లెస్ ఇయర్‌బడ

ఇంకా చదవండి ...
ఆడియో డివైజ్‌లలో ఇయర్ బడ్స్‌కు డిమాండ్ ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది. దీంతో అన్ని టాప్ కంపెనీలతో పాటు కొన్ని చిన్న బ్రాండ్స్ కూడా వీటి ప్రొడక్షన్‌పై దృష్టి పెట్టి సక్సెస్ అయ్యాయి. ఈ లిస్ట్‌లో నాయిస్ కంపెనీ దూసుకుపోతోంది. వివిధ రకాల ఆడియో ప్రొడక్ట్స్‌తో ఇండియన్ మార్కెట్లో పాపులర్ అయిన నాయిస్.. TWS ఇయర్‌బడ్స్ రేంజ్‌ను విస్తరిస్తోంది. ఈ క్రమంలో కొత్తగా నాయిస్ బడ్స్ ప్రైమా 2 (Noise Buds Prima 2) పేరుతో మరో ప్రొడక్ట్‌ను లాంచ్ చేసింది. వీటి ధర కేవలం రూ.1299. మార్కెట్లో అత్యంత సరసమైన ట్రూ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌లో ఇవి ఒకటి.

ప్రొడక్ట్ లాంచింగ్ సందర్భంగా నాయిస్ సహ వ్యవస్థాపకుడు అమిత్ ఖత్రీ మాట్లాడారు. ‘యువత, ప్రొఫెషనల్స్, కాలేజీ స్టూడెంట్స్ కోసం ఈ ఇయర్‌బడ్స్‌ను రూపొందించాం. ఇవి యూజర్లకు కొత్త ఆడియో ఎక్స్‌పీరియన్స్‌ అందిస్తాయి. మల్టీ టాస్క్ చేయడానికి వీలుగా స్టైలిష్‌గా వీటిని రూపొందించాం. మా పోర్ట్‌ఫోలియోను బలోపేతం చేయడంతో పాటు వినియోగదారుల అవసరాలను తీర్చడానికి ఇలాంటి కొత్త డివైజ్‌లను పరిచయం చేస్తూనే ఉంటాం.’ అని తెలిపారు.



* నాయిస్ ప్రైమా 2 ఫీచర్లు
నాయిస్ బడ్స్ ప్రైమా 2 అద్భుతమైన ఆడియో క్వాలిటీని అందిస్తాయి. థంపింగ్ బాస్ కోసం వీటిలో 10mm ఎలక్ట్రో-డైనమిక్ డ్రైవర్స్ అందించారు. మెరుగైన సౌండ్, వాయిస్‌ను అందించే నాయిస్ హైపర్ సింక్ టెక్నాలజీతో ఇవి పనిచేస్తాయి. బడ్స్ ప్రైమా 2 అన్ని రకాల మొబైల్ డివైజ్‌లకు కంపాటబుల్‌గా ఉంటుంది. బెస్ట్ కనెక్టివిటీ కోసం వీటిలో బ్లూటూత్ 5.3ని పొందుపర్చారు. బడ్స్ ప్రైమా 2లో నాయిస్ ప్రొప్రైటరీ ఎన్విరాన్‌మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ (ENC) టెక్నాలజీతో కూడిన క్వాడ్ మైక్‌ సెటప్ ఉంది. ఇవి మెరుగైన లిజనింగ్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తాయి. అలాగే దీంట్లోని హైపర్‌సింక్ టెక్నాలజీ.. అన్ని డివైజ్ సింకింగ్ ప్రాబ్లమ్స్‌కు చెక్ పెడుతుంది.

నాయిస్ బడ్స్ ప్రైమా 2 డివైజ్ 50 గంటల మొత్తం ప్లేబ్యాక్ టైమ్‌ను అందిస్తాయి. కేవలం 10 నిమిషాల ఛార్జ్‌లో 2 గంటల బ్యాటరీ లైఫ్‌ను అందించే స్పెషల్ ఇన్‌స్టాఛార్జ్ ఫీచర్‌ దీని సొంతం. బడ్స్ PRIMA 2 ఛార్జింగ్ కోసం USB టైప్-Cని ఉపయోగించాలి. ఇవి IPX5 రేట్‌ వాటర్, డస్ట్ రెసిస్టెంట్‌తో వస్తాయి.

Xiaomi Mijia Glasses: ఇదో ‘జేమ్స్‌బాండ్‘ గ్లాసెస్.. వావ్ ఎన్ని ఫీచర్లో.. ధర ఏంతంటే..

How to Download Your Digital Driving Licence: మీ డ్రైవింగ్ లైసెన్స్ 3 పద్ధతుల్లో డౌన్‌లోడ్ చేయండిలా

* ధర ఎంత?
నాయిస్ బడ్స్ ప్రైమా 2 ధర రూ.1299 నుంచి ప్రారంభమవుతుంది. ఇవి పెరల్ వైట్, డీప్ వైన్, కార్బన్ బ్లాక్ వంటి మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తాయి. నాయిస్ బడ్స్ ప్రైమా 2 సేల్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఫ్లిప్‌కార్ట్‌తో పాటు gonoise.comలో వీటిని కొనుగోలు చేయవచ్చు.
Published by:Kishore Akkaladevi
First published:

Tags: Technology

తదుపరి వార్తలు