Home /News /technology /

Redmi Note 11 Pro: ఐఎంఈఐ లిస్టింగ్​లో రెడ్​మీ నోట్11 ప్రో.. త్వరలోనే భారత్​లో లాంచింగ్​

Redmi Note 11 Pro: ఐఎంఈఐ లిస్టింగ్​లో రెడ్​మీ నోట్11 ప్రో.. త్వరలోనే భారత్​లో లాంచింగ్​

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Redmi Note 11 Pro: తాజా ఐఎంఈఐ లిస్టింగ్​లో రెడ్​మీ నోట్11 ప్రో వేరియంట్​ కనిపించింది. అంటే త్వరలోనే దీన్ని భారత్​లో విడుదల చేయనున్నారని స్పష్టమైన సంకేతాలు వెలువడినట్లే లెక్క.

ప్రముఖ స్మార్ట్​ బ్రాండ్​ రెడ్​మీ (REDMI) భారత మార్కెట్​లోకి వరుసగా స్మార్ట్​ఫోన్ (Smart Phones) లను రిలీజ్​ చేస్తోంది. ఇప్పటికే, బడ్జెట్​ స్మార్ట్​ఫోన్​ మార్కెట్​లో అగ్రగామిగా ఉన్న రెడ్​మీ.. ఇప్పుడు మిడ్​రేంజ్​ మార్కెట్​పై ఫోకస్​ పెట్టింది. ఇందులో భాగంగానే తాజాగా రెడ్​మీ నోట్ 11టీ 5జీ (REDMI Note 11T 5G)  విడుదల చేసింది. ఇప్పుడు ఇదే నోట్​11 సిరీస్​లో మరో మూడు వేరియంట్లను విడుదల చేసేందుకు సిద్దమవుతోంది. ఇప్పటికే చైనాలో లాంచ్​ అయిన రెడ్​మీ నోట్​ 11 (REDMI Note 11), రెడ్​మీ నోట్ 11 ప్రో(REDMI Note 11 pro) , రెడ్​మీ నోట్ 11 ప్లస్ (REDMI Note 11 plus) వేరియంట్లను రీబ్రాండ్ వెర్షన్లుగా భారత్​లో లాంచ్​ చేయనుంది. తొలుత వీటిలో రెడ్​మీ నోట్​ ప్రోను భారత మార్కెట్​లోకి తీసుకురానుంది. తాజా ఐఎంఈఐ లిస్టింగ్ (IMEI Listing)​లో రెడ్​మీ నోట్11 ప్రో వేరియంట్​ కనిపించింది. అంటే, త్వరలోనే దీన్ని భారత్​లో విడుదల చేయనున్నారని స్పష్టమైన సంకేతాలు వెలువడినట్లే లెక్క.

Jio New Plans: నేటి నుంచి జియో కొత్త ప్లాన్స్... ఏ ప్లాన్‌పై ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయంటే

ఇప్పటికే రెడ్​మీ నోట్​ 11 ప్రో భారత వేరియంట్ లాంచింగ్​ను టిప్‌స్టర్ ముకుల్ శర్మ తన ట్వీట్​ ద్వారా ధ్రువీకరించారు. అయితే రెడ్​మీ నోట్​ 11 ప్రో, ప్రో ప్లస్​ వేరియంట్లు భారత మార్కెట్​లో షియోమి11i లేదా షియోమి 11i హైపర్‌ఛార్జ్‌ రీబ్రాండ్ వెర్షన్లుగా విడులయ్యే అవకాశం ఉంది. షియోమి తొలుత తన కొత్త స్మార్ట్‌ఫోన్లను చైనాలో లాంచ్​ చేసి.. ఆ తర్వాత వాటి రీబ్రాండ్​ వెర్షన్లు భారత మార్కెట్​లోకి విడుదల చేస్తుంది. ఇందులో భాగంగా త్వరలోనే రెడ్‌మి నోట్ 11 ప్రో భారతీయ వెర్షన్‌ను విడుదల చేయనుంది.

Whatsapp: వాట్స‌ప్‌లో ఈ చిన్న ఫీచ‌ర్స్ తెలుసుకోండి.. ఉప‌యోగ‌ప‌డ‌తాయి!

* రెడ్​మీ నోట్​ 11 ప్రో స్పెసిఫికేషన్లు

లీకేజీలను బట్టి చూస్తే.. రెడ్​మీ నోట్​11 ప్రో ఫుల్​ హెచ్​డీ ప్లస్​ రిజల్యూషన్ గల 6.67-అంగుళాల AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. ఇది మీడియా టెక్​ డైమెన్సిటీ 920 ప్రాసెసర్​తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 11 ఆధారిత MIUI 12.5పై రన్​ అవుతుంది. ఈ స్మార్ట్​ఫోన్​ మొత్తం రెండు ర్యామ్​ వేరియంట్లతో మార్కెట్​లోకి వస్తుంది. 6 జీబీ ర్యామ్​, 128 జీబీ ఆన్‌బోర్డ్ స్టోరేజ్​తో పాటు 8 జీబీ ర్యామ్​, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ గల రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఇక, కెమెరా విషయానికి వస్తే.. 108 ఎంపీ ప్రైమరీ స్నాపర్, 8 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ స్నాపర్, 2 ఎంపీ టెలిమాక్రో స్నాపర్‌తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్​ కోసం దీని ముందు భాగంలో ప్రత్యేకంగా 16 ఎంపీ ఫ్రంట్ కెమెరాను చేర్చనుంది. ఇది 67W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే 5,160mAh బ్యాటరీతో వస్తుంది.

Power Bank: ప్ర‌యాణాలు ఎక్కువ చేస్తున్నారా..? ప‌వ‌ర్ బ్యాంక్ కొనాల‌నుకొంటున్నారా..?

IMEI లిస్టింగ్‌లో పేర్కొన్న రెడ్‌మీ నోట్ 11 ప్రో భారత్​లోకి ఏ పేరుతో లాంచ్​ కానుంది? ఎలాంటి ఫీచర్లు ఉంటాయి? అనే వివరాలను కంపెనీ త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుత లీకేజీలను బట్టి చూస్తే.. చైనాలో విడుదలైన రెడ్‌మి నోట్ 11 ప్రో ప్లస్​ భారత్​లో షియోమి11i హైపర్‌ఛార్జ్ పేరుతో రానుంది.
Published by:Shiva Kumar Addula
First published:

Tags: New mobiles, Redmi, Smart phone, Technology

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు