NEW MARUTI SUZUKI BREZZA LAUNCHED AT NEARLY RS 8 LAKHS AND ALREADY CROSSES 45000 BOOKINGS UMG GH
Maruti Suzuki Brezza: మారుతి సుజుకి బ్రెజ్జా లేటెస్ట్ వెర్షన్ లాంచ్.. రికార్డు స్థాయిలో బుకింగ్స్
మారుతి సుజుకి రికార్డు స్థాయి బుకింగ్స్
మారుతి సుజుకి (Maruti Suzuki) ఇండియాలో మరో కొత్త కారును లాంచ్ (Launch) చేసింది. 2022 బ్రెజ్జా (Brezza) ఎడిషన్‌ను కంపెనీ రిలీజ్ చేసింది. 7.5 లక్షల యూనిట్లకు పైగా అమ్మకాలు సాధించిన మారుతి సుజుకి బ్రెజ్జాకు ఇది అప్డేటెడ్ వెర్షన్. ఈ రెండో తరం బ్రెజ్జా కారు రూ.7.99 లక్షల ప్రారంభ ధరతో (ఎక్స్-షోరూమ్) విడుదలైంది.
ఆటోమొబైల్ (Auto Mobile) దిగ్గజం మారుతి సుజుకి (Maruti Suzuki) నుంచి వచ్చే కార్ల (Cars)కు ఇండియాలో మంచి క్రేజ్ ఉంటుంది. కార్ లవర్స్‌తో పాటు సాధారణ ప్రజలు కూడా ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయ్యే కార్ మోడళ్ల గురించి ఆరాతీస్తారు. తాజాగా మారుతి సుజుకి ఇండియాలో మరో కొత్త కారును లాంచ్ చేసింది. 2022 బ్రెజ్జా ఎడిషన్‌ను కంపెనీ రిలీజ్ చేసింది. 7.5 లక్షల యూనిట్లకు పైగా అమ్మకాలు సాధించిన మారుతి సుజుకి బ్రెజ్జాకు ఇది అప్డేటెడ్ వెర్షన్. ఈ రెండో తరం బ్రెజ్జా కారు రూ.7.99 లక్షల ప్రారంభ ధరతో (ఎక్స్-షోరూమ్) విడుదలైంది.
ఫస్ట్ జనరేషన్ బ్రెజ్జా అసలు పేరు విటారా బ్రెజ్జా. అయితే ఈ లేటెస్ట్ మోడల్ పేరులో మారుతి సుజుకి 'విటారా'ను తొలగించింది. ఇప్పుడు ఈ కారును మారుతి సుజుకి బ్రెజ్జా అని పిలుస్తున్నారు. పేరు మార్పు వెనుక ఒక కారణం ఉంది. ఈ కంపెనీ హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ వంటి వాటితో పోటీ పడేందుకు నెక్సా సిరీస్‌లో కొత్త, పెద్ద SUVని విడుదల చేయాలని భావిస్తోంది. భవిష్యత్తులో రానున్న ఆ SUV.. విటారా పేరుతో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
తాజాగా రిలీజ్ అయిన సెకండ్ జనరేషన్ బ్రెజ్జా బుకింగ్స్ ఇంతకు ముందే ఓపెన్ అయ్యాయి. అయితే బుకింగ్స్ ప్రారంభమైన ఎనిమిది రోజుల్లోనే ఆల్-న్యూ బ్రెజ్జా 45,000 బుకింగ్స్ అధిగమించిందని కంపెనీ పేర్కొంది. అంటే సగటున ప్రతి నిమిషానికి నాలుగు బుకింగ్స్ రిజిస్టర్ అవ్వడం విశేషం. ఈ కారుకు ఉండే డిమాండ్‌ను బుకింగ్స్ సూచిస్తున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
కొత్త మారుతి సుజుకి బ్రెజ్జా ఒక ఫీచర్-లోడెడ్ SUV అని చెప్పుకోవచ్చు. ఈ కారు K15C 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. కొత్త ఎర్టిగా, XL6 మోడళ్లలో వాడిన పవర్ యూనిట్ కూడా ఇదే. కొత్త బ్రెజ్జా 5-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో కూడిన పవర్‌ట్రెయిన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది.
* స్పెసిఫికేషన్లు
కొత్త బ్రెజ్జా అవుట్గోయింగ్ మోడల్ కంటే అప్డేటెడ్ టెక్నికల్ ఫీచర్లతో వస్తోంది. ఈ కాంపాక్ట్ SUVలో ARKAMYS సౌండ్ సిస్టమ్‌తో కూడిన తొమ్మిది అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉంది. ఇది ఇటీవల వచ్చిన కొత్త బాలెనోలో కనిపించింది. బ్రెజ్జా టాప్ మోడళ్లు ఫ్యూచరిస్టిక్ హెడ్స్-అప్ డిస్ప్లేను కలిగి ఉంటాయి. ఇది స్పీడ్, RPM లెవల్ వంటి ముఖ్యమైన డ్రైవింగ్ ఇన్ఫర్మేషన్ను హోస్ట్ చేస్తుంది. కాంపిటీటర్స్ అందిస్తున్న ఎలక్ట్రిక్ సన్‌రూఫ్‌ను కూడా కంపెనీ దీంట్లో చేర్చింది. మారుతి సుజుకి బ్రెజ్జా LXi, VXi, ZXi, ZXi+ అనే నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. టాప్-స్పెక్ ట్రిమ్‌లో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీ కెమెరా కూడా ఉంటాయి. ధరల ఆధారంగా ఈ వేరియంట్ల ఫీచర్లు మారుతున్నాయి.
Published by:Mahesh
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.