Home /News /technology /

NEW MARUTI SUZUKI ALTO EXPECTED TO BE UNVEILED NEXT MONTH UMG GH

Maruti Suzuki Alto: టాప్ ఫీచర్స్‌తో రానున్న ఆల్టో కారు.. లాంచింగ్ ఎప్పుడో తెలుసా..?

వచ్చే నెలలో లాంచ్ కానున్న మారుతి కొత్త కారు

వచ్చే నెలలో లాంచ్ కానున్న మారుతి కొత్త కారు

మారుతి సుజుకి వెంట వెంటనే రెండు కార్లను భారత మార్కెట్లోకి లాంచ్‌ చేయనుంది. గ్రాండ్ విటారా ఎస్‌యూవీ జులై 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతోంది. ఆ తర్వాత ఆల్టో న్యూ జనరేషన్‌ కార్‌ను అందుబాటులోకి తీసుకురానుంది.

మారుతి సుజుకి వెంట వెంటనే రెండు కార్లను భారత మార్కెట్లోకి లాంచ్‌ చేయనుంది. గ్రాండ్ విటారా ఎస్‌యూవీ జులై 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతోంది. ఆ తర్వాత ఆల్టో న్యూ జనరేషన్‌ కార్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. మారుతి సుజుకి (Maruti Suzuki) లాంచ్‌ చేసిన కార్లలో రికార్డ్‌ స్థాయి అమ్మకాలు సాధించిన బెస్ట్ మోడల్ ఆల్టో (Alto). వినియోగదారుల నుంచి అత్యంత ఆదరణ పొందిన ఆల్టో మోడల్‌కు కొత్త వేరియంట్‌ను లాంచ్ చేయాలని కంపెనీ నిర్ణయించింది. ఈ నెక్స్ట్‌ జనరేషన్‌ ఆల్టోను వచ్చే నెలలో విడుదల చేయాలని మారుతి సుజుకి భావిస్తోంది. ‘నెక్స్ట్-జెన్ మోడల్‌ను చాలా సందర్భాల్లో టెస్టింగ్‌(Testing) చేసినట్లు తెలుస్తోంది. ఆగస్టు సెకండ్ వీక్‌ తర్వాత ఈ కారు లాంచ్‌ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.’ అని ఆటోకార్ ఇండియా పోర్టల్ పేర్కొంది.

ఆల్టో మూడవ తరం పూర్తిగా కొత్త ప్లాట్‌ఫారమ్, రియు పవర్‌ట్రెయిన్‌ను పొందవచ్చు. మాడ్యులర్ హార్ట్‌టెక్ ప్లాట్‌ఫారమ్‌తో కారును రూపొందించే అవకాశం ఉంది. నెక్స్ట్‌ జనరేషన్‌ ఆల్టో పూర్తిగా కొత్త డిజైన్(New Design), బాడీ షెల్ కలిగి ఉందని మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. కారు హ్యాచ్‌బ్యాక్ లుక్ అలాగే కొనసాగుతుందని, ఇది కొత్త జనరేషన్‌ సెలెరియో పోలికలు ఉండవచ్చని భావిస్తున్నారు.

ఇదీ చదవండి: నెట్‌ఫ్లిక్స్ పాస్ వర్డ్ షేర్ చేస్తున్నారా ! ఇప్పుడు షేర్ చేసినా కూడా డబ్బులు కట్టాల్సిందే .. ఎంతంటే ?


కొత్త ఆల్టోలో హెడ్‌ల్యాంప్స్ కొత్త డిజైన్‌లో, ఫాగ్ ల్యాంప్స్ చంకీగా స్టైలింగ్ చేశారు. మెష్ గ్రిల్ ఫ్రంట్ బంపర్‌లో మెర్జ్‌ అయింది. కొత్త ఆల్టో ప్రస్తుత మోడల్ కంటే కొంచెం పొడవుగా ఉండవచ్చు. కారు డోర్లు కూడా కొంచెం పెద్దవిగా ఉన్నట్లు తెలుస్తోంది. వీల్ సైజ్ అన్ని వేరియంట్‌ల మాదిరిగానే 13 అంగుళాలు ఉంటుంది. టెయిల్‌గేట్ డిజైన్ నిటారుగా ఉంది. అయితే టెయిల్-ల్యాంప్ షేడ్ సెలెరియోలో కనిపించే విధంగా ఉంటుంది.

నెక్స్ట్‌ జనరేషన్‌ ఆల్టో కొత్త K10C 1.0-లీటర్ DualJet పెట్రోల్ ఇంజిన్‌తో అందుబాటులోకి రావచ్చు. ఇంజిన్ 89 Nm గరిష్ట టార్క్, 67 hp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది 796 cc ఇంజిన్‌ను కలిగి ఉన్న అవుట్‌గోయింగ్ ఆల్టో మోడల్ కంటే 20 Nm, 19 hp ఎక్కువ. మారుతి సుజుకి కొత్త ఆల్టోను రెండు ఇంజిన్‌ వేరియంట్లలో అందించనుంది. కొత్త ఆల్టో CNG వెర్షన్‌ను కూడా విడుదల చేయాలని భావిస్తున్నారు.



మారుతి సుజుకి నుంచి ఆల్టో కారు 2000లో మొదటిసారి ఇండియన్ మార్కెట్లో లాంచ్‌ అయింది. ఇది 2004 నాటికి మారుతి సుజుకి కారుల్లో అత్యధికంగా అమ్ముడైన కారుగా రికార్డు నెలకొల్పింది. 41 లక్షల యూనిట్లకు పైగా కంపెనీ విక్రయించింది.
Published by:Mahesh
First published:

Tags: Auto News, Maruti cars, MARUTI SUZUKI, New cars

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు