హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Mahindra Scorpio-N: మార్కెట్‌లోకి మహీంద్రా న్యూ స్కార్పియో.. అదిరిపోయే ఫీచర్స్.. ధర ఎంతంటే ?

Mahindra Scorpio-N: మార్కెట్‌లోకి మహీంద్రా న్యూ స్కార్పియో.. అదిరిపోయే ఫీచర్స్.. ధర ఎంతంటే ?

 మార్కెట్ లోకి  కొత్త  మహీంద్రా స్కార్పియో.. అదిరిపోయే ఫీచర్స్.. ధర ఎంతంటే ?

మార్కెట్ లోకి కొత్త మహీంద్రా స్కార్పియో.. అదిరిపోయే ఫీచర్స్.. ధర ఎంతంటే ?

మహీంద్రా(Mahindra) కంపెనీ ఇటీవల కొత్త స్కార్పియో-N వెహికల్‌ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. అయితే లాంచింగ్ సందర్భంగా కేవలం మాన్యువల్ వేరియంట్ల ధర(Price)లను మాత్రమే కంపెనీ ప్రకటించింది. మిగతా ఆటోమేటిక్, 4WD వేరియంట్ల ధరలను మహీంద్రా తాజాగా అనౌన్స్ చేసింది.

ఇంకా చదవండి ...

మహీంద్రా కంపెనీ ఇటీవల కొత్త స్కార్పియో-(Scorpio)N వెహికల్‌ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. అయితే లాంచింగ్ సందర్భంగా కేవలం మాన్యువల్ వేరియంట్ల ధరలను మాత్రమే కంపెనీ ప్రకటించింది. మిగతా ఆటోమేటిక్, 4WD వేరియంట్ల ధర(Price)లను మహీంద్రా తాజాగా అనౌన్స్ చేసింది. మాన్యువల్ వేరియంట్‌పై రూ.1.96 లక్షల ప్రీమియం ధరతో 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను కంపెనీ అందిస్తోంది. అయితే 4WD వేరియంట్ ధర 2WD (డీజిల్) వేరియంట్‌కు అదనంగా రూ. 2.45 లక్షలు ఉంటుంది.

మహీంద్రా స్కార్పియో ఆటోమేటిక్ ధర (ఎక్స్-షోరూమ్)

స్కార్పియో-N పెట్రోల్, డీజిల్ వేరియంట్లు రెండూ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తున్నాయి. పెట్రోల్‌(Petrol) వేరియంట్‌లో Z2 తప్ప Z4, Z8, Z8L ట్రిమ్స్ ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌లో అందుబాటులో ఉంటాయి. అయితే డీజిల్‌ వేరియంట్‌లో Z2 మినహా అన్ని ట్రిమ్‌లు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌లో లభిస్తాయి. Z4 డీజిల్ ఆటోమేటిక్ వెహికల్ 2.2-లీటర్ టర్బో-డీజిల్‌ ఇంజిన్‌తో లభిస్తుంది. ఇది 175bhp పవర్‌ను ఉత్పత్తి చేయగలదు. మాన్యువల్ ఆప్షన్‌లో అదే ఇంజిన్ పవర్ కెపాసిటీ 130bhpకి తగ్గుతుంది.

మహీంద్రా స్కార్పియో-N పెట్రోల్ AT

Z4 - రూ. 15.45 లక్షలు

Z8 - రూ. 18.95 లక్షలు

Z8L - రూ 20.95

మహీంద్రా స్కార్పియో-N డీజిల్ AT

Z4 - రూ. 15.95 లక్షలు

Z6 - రూ. 16.95 లక్షలు

Z8 - రూ. 19.45 లక్షలు

Z8L - రూ. 21.45 లక్షలు

మహీంద్రా స్కార్పియో-N ఆటోమేటిక్ ఫీచర్లు

ఆటోమేటిక్ వేరియంట్లు మాన్యువల్ వేరియంట్ల కంటే ఎక్కువ ఫీచర్లతో లభిస్తాయి. దీని Z4, Z6 ట్రిమ్స్.. ట్రాక్షన్ కంట్రోల్, వెహికల్ డైనమిక్స్ కంట్రోల్, హిల్ హోల్డ్ కంట్రోల్, ESC హిల్ డిసెంట్ కంట్రోల్‌, ఇతర ఫీచర్లతో లభిస్తాయి. Z8, Z8L ట్రిమ్స్.. 18-అంగుళాల అల్లాయ్‌ వీల్స్‌తో రానుండగా, మాన్యువల్ వేరియంట్లు 17-అంగుళాల అల్లాయ్‌ వీల్స్‌తో లభిస్తాయి.మహీంద్రా స్కార్పియో-N 4WD ధర (ఎక్స్-షోరూమ్)

 మహీంద్రా స్కార్పి యో-N డీజిల్ MT 4WD

Z4 - రూ. 16.45 లక్షలు

Z8 - రూ. 19.95 లక్షలు

Z8L - రూ. 21.94 లక్షలు

ఇదీ చదవండి: WhatsApp: వారెవ్వా వాట్సాప్.. రోజుకో కొత్త ఫీచర్లు.. ఇక ఎవరికి తెలియకుండా లెఫ్ట్ అయ్యే ఫీచర్.. ఎలాగో లుక్కేయండి !


 

మహీంద్రా స్కార్పియో-N డీజిల్ AT 4WD

Z4 - రూ. 18.40 లక్షలు

Z8 - రూ. 21.90 లక్షలు

Z8L - రూ. 23.90 లక్షలు

స్కార్పియో-N 4WD.. ఇంటెలిజెంట్ టెర్రైన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌తో వస్తుంది. 4WD వేరియంట్ మాన్యువల్ లేదా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌లో డీజిల్ ఇంజిన్ ఆప్షన్‌తో మాత్రమే లభిస్తుంది. Z4, Z8, Z8L ట్రిమ్‌లు మాత్రమే 4WD ఆప్షన్‌లో రూ. 2.45 లక్షల ప్రీమియం ధరతో అందుబాటులో ఉంటాయి.

-మహీంద్రా స్కార్పియో-N Z8L 6S ధర (ఎక్స్-షోరూమ్)

పెట్రోల్ MT- రూ 19.19 లక్షలు

డీజిల్ MT- రూ 19.69 లక్షలు

పెట్రోల్ ఏటీ- రూ. 21.15 లక్షలు

డీజిల్ ఏటీ- రూ. 21.65 లక్షలు

స్కార్పియో-Nలో రెండో వరుస కెప్టెన్ సీట్లతో 6-సీటర్ వేరియంట్‌ను మహీంద్రా అందిస్తోంది. ఇది Z8L ట్రిమ్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. కారు బుకింగ్స్ జులై 30 నుంచి ప్రారంభమవుతాయి. జులై 30 - ఆగస్టు 15 మధ్య బుక్ చేసుకునే కస్టమర్లు తమ బుకింగ్‌ను ఎడిట్ చేసుకునే అవకాశం ఉంటుంది. స్కార్పియో-N డెలివరీలు సెప్టెంబర్ 26న ప్రారంభమవుతాయి. వెయిటింగ్ పీరియడ్‌ను తగ్గించడానికి, మహీంద్రా Z8L వేరియంట్ ఉత్పత్తికి ప్రాధాన్యతనిస్తోంది.

Published by:Mahesh
First published:

Tags: Anand mahindra, Electric cars, Mahindra and mahindra, Scorpio

ఉత్తమ కథలు