హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

M1X MacBook Pro Models: 18న లాంచింగ్​కు సిద్ధమవుతోన్న M1X మ్యాక్‌బుక్‌ ప్రో మోడల్స్..

M1X MacBook Pro Models: 18న లాంచింగ్​కు సిద్ధమవుతోన్న M1X మ్యాక్‌బుక్‌ ప్రో మోడల్స్..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

అక్టోబర్‌ 18న భారతీయ కాలమానం ప్రకారం రాత్రి 10:30 గంటలకు యాపిల్​ ఈవెంట్‌ నిర్వహిస్తున్నట్లు యాపిల్‌ సంస్థ ప్రకటించింది. ఇందులో ఏమేం ప్రోడక్ట్స్​ లాంచ్​​ అవుతాయనే విషయాన్ని యాపిల్‌ వెల్లడించనప్పటికీ.. M1 X మ్యాక్‌బుక్‌ ప్రో ల్యాప్‌టాప్స్​ను లాంచ్‌ చేసే అవకాశముందని తెలుస్తోంది.

ఇంకా చదవండి ...

అక్టోబర్‌ 18న భారతీయ కాలమానం ప్రకారం రాత్రి 10:30 గంటలకు యాపిల్​ ఈవెంట్‌ నిర్వహిస్తున్నట్లు యాపిల్‌ సంస్థ ప్రకటించింది. ఇందులో ఏమేం ప్రోడక్ట్స్​ లాంచ్​​ అవుతాయనే విషయాన్ని యాపిల్‌ వెల్లడించనప్పటికీ.. M1 X మ్యాక్‌బుక్‌ ప్రో ల్యాప్‌టాప్స్​ను లాంచ్‌ చేసే అవకాశముందని తెలుస్తోంది. వీటితో పాటు ఎయిర్‌పాడ్స్‌ నెక్ట్స్‌ జనరేషన్‌ (ఎయిర్‌పాడ్స్‌ 3) ఆవిష్కరించవచ్చని కొన్ని లీకేజీలను బట్టి తెలుస్తోంది. కొత్త మ్యాక్‌ బుక్‌ ప్రో మోడల్స్ సరికొత్త యాపిల్‌ సిలికాన్ చిప్స్‌తో రానున్నాయి. వీటిని యాపిల్‌ M1 X చిప్‌ అని పిలుస్తున్నారు. గత సంవత్సరం విడుదల చేసిన యాపిల్‌ M1 చిప్‌సెట్‌ కంటే ఈ లేటెస్ట్‌ వెర్షన్‌ మరింత పవర్‌ఫుల్‌గా ఉండనుంది.

ఈ ఈవెంట్‌ను యాపిల్‌ అధికారిక యూట్యూబ్‌ ఛానెల్‌, కంపెనీ అఫీషియల్‌ వెబ్‌సైట్‌ నుంచి లైవ్‌ స్ట్రీమ్‌ తిలకించవచ్చు. అంతే కాదు ఈ ఆర్టికల్‌ దిగువన సూచించిన వీడియో లింక్‌ ద్వారా కూడా చూడవచ్చు.కేవలంనెల రోజుల వ్యవధిలోనే మరోసారి యాపిల్‌ ఈవెంట్​ను నిర్వహిస్తుండటం విశేషం. యాపిల్​ గత నెల14న నిర్వహించినఈవెంట్​లో ఐఫోన్‌ 13, కొత్త ఐప్యాడ్‌ మినీ ప్రోడక్ట్స్​నులాంచ్ చేసింది.

Smart Phone Tips : మీ ఫోన్ హ్యాక్ అయ్యింద‌ని అనుమానంగా ఉందా.. ఓసారి ఇలా చెక్ చేసుకోండి


అక్టోబర్​ 18న యాపిల్​ ఈవెంట్​

లాంచింగ్​కు సిద్దమవుతోన్నయాపిల్‌ M1 X చిప్‌ మోడల్స్​ మరింత ప్రొఫెషనల్‌గా, అధిక గ్రాఫిక్స్‌ సామర్ధ్యం కలిగి ఉంటాయి. ఇవి64 GB RAM వరకు సపోర్ట్ చేసే సామర్ధ్యంతో వస్తాయి. ఈ M1 X చిప్‌ రెండు రకాలుగా ఉన్నట్టు తెలుస్తోంది. M1 X పవర్‌తో రూపొందించిన యాపిల్‌ మ్యాక్‌ బుక్‌ ప్రో ల్యాప్‌టాప్​లు 14 ఇంచులు, 16 ఇంచుల స్క్రీన్‌తో రానున్నాయి. 120Hz రీఫ్రెష్‌ రేటుతో కూడిన మిని ఎల్​ఈడీ డిస్‌ప్లే కూడా ఈ ల్యాప్‌టాప్స్‌లో చూడవచ్చు. ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్​తో వచ్చేఈ ల్యాప్‌టాప్‌లో HDMI పోర్టు కూడా ఉంటుంది.

Whatsapp: వాట్స‌ప్ వినియోగ‌దారుల‌కు.. గూగుల్ షాక్‌.. ఇక డ‌బ్బులు క‌ట్టాల్సిందేనా?


అంతే కాదు, ఇందులో ఎస్​డీ కార్డ్ రీడర్‌ స్లాట్‌ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. మ్యాగ్‌సేఫ్‌ వైర్‌లెస్‌ ఛార్జింగ్‌కు కూడా ఇది సపోర్టు చేస్తుందని సమాచారం. ఈ సంవత్సరం విడుదల చేస్తున్న మ్యాక్‌ బుక్‌ ప్రోలో టచ్‌ బార్‌ ఉండదు, దాని స్థానంలో ఫిజికల్‌ బటన్స్ చూడవచ్చు. ఇక ఎయిర్‌పాడ్స్‌ 3 విషయానికి వస్తే చిన్న స్టెమ్‌తో ఎయిర్‌పాడ్‌-ప్రొ లాంటి డిజైన్‌ ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ థర్డ్ జనరేషన్‌ ఎయిర్‌పాడ్స్‌, ఎయిర్‌ పాడ్స్‌ 1, ఎయిర్‌పాడ్స్‌ 2 తరహాలో కాకుండా సిలికాన్ ఇయర్‌ టిప్స్‌ కలిగి ఉంటాయి. ఎయిర్‌పాడ్స్ 2ను యాపిల్‌ 2019లో విడుదల చేసింది. ఈ సరికొత్త ఎయిర్‌పాడ్స్ 3 లో వైర్‌లెస్‌ ఛార్జింగ్‌, కొత్త చిప్‌ ఉంటాయి. కాని యాక్టివ్‌ నాయిస్‌ క్యాన్సిలేషన్‌, స్పాటియల్‌ ఆడియో వంటి ప్రొ ఫీచర్లు ఉండకపోవచ్చని సమాచారం.

First published:

Tags: Apple

ఉత్తమ కథలు