ఐఫోన్ ఫ్యాన్స్‌కి గుడ్‌ న్యూస్!

ఏడు రంగుల్లో ఐఫోన్ అలరించనుంది. త్వరలో విడుదలకాబోయే కొత్త ఐఫోన్ మోడల్స్ కలర్‌ఫుల్‌గా కనిపించనున్నాయి. ఈ ఏడాది మూడు మోడల్స్ రిలీజ్ కానున్నాయి.

news18-telugu
Updated: July 26, 2018, 1:54 PM IST
ఐఫోన్ ఫ్యాన్స్‌కి గుడ్‌ న్యూస్!
ఏడు రంగుల్లో ఐఫోన్ అలరించనుంది. త్వరలో విడుదలకాబోయే కొత్త ఐఫోన్ మోడల్స్ కలర్‌ఫుల్‌గా కనిపించనున్నాయి. ఈ ఏడాది మూడు మోడల్స్ రిలీజ్ కానున్నాయి.
  • Share this:
యాపిల్ ఫ్యాన్స్‌ సెప్టెంబర్ కోసం ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే సెప్టెంబర్‌లో కొత్త ప్రొడక్ట్స్ లాంఛ్ చేయనుంది యాపిల్. ఈసారి మూడు ఐఫోన్ మోడల్స్ రిలీజ్ కానున్నాయి. గతేడాది తీసుకొచ్చిన ఐఫోన్ ఎక్స్ మోడల్‌ను 5.8 అంగుళాల ఓలెడ్ డిస్‌ప్లేతో మళ్లీ రిలీజ్ చేయనున్నారని అంచనా. దాంతోపాటు 6.5 అంగుళాలతో 'ఐఫోన్ ఎక్స్ ప్లస్' రిలీజ్ కానుంది. ఇక మూడో ఫోన్ 6.1 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లేతో ఉంటుంది. సరసమైన ధరలో, ప్రీమియం ఫీచర్లతో ఉండబోయే ఈ ఐఫోన్ ఏడు రంగుల్లో మురిపించనుందని తెలుస్తోంది. గతంలో ఐఫోన్ 5సీ ఐదు కలర్స్‌లో ఫ్యాన్స్‌ని ఆకట్టుకుంది.

గోల్డ్, గ్రే, వైట్, బ్లూ, రెడ్, ఆరెంజ్ కలర్స్‌తో మార్కెట్లోకి రాబోయే ఈ ఫోన్ ధర 600-700 డాలర్లు ఉంటుందని అంచనా. అయితే వైట్, బ్లాక్, ఫ్లాష్ యెల్లో, బ్రైట్ ఆరెంజ్, ఎలక్ట్రిక్ బ్లూ, గోల్డ్ కలర్స్‌లో ఉంటుందన్న మరో ప్రచారం కూడా ఉంది. అయితే ఏడు రంగుల్లో ఐఫోన్ రిలీజ్ కానుందని వాస్తవం. అయితే ఏఏ రంగుల్లో ఉంటుందన్నది రిలీజ్ రోజే తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఐఫోన్ 8 రెడ్ రిలీజైంది. హెచ్ఐవీ/ఎయిడ్స్ ప్రోగ్రామ్‌కు మద్దతు ఇస్తూ రెడ్ ఫోన్ రిలీజ్ చేసింది యాపిల్. మీరు యాపిల్ రెడ్ ఫోన్ కొంటే గ్లోబల్ ఫండ్‌కు మీ తరఫున డొనేషన్ పంపిస్తుంది యాపిల్. గ్లోబల్ ఫండ్ 100% డబ్బును ఘనా, ర్వాండా, సౌతాఫ్రికా, టాంజానియా, కెన్యా, జాంబియా దేశాల్లో హెచ్ఐవీ/ఎయిడ్స్ ప్రోగ్రామ్‌కు ఖర్చుచేస్తుంది.

First published: July 26, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు