స్మార్ట్‌ఫోన్ కంపెనీ ఇన్ఫినిక్స్ (Infinix) ఇండియన్ మార్కెట్‌లోకి న్యూ స్మార్ట్ 6 ప్లస్ ఫోన్‌ను లాంచ్ చేసింది. ఈ ఫోన్ ఇతర మార్కెట్‌లలో ఇప్పటికే అందుబాటులో ఉన్న ఒరిజినల్ స్మార్ట్ 6 ప్లస్‌తో పోలిస్తే డిఫరెంట్ డిజైన్, స్పెసిఫికేషన్‌లను అందిస్తోంది. ఇన్ఫినిక్స్ స్మార్ట్ 6 ప్లస్ (Infinix Smart 6 Plus) స్మార్ట్ ఫోన్ ఇండియన్ వెర్షన్(X6823C)ను, ఒరిజినల్ మోడల్(X6511G) తరహాలో నాచ్ డిస్‌ప్లేతో తయారు చేశారు. కానీ 6.82 అంగుళాల డయాగ్నల్ స్క్రీన్, ఒరిజినల్ స్మార్ట్ 6 ప్లస్ 6.6 అంగుళాల ప్యానెల్ కంటే పెద్దది. ఇండియన్ వేరియంట్ డిస్‌ప్లే పీక్ బ్రైట్‌నెస్ 440 నిట్స్ (అసలు ఫోన్‌లో 500 నిట్స్)తో కొంత తగ్గింది. రెండు స్క్రీన్‌లు ఒకే రిజల్యూషన్ (HD+)ను అందిస్తున్నాయి. ఇండియన్ స్మార్ట్ 6 ప్లస్ స్మార్ట్‌ఫోన్ వెనుక ప్యానెల్ మిర్రర్ బ్యాక్ డిజైన్‌తో వస్తుంది. అయితే ఒరిజినల్ మోడల్ వెనుక కవర్ ఆరా వేవ్స్ టెక్చర్డ్ డిజైన్, యాంటీ బాక్టీరియల్ మెటీరియల్ కోట్‌తో వస్తుంది.
* రెండు వేరియంట్‌ల డిజైన్ డిఫరెంట్
రెండు వేరియంట్‌లలోని కెమెరా సెటప్ డిజైన్ భిన్నంగా ఉంటుంది. రెండూ స్మార్ట్‌ఫోన్‌లలో AI లెన్స్‌లతో 8MP ప్రైమరీ సెన్సార్‌లు ఉన్నాయి. సెల్ఫీ కెమెరాలు కూడా భిన్నంగా ఉంటాయి. ఒరిజినల్ మోడల్‌లో 8MP సెల్ఫీ షూటర్ ఒకే ఫ్లాష్‌లైట్‌తో వస్తుంది. ఇండియన్ వెర్షన్‌లో లెఫ్ట్, రైట్ సైడ్‌లో LED ఫ్లాష్‌లు, 5MP సెల్ఫీ యూనిట్ ఉంటుంది.
ఇండియన్ ఇన్ఫినిక్స్ స్మార్ట్ 6 ప్లస్ స్మార్ట్‌ఫోన్ Helio G25 SoC ప్రాసెసర్‌తో పని చేస్తుంది. 3GB RAM, 64GB ఇంటర్నల్ స్టోరేజ్‌ను అందిస్తుంది. ర్యామ్‌ను 6GB వరకు ఎక్స్‌పాండ్ చేసుకొనే సదుపాయం ఉంది. స్మార్ట్‌ఫోన్‌లో మైక్రో SD కార్డ్ కోసం ప్రత్యేక స్లాట్ ఉంది, దీని ద్వారా స్టోరేజీని 512GB వరకు ఎక్స్‌పాండ్ చేసుకోవచ్చు. ఒరిజినల్ స్మార్ట్ 6 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లో 2GB RAM, 32GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. స్టోరేజ్‌ను 512GB వరకు పెంచుకోవచ్చు. SoC పవర్‌కు సంబంధించిన వివరాలను ఇన్ఫినిక్స్ వెల్లడించలేదు, 2GHz CPU ఉందని మాత్రమే చెప్పింది. ఒరిజినల్ స్మార్ట్ 6 ప్లస్ ఆండ్రాయిడ్ 11(గో ఎడిషన్) బేస్డ్ XOS 7.6తో రన్ అవుతుంది. ఇండియన్ వెర్షన్ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 12 (గో ఎడిషన్), XOS 10.6 ఆన్ టాప్‌తో పని చేస్తుంది.
* ఇన్ఫినిక్స్ స్మార్ట్ 6 ప్లస్ వెర్షన్‌ల ఇతర హైలెట్స్ ఇవే..
తాజా ఫోన్‌లో రియర్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, DTS సరౌండ్ సౌండ్ , మైక్రోయూఎస్‌బి పోర్ట్ ఉన్నాయి. రెండు మోడల్స్ 5,000 mAh బ్యాటరీలతో వస్తాయి. ఇన్ఫినిక్స్ స్మార్ట్ 6 ప్లస్ ఇండియా వేరియంట్ మిరాకిల్ బ్లాక్, ట్రాంక్విల్ సీ బ్లూ రంగులలో అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌ను ఇండియాలో Flipkart ద్వారా ఆగస్టు 3 నుంచి రూ.7,999 ప్రారంభ ధరతో అందుబాటులో ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 5G Smartphone, Infinix, Mobiles, New smart phone