Home /News /technology /

Google For India: గూగుల్ పే, సెర్చ్, ఎండ్-టు-ఎండ్ టీకా బుకింగ్ సపోర్ట్.. గూగుల్ ఇండియాలో అందుబాటులోకి వచ్చిన కొత్త ఫీచర్లు తెలుసుకోండి 

Google For India: గూగుల్ పే, సెర్చ్, ఎండ్-టు-ఎండ్ టీకా బుకింగ్ సపోర్ట్.. గూగుల్ ఇండియాలో అందుబాటులోకి వచ్చిన కొత్త ఫీచర్లు తెలుసుకోండి 

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

గూగుల్ ప్రకటించిన కొత్త ఫీచర్లు వచ్చే ఏడాది ప్రారంభంలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే తాజాగా గూగుల్ ప్రకటించిన ఫీచర్స్ ఏంటి? అవి భారతీయ యూజర్లకు ఎంతగా ఉపయోగపడతాయి? వంటి విషయాలు తెలుసుకుందాం.

ప్రముఖ సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ (Google) తాజాగా 7వ "గూగుల్ ఫర్ ఇండియా" (google for india) ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ సందర్భంగా వందల కోట్ల మంది భారతీయులకు ఇంటర్నెట్‌ను సురక్షితమైన స్పేస్‌గా మార్చేందుకు తాము కృషి చేస్తున్నామని తెలిపింది. అంతేకాదు అనేక అదిరిపోయే ఫీచర్ల (features)ను ప్రకటించింది. గూగుల్ సెర్చ్, గూగుల్ పేలలో కొత్త ఫీచర్లను జోడించనున్నట్లు తెలిపింది. ప్రతికూల వాతావరణం పరిస్థితులలో సపోర్ట్, గూగుల్ అసిస్టెంట్ (google assistant) ద్వారా ఎండ్-టు-ఎండ్ టీకా బుకింగ్‌కు సపోర్ట్ అందించనున్నట్లు తెలిపింది. గూగుల్ ప్రకటించిన ఫీచర్లు వచ్చే ఏడాది ప్రారంభంలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే తాజాగా గూగుల్ ప్రకటించిన ఫీచర్స్ ఏంటి? అవి భారతీయ యూజర్ల (Indian users)కు ఎంతగా ఉపయోగపడతాయి? వంటి విషయాలు తెలుసుకుందాం.

1. కోవిన్ (Cowin)పై టీకా బుకింగ్‌కు మద్దతునిచ్చే గూగుల్ అసిస్టెంట్

టీకా బుకింగ్‌ (vaccine booking)కు మద్దతునిచ్చేందుకు ఎండ్-టు-ఎండ్ వ్యాక్సినేషన్ బుకింగ్ సపోర్ట్ (End to end vaccination booking support) అందించనుంది గూగుల్. దీనిని గూగుల్ అసిస్టెంట్ గైడ్ చేస్తుంది. భారతీయులు సెర్చ్ చేసేందుకు వాయిస్ (voice) ను ప్రపంచ సగటు కంటే రెట్టింపు స్థాయిలో ఉపయోగిస్తారని.. చాలామంది తమ భాషలో అసిస్టెంట్‌ని వినియోగించడానికి ఇష్టపడతారని గూగుల్ సెర్చ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రఘువన్ అన్నారు. అందుకే గూగుల్ అసిస్టెంట్ ద్వారా టీకా బుకింగ్‌కు సపోర్టు ఫీచర్ ఇవ్వనున్నామన్నారు.

తొలిసారిగా ఈ ఫీచర్ పరిచయం చేసేందుకు కోవిన్ (Cowin) తో కలిసి పని చేసినట్లు గూగుల్ తెలిపింది. ప్రతి స్టెప్ వద్ద వాయిస్ గైడెన్స్ తో యూజర్లు కోవిన్ వెబ్‌సైట్‌లో వ్యాక్సినేషన్ అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. ఇది ఇంగ్లీష్‌తో సహా గుజరాతీ, కన్నడ, మలయాళం, హిందీ, బెంగాలీ, మరాఠీ, తమిళ్, తెలుగు అనే 8 భాషలకు సపోర్ట్ చేస్తుంది. ఇది 2020లో అందుబాటులోకి వస్తుంది.

2. స్థానిక భాషలలో గూగుల్ సెర్చ్

గూగుల్ సెర్చ్ ఇప్పుడు యూజర్ల స్థానిక భాషలోనే (Regional languages) ఫలితాలను చూపుతుంది. మీరు తెలుగులో ఏదైనా టాపిక్ సెర్చ్ చేస్తే.. ఆ సమాచారం తెలుగులో అందుబాటులో లేకుండా వేరే భాషలో అందుబాటులో ఉన్నట్లయితే.. ఆ భాషను తెలుగులోకి అనువదించి గూగుల్ సెర్చ్ అందిస్తుంది. గూగుల్ సెర్చ్‌లో మీరు వెతికిన టాపిక్‌కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చినా.. అది స్థానిక భాషలో ఉండకపోవడం వల్ల చదవడం ఇబ్బంది అయిపోతుంది. కానీ ఇప్పుడు మీరు తెలుగులో వెతికిన టాపిక్ సంబంధించిన సమాచారం ఇంగ్లీష్‌ పేజీలలో ఉన్నా.. ఆ క్వాలిటీ పేజీలను తెలుగులోకి అనువదించి చూపిస్తుంది గూగుల్. అయితే గూగుల్ అడ్వాన్స్‌డ్ మిషన్ లెర్నింగ్ టెక్నిక్స్ (Google advanced machine learning technic) ఉపయోగించి భారతీయ భాషల అనువాద నాణ్యతను మెరుగుపరుస్తోంది. మనుషుల్లాగా ఒక టాపిక్‌ను అర్థవంతంగా ట్రాన్స్‌లేట్ చేయగల టెక్నాలజీ అభివృద్ధి చేసినందున త్వరలోనే ఈ ఫీచర్ రోల్ అవుట్ (Roll out) చేయనున్నట్లు గూగుల్ తెలిపింది.

ఈ ఫీచర్ హిందీ (hindi), కన్నడ, తమిళం, తెలుగు (telugu), మలయాళంతో సహా ఐదు భారతీయ భాషలలో విడుదల కానుంది. త్వరలో మరిన్ని భాషలకు సపోర్ట్ లభిస్తుంది. మొబైల్ బ్రౌజర్‌లో దీన్ని యాక్సెస్ చేయవచ్చు.

3. గూగుల్ పే హింగ్లీష్ , మైషాప్ ఫీచర్‌

గూగుల్ పే యాప్ (google pay app) లాంగ్వేజ్ సెట్టింగ్స్‌లో హింగ్లీష్‌ అనే భాష త్వరలోనే అందుబాటులోకి రానుంది. హిందీ, ఇంగ్లీష్‌లు కలిపిన భాషే హింగ్లీష్! భారతదేశంలోని చాలా ప్రాంతాలలో హింగ్లీష్‌ని తరచుగా మాట్లాడుతుంటారు. అందుకే హింగ్లీష్ లాంగ్వేజ్ ఆప్షన్ త్వరలో గూగుల్ పేలో అందించనుంది గూగుల్. యాప్ సెట్టింగ్‌లకు వెళ్లి పర్సనల్ ఇన్ఫో ట్యాబ్‌పై క్లిక్ చేసి హింగ్లీష్‌ భాషను ఎంచుకోవచ్చు.

స్పీక్ టూ టెక్స్ట్..

గూగుల్ పే యాప్‌లో మనీ ట్రాన్స్‌ఫర్ (money transfer) చేసేటప్పుడు యూజర్లు వారి బ్యాంక్ ఖాతా నంబర్‌ను నేరుగా వాయిస్ సాయంతో టైప్ చేసేందుకు కూడా స్పీక్ టూ టెక్స్ట్ లాంటి ఫీచర్‌ను అందించనుంది. యాప్‌లో హిందీ లేదా ఇంగ్లీషులో ఖాతా నంబర్‌లను వాయిస్ ద్వారా నమోదు చేయొచ్చు. పేమెంట్ చేసే ముందు ఖాతా నంబర్ ను చెక్ చేసుకునే ఫెసిలిటీ కూడా ఉండనుంది. ఈ యాప్ బిల్ స్ప్లిట్ ఫీచర్‌ను కూడా పొందుతోంది.

చిన్న వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలకు సాయం చేసే ఉద్దేశంతో మై షాప్ (my shop) అనే ఫీచర్‌ను గూగుల్ పేలో యాడ్ చేయనుంది గూగుల్. యూజర్లు స్టోర్ బిల్డర్ టూల్ ఉపయోగించి ఆన్‌లైన్ స్టోర్ సెటప్ చేసుకోవచ్చు. ఈ టూల్ సహాయంతో తమ ప్రొడక్టులకు సంబంధించిన ఇమేజ్‌లు, డిస్క్రిప్షన్, ధరలు యాడ్ చేసి బిజినెస్ ప్రొఫైల్ (business profile) క్రియేట్ చేయవచ్చు. ఆ తర్వాత ఆ సమాచారాన్ని ఇతరులకు షేర్ చేయవచ్చు. ఈ బిజినెస్ ప్రొఫైల్స్ గూగుల్ పే యాప్‌తో సహా గూగుల్ సెర్చ్ వంటి వాటిలో చూడొచ్చు.

4. క్లైమేట్, వెదర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్

భారతదేశంలో విపరీత వాతావరణ సంఘటనలకు సంబంధించిన సమాచారాన్ని గూగుల్ చూపించనుంది. ఇందుకు ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ (IMD), సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (CPCB)తో భాగస్వామ్యం కుదుర్చుకుంది గూగుల్. మొదటి ఫీచర్‌లో.. గూగుల్ సెర్చ్ రియల్ టైమ్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI)ని చూపిస్తుంది. "ఎయిర్ క్వాలిటీ నియర్ మీ" లేదా "ఎయిర్ క్వాలిటీ నియర్ హైదరాబాద్" వంటి ప్రశ్నలను టైప్ చేయడం ద్వారా మీరు సమీప స్టేషన్ నుంచి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ని చూడొచ్చు.

రెండవ ఫీచర్‌లో భారీ వర్షపాతం, వరదలు వంటి తీవ్రమైన వాతావరణ పరిస్థితుల గురించి గూగుల్ వాతావరణ హెచ్చరికలను యూజర్లకు సెండ్ చేస్తుంది. దీని కోసం ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ (IMD) తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. భారీ వర్షపాతం, హీట్‌వేవ్‌లు, చలి లేదా ఉరుములతో కూడిన గాలివానలకు సంబంధించి వాతావరణ హెచ్చరికలు చేస్తుంది గూగుల్. ఆండ్రాయిడ్ ఫోన్ల హోం స్క్రీన్ లో At-a-Glance అనే సెక్షన్ లో వాతావరణ హెచ్చరికలు కనిపిస్తాయి. లేదా గూగుల్ అసిస్టెంట్ వినియోగించి వెదర్ అలెర్ట్స్ తెలుసుకోవచ్చు.

5. మరిన్ని భాషల్లో మాట్లాడే లుక్ టూ స్పీక్ యాప్‌(Look to speak)

గూగుల్ లుక్ టు స్పీక్ (Look to speak) యాప్ మానసిక వైకల్యంతో బాధపడే వారికి బాగా ఉపయోగపడుతుంది. ఈ యాప్ ఇప్పుడు మరిన్ని ప్రాంతీయ భాషలకు సపోర్ట్ ఇవ్వనుంది. పొందుతోంది. ముందుగా స్టోర్ చేసిన పదాలు, పదబంధాలను యూజ్ చేసి కళ్ల ద్వారా కమ్యూనికేట్ చేయడంలో ఈ యాప్ (App) సహాయపడుతుంది. ఇది ఇప్పుడు హిందీ, మరాఠీ, తెలుగు, తమిళం, బెంగాలీతో సహా ఐదు భారతీయ భాషలలో అందుబాటులోకి వస్తోంది.
Published by:Prabhakar Vaddi
First published:

Tags: Application, Google, Google pay, Google search, Latest Technology

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు