Home /News /technology /

NEW FEATURES OF IOS 16 IN NEW OPERATING SYSTEM UMG GH

iOS 16 Features: యాపిల్ అదిరిపోయే ఫీచర్లు.. కొత్త ఆపరేటింగ్ సిస్టమ్‌లో టాప్-5 ఫీచర్లు ఇవే

ios16 న్యూ ఫీచర్లు

ios16 న్యూ ఫీచర్లు

ఐఓఎస్ 16తో ఐఫోన్ 13, ఐఫోన్ 12, ఐఫోన్ ఎస్ఈ 3 లేదా ఇతర లేటెస్ట్ మోడల్స్‌కు చాలా ఉపయోగకరమైన ఫీచర్లు రానున్నాయి. వాటిలో 5 బెస్ట్ ఫీచర్స్ గురించి తెలుసుకుందాం.

ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ (Apple).. ఐఫోన్ (iPhone) యూజర్ల కోసం ఐఓఎస్ 16 (iOS 16) ఓఎస్‌ను ఇటీవలే ప్రకటించింది. ఈ బిగ్గెస్ట్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ (Software Update) 2022, సెప్టెంబర్ నెలలో ఐఫోన్ యూజర్లకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఐఓఎస్ 13, 14, 15.. ఇలా గత అన్ని ఓఎస్‌లను సెప్టెంబర్ నెలలోనే యాపిల్ లాంచ్ చేసింది. ఐఓఎస్ 16ని ఈ ఏడాది సెప్టెంబర్‌లో 19న లాంచ్ చేయొచ్చని టెక్ రిపోర్ట్స్ పేర్కొంటున్నాయి. కొత్త సాఫ్ట్‌వేర్‌లోని అద్భుతమైన ఫీచర్లు ఐఫోన్లను పూర్తిగా మార్చబోతున్నాయి. ముఖ్యంగా ఐఓఎస్ 16తో ఐఫోన్ 13, ఐఫోన్ 12, ఐఫోన్ ఎస్ఈ 3 లేదా ఇతర లేటెస్ట్ మోడల్స్‌కు చాలా ఉపయోగకరమైన ఫీచర్లు రానున్నాయి. వాటిలో 5 బెస్ట్ ఫీచర్స్ గురించి తెలుసుకుందాం.

పంపిన మెసేజ్‌లను ఎడిట్ లేదా అన్‌సెండ్ చేయడం
ఐఓఎస్ 16 అప్‌డేట్‌తో ఐమెసేజెస్ (iMessages) మరింత అధునాతనంగా మారనుంది. ఈ అప్‌డేట్‌తో యూజర్లు ఐమెసేజ్ (iMessage) పంపిన తర్వాత 15 నిమిషాలలోపు దానిని ఎడిట్ చేసుకోవచ్చు. అయితే, రిసీవర్ స్క్రీన్‌లో ఈ ఐమెసేజ్‌పై ఎడిటెడ్ అని కనిపిస్తుంది. అయినా కూడా ఈ ఫీచర్ చాలా ఉపయోగపడుతుంది.

కస్టమ్ లాక్ స్క్రీన్‌
ఐఓఎస్ 16తో కొత్త కష్టమైజబుల్ (Customizable) లాక్ స్క్రీన్‌ వస్తుంది. ఈ లాక్ స్క్రీన్ చాలా అట్రాక్టివ్‌గా కనిపిస్తుంది. ప్రస్తుతం ఉన్న లాక్ స్క్రీన్‌పై ఎక్కువ నోటిఫికేషన్ రావడం వల్ల లాక్ స్క్రీన్‌ ఇమేజ్ కనిపించడం లేదు. అయితే కొత్త సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌తో నోటిఫికేషన్లు అన్నీ కూడా స్క్రీన్ కింద డిస్‌ప్లే అవ్వడం వల్ల ఈ స్క్రీన్ మరింత స్పష్టంగా కనిపిస్తుంది. లాక్ స్క్రీన్‌పై ఎక్కువ సమాచారం కూడా పొందవచ్చు. ఎక్కువ ఫొటోలు, లింక్డ్ ఫోకస్ మోడ్‌లు, లాక్ స్క్రీన్‌ను ప్రతి గంటకి లేదా డైలీ మార్చే ఫొటో షఫుల్ వంటి మరెన్నో ఫీచర్లు కూడా పొందొచ్చు. లాక్ స్క్రీన్‌ లుక్ మార్చేందుకు నోటిఫికేషన్‌లపై కాకుండా మరెక్కడైనా లాంగ్ ప్రెస్ చేయవచ్చు.

ఫొటోల నుంచి సబ్జెక్ట్‌ని సెలెక్ట్ చేయవచ్చు
బ్యాక్‌గ్రౌండ్‌ కాకుండా కేవలం సబ్జెక్ట్‌పై క్లిక్ చేయడం లేదా లాగడం ద్వారా మీరు ఇమేజ్ నుంచి సబ్జెక్ట్‌లను ఎంచుకోవచ్చు. ఈ ఫీచర్ చాలా ఉపయోగపడుతుంది. అయితే, ఈ ఫీచర్‌ A12 బయోనిక్ ప్రాసెసర్‌తో వచ్చే ఐఫోన్ ఐఫోన్ ఎక్స్ఎస్ లేదా అంతకన్నా కొత్త ఫోన్‌లోనే పనిచేస్తుంది.

వాయిస్, కీబోర్డ్‌తో డిక్టేషన్
ఐఓఎస్ 16లో కొత్త డిక్టేషన్ ఫీచర్‌ వస్తుంది. ఈ ఫీచర్‌తో యూజర్లు వేగంగా, మరింత కచ్చితంగా మాట్లాడుతూ టెక్స్ట్ టైప్ చేయవచ్చు. ఈ కొత్త ఫీచర్ ఆటోమేటిక్‌గా కామా, ఫుల్‌స్టాప్ వంటి పంక్చువేషన్ మార్క్స్, క్వశ్చన్ మార్క్స్ పెడుతుంది. యూజర్లు డిక్టేషన్ ద్వారానే రకరకాల ఎమోజీలను కూడా యాడ్ చేసుకోవచ్చు. అత్యంత విశేషమైన విషయం ఏమిటంటే, యూజర్లు మాట్లాడుతున్నప్పుడు కీబోర్డ్ కూడా కనిపిస్తుంది. ఇది యాక్టివ్‌గానే ఉంటుంది. యూజర్లు మాట్లాడుతూనే సులభంగా టైపింగ్‌కి మారవచ్చు.

హాప్టిక్ కీబోర్డ్
ఐఫోన్‌లో టైప్ చేస్తున్నప్పుడు యూజర్లు అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్ పొందొచ్చు. కీబోర్డ్‌ను టచ్ చేసి, టెక్స్ట్‌ని టైప్ చేసిన ప్రతిసారీ ఐఫోన్ యూజర్లు చక్కటి ఎక్స్‌పీరియన్స్ పొందుతారు.
Published by:Mahesh
First published:

Tags: Apple, Ios, Iphone, New features

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు