ioS15 Features: ఐఓఎస్ 15లో అదిరిపోయే ఫీచర్.. ఇక ఫోన్‌లో యాడ్స్‌ను త‌గ్గించుకోవ‌చ్చు

(ప్రతీకాత్మక చిత్రం)

యూజ‌ర్ల సెక్యూరిటీకి పెద్ద‌పీట వేయ‌డంలో యాపిల్(Apple) అగ్ర‌స్థానంలో ఉంటుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ప్రస్తుతం కొత్తగా వచ్చే ఐఓఎస్ 15 లోనూ పలు రకాల ఫీచర్స్ వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి.

  • Share this:
    యూజ‌ర్ల సెక్యూరిటీకి పెద్ద‌పీట వేయ‌డంలో యాపిల్(Apple) అగ్ర‌స్థానంలో ఉంటుంది. అందులో ఎటువంటి సంద‌హం లేదు. నిరంత‌ర‌యం యూజ‌ర్ల‌కు అనుకూల‌మైన ఫీచ‌ర్ల‌ను అందిస్తూ మార్కెట్‌లోకి కొత్త వ‌ర్ష‌న్‌ల‌ను విడుద‌ల చేస్తుంది. ఆ కోవ‌లోకే వ‌స్తుంది ఐఓఎస్ 15 వర్షన్‌. గ‌త వ‌ర్ష‌న్‌లోతో పోలిస్తే ఈ వ‌ర్ష‌న్‌(Versioon)లో కొత్త ఫీచ‌ర్స్ ఉన్నాయి. చైల్డ్ అబ్యూజింగ్ ఇమేజ్‌(Image)ల‌ను కంట్రోల్ చేయ‌డం.. అలాగే ప‌ర్స‌న‌లైజ్డ్ యాడ్స్ ఈ కొత్త ఫీచ‌ర్లు ఐఓఎస్ 15 వర్షన్లో ఉండ‌బోతున్నాయి. ఎప్ప‌టి నుంచో ఐఫోన్ యూజ‌ర్లు ఎదురు చూస్తున్న  ఐఓఎస్ 15 వర్షన్ సెప్టెంబర్లో(September) విడుదల కానుంది. ఈ వ‌ర్ష‌న్‌లో పర్సనలైజ్డ్ యాడ్స్ అనే ఫీచ‌ర్‌ను అందిస్తున్నారు. ఈ ఫోన్ వాడే  ఎవరైన యూజర్  ఎనేబుల్(Enble) చేస్తేనే ఈ ప‌ర్స‌న‌లైజ్డ్ యాడ్స్ వ‌స్తాయి.

    ప్ర‌స్తుతం ప‌ర్స‌న‌లైజ్డ్ యాడ్స్ బాగా ప్రాచుర్యం పొందింది. డిజిట‌ల్ వేదిక‌గా యాడ్స్‌ను ప్ర‌మోట్ చేసుకొనేందుకు చాలా కంపెనీలు ఈ ఫీచ‌ర్‌పై ఆస‌క్తి చూపుతున్నాయి. యూజ‌ర్ స‌ర్చింగ్‌ను అనుస‌రించి ఆయా సంస్థ‌లు త‌మ ఉత్ప‌త్తుల యాడ్స్‌ల‌ను యూజ‌ర్ల‌కు పంపిస్తుంటాయి. అయితే ఇవి కొంత‌మందికి త‌ల‌నొప్పిగా మారే అవ‌కాశం ఉంది. యాడ్స్ ఎక్కువ‌గా వ‌స్తుంటే ఇబ్బంది ప‌డేవారాఇకి యాపిల్ కొత్త వ‌ర్ష‌న్ ప‌రిష్కారం చూపుతోంది.

    Gmail Features: జీమెయిల్ యాప్‌లో అదిరిపోయే ఫీచ‌ర్‌.. నేరుగా వాయిస్ కాల్ చేసుకోవ‌చ్చు


    ioS 15 వ‌ర్ష‌న్‌లో ప‌ర్స‌న‌లైజ్డ్ యాడ్స్ చేయ‌డం సుల‌భంగా ఉంటుంద‌ని సంస్థ తెలిపింది. ioS 15 వెర్ష‌న్‌లో యాప్‌ను ఓపెన్ చేసిన‌ప్పుడే యూజ‌ర్‌ను ప‌ర్స‌న‌లైజ్డ్ యాడ్స్‌ను ట‌ర్న్ ఆన్ చేయాలా వ‌ద్దా అని అడుగుతుంది. అప్పుడే యూజ‌ర్ నిర్ణ‌యం తీసుకొంటే స‌రిపోతుంది. మ‌రో ఫీచ‌ర్ . చైల్డ్ అబ్యూజ్ ఇమేజ్ డిటెక్ష‌న్ సిస్ట‌మ్‌ను ఐఫోన్స్‌కు అనుసంధానించాల‌ని యాపిల్ అందించేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. ట్రాకింగ్ హిస్ట‌రీతో చిన్నారుల ఇమేజ్‌ను దుర్వినియోగం చేసే వారిపట్ల ఇది అప్ర‌మత్తంగా ఉంటుంది. ఈ రెండు ఫీచ‌ర్ల‌లో స‌మ‌స్య‌లు ఉన్నాయి.

    మొద‌టిది ప‌ర్స‌న‌లైజ్డ్ యాడ్స్ ఫీచ‌ర్‌లో ఈ ఫీచ‌ర్ ట‌ర్న్ఆఫ్ చేసుకొంటే ప‌ర్స‌న‌లైజ్డ్ యాడ్స్ పూర్తిగా ఆగిపోవు. అయితే వ‌చ్చే ప్ర‌క‌ట‌నల సంఖ్య‌ను త‌గ్గించ‌వ‌చ్చు అంతే. థార్డ్ పార్టీ ప్ర‌క‌ట‌న‌ల‌ను నియంత్రించినా.. ఫ‌స్ట్ పార్టీ ప్ర‌క‌ట‌న‌లు మాత్రం ఆగ‌వు. ఇక మ‌రో ఫీచ‌ర్ చైల్డ్ అబ్యూజ్ ఇమేజ్ డిటెక్ష‌న్ సిస్ట‌మ్ దీని ద్వారా వినియోగ‌దారుల ప్రైవ‌సీకి భంగం వాటిస‌ల్లే అవ‌కాశం ఉంద‌ని దీనిపై న్యాయ స‌ల‌హాతోపాటు వినియోగదారుల ఫీడ్ బ్యాక్ తీసుకొంటున్న‌ట్టు యాపిల్ తెలిపింది.
    Published by:Sharath Chandra
    First published: